Selfiee Movie Day 1 Collection: అక్ష‌య్‌కుమార్‌కు షాకిచ్చిన‌ సెల్ఫీ - తొలిరోజు కోటిన్న‌ర మాత్ర‌మే క‌లెక్ష‌న్స్‌-selfie day 1 collection akshay kumar movie slow start at boxoffice
Telugu News  /  Entertainment  /  Selfie Day 1 Collection Akshay Kumar Movie Slow Start At Boxoffice
అక్ష‌య్ కుమార్, ఇమ్రాన్ హ‌ష్మీ
అక్ష‌య్ కుమార్, ఇమ్రాన్ హ‌ష్మీ

Selfiee Movie Day 1 Collection: అక్ష‌య్‌కుమార్‌కు షాకిచ్చిన‌ సెల్ఫీ - తొలిరోజు కోటిన్న‌ర మాత్ర‌మే క‌లెక్ష‌న్స్‌

25 February 2023, 9:07 ISTNelki Naresh Kumar
25 February 2023, 9:07 IST

Selfie Movie Day 1 Collection: అక్ష‌య్‌కుమార్ హీరోగా న‌టించిన సెల్ఫీ సినిమాకు తొలిరోజు షాకింగ్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. అక్ష‌య్ కెరీర్‌లో అతి త‌క్కువ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన సినిమాగా సెల్ఫీ నిలిచింది.

Selfie Movie Day 1 Collection: అక్ష‌య్ కుమార్, ఇమ్రాన్ హ‌ష్మీ హీరోలుగా న‌టించిన సెల్ఫీ సినిమా శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా తొలిరోజు ఈ సినిమాకు కేవ‌లం మూడు కోట్ల క‌లెక్ష‌న్స్ మాత్ర‌మే రావ‌డం బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. నేష‌న‌ల్ మ‌ల్టీప్లెక్స్‌ల‌లో శుక్ర‌వారం సెల్ఫీ సినిమాకు కోటిన్న‌ర వ‌సూళ్లు వ‌చ్చాయి.

అక్ష‌య్ లాంటి స్టార్ హీరో న‌టించిన సినిమాకు మూడు కోట్ల క‌లెక్ష‌న్స్ రావ‌డం బాలీవుడ్ వ‌ర్గాల‌ను విస్మ‌య‌ప‌రుస్తోంది. అక్ష‌య్ కెరీర్‌లో తొలిరోజు అతి త‌క్కువ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన సినిమాగా సెల్ఫీ నిలిచింది. బ‌చ్చ‌న్ పాండే, సామ్రాట్ పృథ్వీరాజ్‌తో పాటు అక్ష‌య్‌కుమార్ గ‌త ఏడాది న‌టించిన ఆరు సినిమాలు డిజాస్ట‌ర్స్‌గా నిలిచాయి.

ఆ ప్ర‌భావం సెల్ఫీపై ప‌డిన‌ట్లు బాలీవుడ్ ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అందువ‌ల్లే క‌లెక్ష‌న్స్ త‌గ్గిన‌ట్లు పేర్కొంటున్నారు. కామెడీ డ్రామాగా తెర‌కెక్కిన సెల్ఫీ సినిమాకు రాజ్ మెహ‌తా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఓ సినిమా స్టార్‌కు ఆర్‌టీఓ అధికారికి మ‌ధ్య నెల‌కొన్న ఈగో స‌మ‌స్య‌ల‌ నేప‌థ్యంలో ఈ సినిమా రూపొందింది.

ఇందులో అక్ష‌య్ కుమార్ సూప‌ర్ స్టార్ విజ‌య్ కుమార్ పాత్ర‌లో న‌టించ‌గా ఆర్‌టీఓ ఆఫీస‌ర్‌గా ఇమ్రాన్ హ‌ష్మీ క‌నిపించాడు. డ‌యానాపెంటీ, నుష్ర‌త్ బ‌రుచా హీరోయిన్లుగా న‌టించారు. సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించింది. మ‌ల‌యాళంలో విజ‌య‌వంత‌మైన డ్రైవింగ్ లైసెన్స్ సినిమా ఆధారంగా సెల్ఫీ రూపొందింది.

టాపిక్