Salaar New Poster: ఫ్యాన్స్‌కు స‌లార్ టీమ్ ప్ర‌భాస్ బ‌ర్త్‌డే ట్రీట్ - కొత్త పోస్ట‌ర్ రిలీజ్‌-salaar team shares prabhas rugged look poster on his birthday ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Salaar Team Shares Prabhas Rugged Look Poster On His Birthday

Salaar New Poster: ఫ్యాన్స్‌కు స‌లార్ టీమ్ ప్ర‌భాస్ బ‌ర్త్‌డే ట్రీట్ - కొత్త పోస్ట‌ర్ రిలీజ్‌

Nelki Naresh Kumar HT Telugu
Oct 24, 2022 06:31 AM IST

Salaar New Poster: ప్ర‌భాస్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా స‌లార్ కొత్త పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పోస్ట‌ర్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది.

ప్ర‌భాస్
ప్ర‌భాస్

Salaar New Poster: ప్ర‌భాస్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా స‌లార్ టీమ్ ఇంటెన్స్ పోస్ట‌ర్ రిలీజ్ చేసింది. ఈ పోస్ట‌ర్‌లో శ‌త్రువుల‌పై పోరాటానికి సిద్ధ‌మైన‌ట్లుగా ప‌వ‌ర్‌ఫుల్ లుక్‌లో ప్ర‌భాస్ క‌నిపిస్తున్నాడు. అత‌డి లుక్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. అలాగే ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ కూడా ప్ర‌భాస్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు అంద‌జేస్తూ స‌లార్ వ‌ర్కింగ్ స్టిల్‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. నీ కెరీర్‌లో ఎప్ప‌టికీ గుర్తుండిపోయేలా ఈ ఏడాది ప్ర‌త్యేకంగా నిలిచిపోవ‌డానికి మా వంతు కృషి చేస్తున్నాం అంటూ ఫొటోకు క్యాప్ష‌న్ జోడించాడు.

ఈ ఫొటోలో ప్ర‌శాంత్ నీల్ మాట‌ల‌కు ప్ర‌భాస్ న‌వ్వుతూ క‌నిపిస్తున్నాడు. చిత్ర నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిల్మ్స్ కూడా ప్ర‌భాస్ వ‌ర్కింగ్ స్టిల్‌ను త‌మ ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో ఖాకీ డ్రెస్‌లో ప్ర‌భాస్ క‌నిపిస్తున్నాడు. స‌లార్‌కు సంబంధించిన ప్ర‌భాస్ పోస్ట‌ర్‌, వ‌ర్కింగ్ స్టిల్స్‌ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. దాదాపు రెండు వంద‌ల కోట్ల వ్య‌యంతో తెర‌కెక్కుతున్న ఈ సినిమాను పాన్ ఇండియ‌న్ స్థాయిలో తెలుగు, క‌న్న‌డం, త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్నారు.

శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఆద్య అనే జ‌ర్న‌లిస్ట్‌గా ఆమె క‌నిపించ‌బోతున్న‌ది. విల‌న్‌గా మ‌ల‌యాళ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్ న‌టిస్తున్నాడు. ఇటీవ‌లే అత‌డి ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. వ‌చ్చే స‌లార్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

IPL_Entry_Point