Pooja Hegde to Join SSMB28: మహేష్ మూవీ సెట్స్‌లోకి పూజా హెగ్డే.. ఆ రోజు నుంచి ఫుల్ బిజీ-pooja hegde to join mahesh movie ssmb28 from december 15 in hyderabad ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Pooja Hegde To Join Mahesh Movie Ssmb28 From December 15 In Hyderabad

Pooja Hegde to Join SSMB28: మహేష్ మూవీ సెట్స్‌లోకి పూజా హెగ్డే.. ఆ రోజు నుంచి ఫుల్ బిజీ

Maragani Govardhan HT Telugu
Dec 09, 2022 04:44 PM IST

Pooja Hegde to Join SSMB28: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే.. మహేష్ బాబుతో బిజీ కానుంది. ఈ నెల 15 నుంచి మహేష్-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతోన్న ఎస్ఎస్ఎంబీ28లో భాగం కానుంది.

పూజా హెగ్డే
పూజా హెగ్డే

Pooja Hegde to Join SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసందే. గత నెలలో మహేష్ తండ్రి కృష్ణ మృతితో కాస్త గ్యాప్ తీసుకున్న ఆయన మళ్లీ షూటింగ్‌లో అడుగు పెట్టనున్నారు. ఇందుకోసం కసరత్తులు కూడా ప్రారంభించారు. మరో పక్క ఇందులో హీరోయిన్‌గా చేస్తున్న పూజా హెగ్డే కూడా ఇటీవలే మాల్దీవుల్లో తన వేకేషన్‌కు వెళ్లింది. తెలుగుతో పాటు బాలీవుడ్‌లో వరుస ఆఫర్లు దక్కించుకుంటోంది. దీంతో చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసే పనిలో పడింది. తాజాగా మహేష్-త్రివిక్రమ్ మూవీ సెట్స్‌లోకి అడుగు పెట్టనుంది.

ఈ నెల 15 నుంచి మన బుట్ట బొమ్మ ఈ చిత్రీకరణలో భాగం కానుంది. అప్పటి నుంచి ఈ సినిమా షూటింగ్‌తో ఫుల్ బిజీ కానుంది. హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగనుంది. ఇప్పటికే SSMB28కి సంబంధించి కొంత మేరకు షూటింగ్ పూర్తయింది. మరో షెడ్యూల్‌కు సంబంధించిన పనులు కూడా వేగవంతం అవుతున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 28న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.

ఈ సినిమాకు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటిగ్ బాధ్యతలు చూస్తున్నారు. మహేశ్ బాబుకు ఇది 28వ చిత్రం కావడం గమనార్హం. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

త్రివిక్రమ్ కాంబినేషన్‌లో అతడు, ఖలేజా తర్వాత వీరిద్దరికి కాస్త గ్యాప్ రావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. మహేశ్‌తో హై యాక్షన్ థ్రిల్లర్ తీసేందుకు చూస్తున్నట్లు సమాచారం.

IPL_Entry_Point

సంబంధిత కథనం