Kangana Ranaut on Pathaan: ఇలాంటి సినిమాలే కావాలి.. పఠాన్‌పై కంగనా ప్రశంసలు-kangana ranaut on pathaan says these kind of films should do well ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Kangana Ranaut On Pathaan Says These Kind Of Films Should Do Well

Kangana Ranaut on Pathaan: ఇలాంటి సినిమాలే కావాలి.. పఠాన్‌పై కంగనా ప్రశంసలు

Hari Prasad S HT Telugu
Jan 26, 2023 12:05 PM IST

Kangana Ranaut on Pathaan: ఇలాంటి సినిమాలే కావాలి అంటూ పఠాన్‌పై కంగనా రనౌత్ ప్రశంసలు కురిపించడం విశేషం. బుధవారం (జనవరి 25) రిలీజైన ఈ మూవీ తొలి రోజే బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొట్టిన విషయం తెలిసిందే.

కంగనా రనౌత్, అనుపమ్ ఖేర్.. పఠాన్ మూవీలో షారుక్, దీపికా పదుకోన్
కంగనా రనౌత్, అనుపమ్ ఖేర్.. పఠాన్ మూవీలో షారుక్, దీపికా పదుకోన్

Kangana Ranaut on Pathaan: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన మూవీ పఠాన్. అప్పుడెప్పుడో 2018లో వచ్చిన జీరో మూవీ తర్వాత షారుక్ నటించిన సినిమా కావడంతో ఈ పఠాన్ కు చాలా రోజులుగా ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్సే రికార్డులు క్రియేట్ చేయగా.. తొలి రోజే రూ.50 కోట్లకుపైగా వసూలు చేసింది. ఇక బాలీవుడ్ పనైపోయిందనుకున్న తరుణంలో ఈ పఠాన్ మూవీ మళ్లీ ఆశలు రేపింది.

దీంతో ఈ సినిమాపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రశంసలు కురిపించింది. ఇలాంటి సినిమాలే కావాలని ఆమె అనడం గమనార్హం. తన ఎమర్జెన్సీ మూవీ షూటింగ్ పూర్తయిన తర్వాత ఏర్పాటు చేసిన పార్టీలో కంగనా ఈ కామెంట్స్ చేసింది. ఈ సినిమాలో నటించిన అనుపమ్ ఖేర్, సతీష్ కౌషిక్ లతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడింది. పఠాన్ సినిమా బాగా ఆడాలని ఆమె కోరుకుంది.

"పఠాన్ బాగా ఆడుతోంది. ఇలాంటి సినిమాలు ఆడాలి కూడా. మన హిందీ సినిమా వాళ్లు వెనుకబడిపోయిన ఈ సమయంలో ప్రతి ఒక్కరూ తమ స్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు" అని కంగనా చెప్పింది. ఆ సమయంలో పక్కనే ఉన్న అనుపమ్ ఖేర్ కూడా.. పఠాన్ పెద్ద సినిమా.. భారీ బడ్జెట్ తో రూపొందించారు అని అన్నాడు. సౌత్ సినిమాల హవాలో హిందీ సినిమా కొట్టుకుపోతున్న సమయంలో పఠాన్ బాలీవుడ్ లో కొత్త ఆశలు రేపిందనడంలో సందేహం లేదు.

సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ స్పై థ్రిల్లర్ మూవీ ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. నాలుగేళ్ల తర్వాత షారుక్ ను ఇలా పూర్తిగా ఓ యాక్షన్ మూవీలో చూస్తుండటంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నాయి. ఈ సినిమా తొలి రోజే రూ.50 కోట్లకుపైగా వసూలు చేయడంతోపాటు గురువారం సెలవు, రానున్నది వీకెండ్ కావడంతో భారీ వసూళ్లు ఖాయమన్న అంచనాలు ఉన్నాయి.

నిజానికి సినిమా రిలీజైన రోజు సెలవు కూడా కాదు. అయినా పఠాన్ ఆ స్థాయి వసూళ్లు సాధించింది. తొలి రోజే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో 90 వేల టికెట్లు అమ్ముడైనట్లు అంచనా.

IPL_Entry_Point

సంబంధిత కథనం