Prabhas Arrange food for Fans: అంత బాధలోనూ ఆతిథ్యాన్ని విడవలేదు.. అభిమానుల ఆకలిని మరువలేదు
Prabhas Food Arrangements: పెదనాన్న మరణంతో పుట్టెడు దుఃంఖంతో ఉన్న ప్రభాస్.. తన అభిమానులను మాత్రం మరువలేదు. కడసారిగా కృష్ణంరాజును చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్ ఆకలిని తీర్చారు. భోజనం తిని వెళ్లేలా ఏర్పాట్లు చేశారు.

Prabhas Arrange food for his fans: టాలీవుడ్ సీనియర్ నటులు, రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆదివారం కాలం చేసిన సంగతి తెలిసిందే. సోమవారం నాడు ఆయన అంత్యక్రియలను నిర్వహించారు. కృష్ణంరాజు మరణవార్త విని కడసారిగా ఆయనను చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది అభిమానులు, శ్రేయోభిలాషులు హైదరాబాద్‌కు చేరుకుని రెబల్‌స్టార్‌కు తుది వీడ్కోలు పలికారు. పెదనాన్న మరణంతో ప్రభాస్ కన్నీరు మున్నీరయ్యారు. అయితే అంత బాధలోనూ మన డార్లింగ్ తన గొప్పమనస్సును చాటుకున్నారు. విషాదంలోనూ ఆతిథ్యాన్ని విడువ లేదు.. అభిమానుల ఆకలిని మరువలేదు. కృష్ణంరాజును చూసేందుకు వచ్చిన వేలాది మంది అభిమానులకు భోజన వసతిని కల్పించారు.
తాను బాధల్లో ఉన్నప్పటికీ దూరం నుంచి అభిమానుల ఆకలిని తీర్చేందుకు భోజన ఏర్పాట్లలో ఎలాంటి కొరత జరగకూడదని తన సన్నిహితులు సూచించారట. కృష్ణంరాజు పార్థివదేహాన్ని చూసేందుకు విచ్చేసిన ప్రతి ఒక్కరూ భోజనం చేసేలా చూడాలని ఆదేశించారట. అంతేకాకుండా భోజనం చేశారా లేదా అని అడిగి మరీ ఆతిథ్యాన్ని కల్పించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రభాస్ కుటుంబ సభ్యులు.. అభిమానులను భోజనం చేయమని ఆడగడం ఇందులో ఉంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా ఈ వీడియోపై విశేషంగా స్పందిస్తున్నారు. బాధల్లోనూ పరుల ఆకలిని మరువలేదని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
పెదనాన్న మరణంతో మీరు తిన్నారో లేదో తెలియదు కానీ.. వచ్చినవారికి మాత్రం కడుపునిండా తిండి పెట్టారు. అభిమానిగా నా జీవితానికి ఇంతకంటే ఏం వద్దు. జాగ్రత్తగా ఉండు ప్రభాస్ అన్న అంటూ ఓ అభిమాని ట్విటర్ వేదికగా ప్రభాస్ గురించి పోస్ట్ పెట్టాడు.
సంబంధిత కథనం