Akshay Kumar Raksha Bandhan OTT Release Date: అక్షయ్ కుమార్ రక్షా బంధన్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ రివీల్
Akshay Kumar Raksha Bandhan OTT Release Date: అక్షయ్ కుమార్ రక్షా బంధన్ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ రివీల్ చేశారు. ఈ ఫ్యామిలీ డ్రామా సినిమా ఓటీటీలో ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కానుందంటే...
Akshay Kumar Raksha Bandhan OTT Release Date: అక్షయ్ కుమార్ హీరోగా నటించిన రక్షా బంధన్ సినిమా ఈ ఏడాది ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆమిర్‌ఖాన్ లాల్ సింగ్ ఛడ్డాకు పోటీగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలింది. వంద కోట్ల వ్యయంతో రూపొందిన రక్షా బంధన్ యాభై కోట్ల లోపే వసూళ్లను రాబట్టి ఎగ్జిబిటర్లు, నిర్మాతలకు భారీగా నష్టాలను మిగిల్చింది.

ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించాడు. ఇందులో నలుగురు చెల్లెళ్లకు అన్నగా అక్షయ్ కుమార్ నటించాడు. చెల్లెళ్లకు పెళ్లిళ్లు చేసిన తర్వాతే తాను పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే క్రమంలో అక్షయ్‌కుమార్‌కు ఎదురయ్యే పరిణామాలతో వినోదాత్మకంగా ఈ సినిమా రూపొందింది.
అక్షయ్ నటన బాగున్నా అవుట్ డేటెడ్ కామెడీ కారణంగా ఈ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. థియేటర్లలో నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న రక్షా బంధన్ సినిమా తాజాగా ఓటీటీలో రిలీజ్ కాబోతున్నది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ను శనివారం మేకర్స్ వెల్లడించారు.
దసరా సందర్భంగా అక్టోబర్ 5 నుంచి జీ5లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. దాదాపు 30 కోట్ల భారీ ధరకు రక్షాబంధన్ డిజిటల్ రైట్స్‌ను జీ5 సంస్థ కొనుగోలు చేసినట్లు సమాచారం. రక్షా బంధన్ సినిమాలో భూమి ఫడ్నేకర్ హీరోయిన్‌గా నటించింది. సాదియా ఖతీబ్, స్మృతి శ్రీకాంత్, దీపికా ఖన్నా, షాహెజ్ మీన్ కౌర్ ప్రధాన పాత్రల్లో నటించారు.