Brahmastra Pre Release Promo: బ్రహ్మాస్త్ర నుంచి ప్రీ రిలీజ్ ప్రోమో విడుదల.. ఇందులో ఏం చూపించారంటే?-ranbir kapoor new movie brahmastra pre release promo video released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Ranbir Kapoor New Movie Brahmastra Pre Release Promo Video Released

Brahmastra Pre Release Promo: బ్రహ్మాస్త్ర నుంచి ప్రీ రిలీజ్ ప్రోమో విడుదల.. ఇందులో ఏం చూపించారంటే?

Maragani Govardhan HT Telugu
Sep 03, 2022 08:04 PM IST

Brahmastra Pre Release Promo: రణ్‌బీర్ కపూర్ నటించిన తాజా చిత్రం బ్రహ్మాస్త్ర. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రోమో వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ట్రైలర్‌లో లేని సన్నివేశాలను ఇందులో పొందుపరిచారు.

బ్రహ్మాస్త్ర ప్రి రీలీజ్ ప్రోమో
బ్రహ్మాస్త్ర ప్రి రీలీజ్ ప్రోమో (Twitter)

Brahmastra Pre Release Promo Release: రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ నటించిన తాజా చిత్రం బ్రహ్మాస్త్ర. ఈ సినిమాకు అయ్యన్ ముఖర్జి దర్శకత్వం వహించారు. శుక్రవారం నాడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సినిమాకు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరై మూవీ టీమ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పాటలు, టీజర్, ట్రైలర్లు, ప్ర్తత్యేక వీడియోలు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. తాజాగా మరో వీడియోను విడుదల చేసింది చిత్రబృందం.

ట్రెండింగ్ వార్తలు

సెప్టెంబరు 9న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానున్న ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ ప్రోమోను విడుదల చేసింది. ఈ ప్రోమోను గమనిస్తే.. ట్రైలర్‌లో లేనివి, సినిమాలో కీలకమైన సన్నివేశాలకు సంబంధించిన గ్లింప్స్‌ను ఇందులో చూపించారు. అంతేకాకుండా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయని ఈ వీడియో ద్వారా తెలిపారు.

ఈ చిత్రాన్ని తెలుగులో బ్రహ్మాస్త్రం పేరుతో విడుదల చేయనున్నారు. దర్శక దిగ్గజం రాజమౌళి ఈ సినిమాకు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. దీంతో సినిమాపై భారీగా బజ్ ఏర్పడింది. 2డీ, 3డీ, ఐమ్యాక్స్ 3డీ ఫార్మాట్లలో ఈ సినిమా ప్రదర్శితమవుతుందని చిత్రబృందం ఇప్పటికే తెలిపింది. అంతేకాకుండా హాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ ఈ సినిమాను గ్లోబల్ స్థాయి దిశగా తీసుకెళ్తోంది.

రణ్‌బీర్ కపూర్-ఆలియా భట్ తొలిసారిగా కలిసి నటించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాల ఇతిహాసాల ఆధారంగా దర్శకుడు అయ్యన్ ముఖర్జి తెరకెక్కించారు. నరాస్త్ర, నంది అస్త్ర, ప్రభాస్త్ర, జలాస్త్ర, పవనాస్త్ర, బ్రహ్మాస్త్రలకు సంబంధించిన పురాణ గాథలు, వాటి శక్తిని గురించి ఈ సినిమాలో వివరించనున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా విడుదల కానుంది.

సంబంధిత కథనం

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.