Ramgopal Varma Vyuham: వైఎస్ జ‌గ‌న్ పాత్ర‌లో రంగం యాక్ట‌ర్ - వ్యూహం రియ‌ల్ పిక్ అంటోన్న వ‌ర్మ‌-rangam ajmal to play ys jagan role in ramgopal varma vyuham movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Rangam Ajmal To Play Ys Jagan Role In Ramgopal Varma Vyuham Movie

Ramgopal Varma Vyuham: వైఎస్ జ‌గ‌న్ పాత్ర‌లో రంగం యాక్ట‌ర్ - వ్యూహం రియ‌ల్ పిక్ అంటోన్న వ‌ర్మ‌

HT Telugu Desk HT Telugu
Jun 01, 2023 04:51 PM IST

Ramgopal Varma Vyuham: వైఎస్ జ‌గ‌న్ జీవితం ఆధారంగా వ్యూహం సినిమాతో ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ ఓ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నాడు. ఈ సినిమా పోస్ట‌ర్స్‌ను గురువారం రిలీజ్ చేశాడు వ‌ర్మ‌.

రామ్‌గోపాల్ వ‌ర్మ  వ్యూహం
రామ్‌గోపాల్ వ‌ర్మ వ్యూహం

Ramgopal Varma Vyuham: బ‌యోపిక్‌లు, వాస్తవ ఘ‌ట‌న‌ల‌తో సినిమాలు చేయ‌డంలో ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ (Ramgopal Varma) ముందుంటాడు. తాజాగా ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ జీవితం ఆధారంగా వ్యూహం పేరుతో రామ్‌గోపాల్‌ వ‌ర్మ ఓ సినిమాను తెర‌కెక్కించేందుకు స‌న్నాహాలు చేస్తోన్నారు.

వ్యూహం సినిమాలో వైఎస్ జ‌గ‌న్ (Ys jagan) పాత్ర‌లో రంగం ఫేమ్ ఆజ్మ‌ల్ న‌టించ‌బోతున్న‌ట్లు వ‌ర్మ ప్ర‌క‌టించాడు. భార‌తి పాత్ర‌లో మాన‌స న‌టించ‌నున్న‌ట్టు తెలిపాడు.

గురువారం ఈ సినిమా స్టిల్స్‌ను వ‌ర్మ రిలీజ్ చేశారు. ఇందులో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఫోటోపై చేతిని ఆనించి దీర్ఘ ఆలోచ‌న‌లో ఆజ్మ‌ల్ క‌నిపిస్తోన్నాడు. మాన‌స లుక్ అచ్చం జ‌గ‌న్ భార్య భార‌తిని త‌ల‌పిస్తూ క‌నిపిస్తోంది.

ఈ స్టిల్స్ సోష‌ల్ మీడియాలోవైర‌ల్ అవుతోన్నాయి. వ్యూహం బ‌యోపిక్ కంటే లోతైన రియ‌ల్ పిక్ అని రామ్‌గోపాల్ వ‌ర్మ పేర్కొన్నాడు. వ్యూహం సినిమాలో నూటికి నూరుపాళ్లు నిజాల‌నే చూపించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు.

అహంకారానికి, ఆలోచ‌న‌కు మ‌ధ్య జ‌రిగే సంఘ‌ర్ష‌ణ నేప‌థ్యంలో పొలిటిక‌ల్ క‌థాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్న‌ట్లు వ‌ర్మ పేర్కొన్నాడు. రాజ‌శేఖ‌ర్‌రెడ్డి మ‌ర‌ణం త‌ర్వాత జ‌గ‌న్ జీవితంలో ఎదురైన ప‌రిణామాల‌ను వ్యూహం సినిమాలో వ‌ర్మ‌ చూపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

వ్యూహం సినిమాను రామ‌దూత క్రియేష‌న్స్ ప‌తాకంపై దాస‌రి కిర‌ణ్ కుమార్ నిర్మించ‌బోతున్న‌ట్లు తెలిసింది. గ‌త కొన్నేళ్లుగా రామ్‌గోపాల్‌వ‌ర్మ‌కు స‌రైన విజ‌యాలు లేవు. చివ‌ర‌గా గ‌త ఏడాది కొండా సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు వ‌ర్మ‌. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్‌గా మిగిలింది.

IPL_Entry_Point