Adipurush 3D Teaser launch: ఆదిపురుష్.. సెల్‌లో చూసేది కాదు.. హాల్‌లో చూసే చిత్రం.. దిల్ రాజు వ్యాఖ్యలు -prabhas adipurush 3d teaser launch event held in hyderabad ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Adipurush 3d Teaser Launch: ఆదిపురుష్.. సెల్‌లో చూసేది కాదు.. హాల్‌లో చూసే చిత్రం.. దిల్ రాజు వ్యాఖ్యలు

Adipurush 3D Teaser launch: ఆదిపురుష్.. సెల్‌లో చూసేది కాదు.. హాల్‌లో చూసే చిత్రం.. దిల్ రాజు వ్యాఖ్యలు

Maragani Govardhan HT Telugu
Oct 06, 2022 09:20 PM IST

Adipurush 3D Teaser: ప్రభాస్ నటించిన తాజా చిత్రం ఆదిపురుష్ 3డీ టీజర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శకుడు ఓం రౌత్ సహా ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు, తదితరులు హాజరయ్యారు.

ఆదిపురుష్ 3డీ టీజర్ లాంచ్
ఆదిపురుష్ 3డీ టీజర్ లాంచ్ (Twitter)

Adipurush 3D Teaser launch: పాన్ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ టీజర్ ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ టీజర్‌కు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా విపరీతంగా ట్రోలింగ్‌కు గురైంది. అయితే ఇవన్నీ తాము ముందుగానే ఊహించినట్లు డైరెక్టర్ ఓం రౌత్ తెలిపారు. తాజాగా ఈ చిత్ర 3డీ టీజర్‌ను హైదరాబాద్‌లో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభాస్, ఓం రౌత్, దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. ప్రతి సినిమాకు ఆరంభంలో నెగిటివ్ టాక్స్ రావడం సాధారణమని, కొంతమంది ఎప్పుడూ ప్రతికూలంగానే ఆలోచిస్తారని ఆయన అన్నారు. "ఆదిపురుష్ సినిమా ఎప్పుడు వస్తుందాని ప్రభాస్ అభిమానులతో పాటు నేను కూడా ఆసక్తిగా ఎదురుచూశా. టీజర్ రాగానే నేనూమొదట ఫొన్‌లోనే చూశా. వెంటనే ప్రభాస్‌కు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. వెంటనే వాయిస్ మెసేజ్ పెట్టా. బయట రెస్పాన్స్ కనుక్కొందామని నలుగైదరికీ మెసేజ్ చేస్తే.. ట్రోలింగ్ చేస్తున్నారని చెప్పారు. బాహుబలి మొదటి పార్ట్‌కు బయటకు వచ్చినప్పుడు అందరూ ట్రోలింగ్ చేశారు. శివలింగాన్ని ప్రభాస్‌ ఎత్తుకుని ప్రభాస్ ఫొటోకు జండూబామ్ పెట్టి పోస్టులు చేశారు. కానీ సినిమా సూపర్‌ హిట్టయింది. ఇలాంటి సినిమాలు థియేటర్లోనే చూడాలి. సెల్‌ఫోన్‌లో చూసి అంచనా వేయలేం. అని దిల్ రాజు అన్నారు.

"రామాయణం నుంచి చిన్న ఐడియా తీసుకుని రాముడు, సీత రావణుడి పాత్రలను దర్శకుడు ఓం రౌత్ తీర్చిదిద్దారు. నేటి తరం ప్రేక్షకులకు ఏం చూపించాలో అలా తీశారు. ఈ సినిమా జనవరి 12న భారీ విజయాన్ని అందుకుంటుంది. ప్రతి సినిమాకు మొదట్లో నెగటివ్ వైబ్స్ సాధారణమే. ప్రతి సినిమాకు ఇలాంటి నెగిటివిటీని తెచ్చేవాళ్లు ఉంటారు. సాధారణ ప్రేక్షకుడికి నచ్చితే చాలు." అని దిల్ రాజు స్పష్టం చేశారు.

అనంతరం దర్శకుడు ఓం రౌత్ మాట్లాడుతూ.. తాను ఏమైతే చెప్పాలనుకున్నానో అంతా దిల్ రాజు చెప్పేశారని తెలిపారు. చివర్లో ప్రభాస్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకుల ఆశీర్వాదం కావాలని, ఆది పురుష్‌ను మొదటిసారి 3డీలో చూసినప్పుడు భలే అనిపించిందని స్పష్టం చేశారు. ఫ్యాన్స్ కోసం శుక్రవారం నాడు టీజర్‌ను 60 థియేటర్లలో ప్రదర్శిస్తామని, అభిమానులే తమకు ముఖ్యమని తెలిపారు. కొద్దివారాల్లోనే అద్భుతమైన కంటెంట్‌తో ముందుకువస్తామని తెలిపారు.

<p>ప్రభాస్-దిల్ రాజు</p>
ప్రభాస్-దిల్ రాజు
IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్