Rashmika Mandanna's GoodBye poster out ఫ్యాన్స్‌కు రష్మిక సర్‌ప్రైజ్.. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసిన బ్యూటీ
Goodbye First look Poster: రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్ చిత్రం గుడ్‌బై తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసిందీ ముద్దుగుమ్మ. ఈ సినిమా అక్టోబరు 7న విడుదల కానుంది.
Goodbye First look Poster released: నేషనల్ క్రష్ రష్మికా మందన్నా నటించిన సీతా రామం సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విజయంతో రష్మిక వరుస పెట్టి అవకాశాలు దక్కించుకుంటోంది. ప్రస్తుతం బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టిన ఈ అమ్మడు.. అక్కడ పాగా వేయాలని ఆశిస్తోంది. తాజాగా హిందీలో తను నటించిన మొదటి చిత్రం గుడ్‌బై అప్డేట్‌ను సోషల్ మీడియా వేదికగా తెలియజేసి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సినిమాకు చెందిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేసింది. ఈ చిత్రంలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్రలో నటించారు.
ట్రెండింగ్ వార్తలు
గుడ్ బై ఫస్ట్ లుక్ పోస్టర్‌ను పంచుకున్న రష్మిక.. తన సర్‌ప్రైజ్ ఎలా ఉందంటూ అభిమానులను కోరింది. మా నాన్న, నేను మిమ్మల్ని కలుసుకోడానికి అక్టోబరు 7వ తేదీన రాబోతున్నాను అంటూ రష్మిక తన ట్విటర్ వేదికగా పోస్టర్‌ను విడుదల చేసింది.
ఈ పోస్టర్‌ను గమనిస్తే.. అమితాబ్ గాలిపటాన్ని ఎగరేస్తున్నట్లు ఉంది. వెనుక నుంచి చూస్తున్న రష్మిక ఆకర్షణీయంగా కనిపించింది. ఈ పోస్టర్‌ను అమితాబ్ కూడా తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. కుటుంబం కంటే ముఖ్యమైంది ఏది లేదు. ఎవరూ మీకు దగ్గరలో లేనప్పుడు అప్పుడు కూడా వారి భావన అలాగే ఉంటుంది అని అమితాబ్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలియజేశారు.
వీరి పోస్టులను బట్టి చూస్తే ఈ సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. అమితాబ్ తండ్రిగా.. ఆయన కూతురి పాత్రలో రష్మిక నటించనున్నట్లు తెలుస్తోంది. కుటుంబ బంధాన్ని అందంగా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు. వికాస్ బాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఏక్తా కపూర్, శోభా కపూర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అక్టోబరు 7వ తేదీని రాబోతుంది.
సౌత్ నుంచి బాలీవుడ్‌కు రష్మిక మందన్నా ఆనతి కాలంలో అదిరిపోయే ఆఫర్లను దక్కించుకుంటోంది. ప్రస్తుతం గుడ్ బై మూవీ తర్వాత సిద్ధార్థ్ మల్హోత్రాతో మిషన్ మజ్నూ అనే సినిమాకు ఓకే చెప్పింది. ఇది కాకుండా అల్లు అర్జున్‌తో పుష్ప ది రూల్‌లోనూ నటిస్తోంది.
సంబంధిత కథనం
Satya Dev - Krishnamma: సత్యదేవ్ కృష్ణమ్మ టైటిల్ సాంగ్ రిలీజ్
September 03 2022