Dhamaka Movie Release date: ధమాకా రిలీజ్ డేట్ కన్ఫార్మ్.. క్రిస్మస్‌కు మాస్ మహారాజా సందడి-ravi teja new movie dhamaka will release on 2022 december 23rd ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ravi Teja New Movie Dhamaka Will Release On 2022 December 23rd

Dhamaka Movie Release date: ధమాకా రిలీజ్ డేట్ కన్ఫార్మ్.. క్రిస్మస్‌కు మాస్ మహారాజా సందడి

Maragani Govardhan HT Telugu
Oct 25, 2022 12:19 PM IST

Dhamaka Movie Release date: మాస్ మాహారాజా రవితేజ నటిస్తోన్న తాజా చిత్రం ధమాకా. శ్రీలీల హీరోయిన్‌గా చేస్తోన్న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

రవితేజ ధమాకా విడుదల తేదీ ప్రకటన
రవితేజ ధమాకా విడుదల తేదీ ప్రకటన

Dhamaka Movie Release date: మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ధమాకా. రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. సినిమా విడుదల తేదీని ప్రకటించింది.

దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ధమాకా విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్. డిసెంబర్ 23న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఇటివలే విడుదలైన మాస్ క్రాకర్ టీజర్ సినిమా ట్యాగ్ లైన్ కి తగ్గట్టు ‘డబుల్ ఇంపాక్ట్’ క్రియేట్ చేసింది.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ధమాకా సినిమాకు నిర్మాతగా టీజీ విశ్వ ప్రసాద్, సహ నిర్మాతగా వివేక్ కూచిబొట్ల వ్యవహరించారు. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించాడు. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, మాటలు అందిస్తున్నారు. భీమ్స్ సిసిరిలియో సంగీతాన్ని సమకూర్చగా.. కార్తీక్ ఘట్టమనేని కెమెరామన్‌గా పనిచేశాడు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్