Pathaan First Day Collection: ప‌ఠాన్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ - కేజీఎఫ్ -2ను బీట్ చేయ‌లేక‌పోయిన షారుఖ్ సినిమా-shahrukh khan pathan movie first day collection worldwide ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Shahrukh Khan Pathan Movie First Day Collection Worldwide

Pathaan First Day Collection: ప‌ఠాన్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ - కేజీఎఫ్ -2ను బీట్ చేయ‌లేక‌పోయిన షారుఖ్ సినిమా

Nelki Naresh Kumar HT Telugu
Jan 26, 2023 11:38 AM IST

Pathaan First Day Collection: షారుఖ్‌ఖాన్ ప‌ఠాన్ సినిమా తొలిరోజు 51 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. బాలీవుడ్‌లో ఫ‌స్ట్ డే హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది.

షారుఖ్‌ఖాన్
షారుఖ్‌ఖాన్

Pathaan First Day Collection: షారుఖ్‌ఖాన్ ప‌ఠాన్ మూవీ ఫ‌స్ట్ డే బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. బుధ‌వారం రోజు ఈ సినిమా 51 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్లు స‌మాచారం. తొలిరోజు హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన బాలీవుడ్‌ సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. గ‌తంలో హృతిక్ రోష‌న్‌, టైగ‌ర్ ష్రాఫ్ హీరోలుగా న‌టించిన వార్ సినిమా 53.3 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది.

అలాగే య‌శ్ కేజీఎఫ్ -2 హిందీ వెర్ష‌న్ అత్య‌ధికంగా 53. 9 కోట్ల క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ది. అమీర్‌ఖాన్ థ‌గ్స్ ఆఫ్ హిందుస్థాన్ టాక్‌తో సంబంధం లేకుండా 52 కోట్లు క‌లెక్ట్ చేసింది. వాటి త‌ర్వాత స్థానంలో హ‌య్యెస్ట్ ఓపెనింగ్స్ రాబ‌ట్టిన‌ సినిమాగా ప‌ఠాన్ నిలిచింది.

క‌లెక్ష‌న్స్ ప‌రంగా కేజీఎఫ్ -2ను ప‌ఠాన్ బీట్ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. క‌థ విష‌యంలో మిక్స‌డ్ టాక్ రావ‌డంతో య‌శ్ రికార్డ్‌ను షారుఖ్ సినిమా బ్రేక్ చేయ‌లేక‌పోయింది. గురువారం ప‌బ్లిక్ హాలీడే ఉండ‌టంతో ఈ సినిమా క‌లెక్ష‌న్స్ తొలిరోజు పోలిస్తే మ‌రింత పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

గురువారం క‌లెక్ష‌న్స్‌తో ప‌ఠాన్ వంద కోట్లు ఈజీగా దాటుతుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇందులో ఇండియ‌న్ రా ఏజెంట్ ప‌ఠాన్‌గా షారుఖ్‌ఖాన్ న‌టించ‌గా ఐఎస్ఐ ఏజెంట్ పాత్ర‌లో దీపికా ప‌డుకోణ్ క‌నిపించింది. భార‌త‌దేశంపై దాడికి ప్లాన్ చేసిన ఓ ప్రైవేట్ ఏజెంట్ ప్లాన్‌ను ప‌ఠాన్ ఎలా ఎదుర్కొన్నాడ‌న్న‌దే ఈ సినిమా ఇతివృత్తం.

క‌థ కంటే యాక్ష‌న్ అంశాల‌కే అధికంగా ప్రాముఖ్య‌త‌నిస్తూ ద‌ర్శ‌కుడు సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాను తెర‌కెక్కించాడు. ప‌ఠాన్ సినిమాలో స‌ల్మాన్‌ఖాన్ అతిథి పాత్ర‌లో న‌టించాడు.

IPL_Entry_Point