Pawan Kalyan OG Update: పవన్, సుజీత్ సినిమాపై క్రేజీ అప్‌డేట్ రివీల్ - రిలీజ్ డేట్ ఇదేనా
Pawan Kalyan OG Update:పవన్ కళ్యాణ్, సుజీత్ సినిమాకు సంబంధించిన కొత్త అప్‌డేట్‌ను గురువారం రివీల్ చేశారు. ఆ అప్‌డేట్ ఏదంటే...
Pawan Kalyan OG Update: పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సుజీత్ సినిమాపై ఓ క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో గురువారం నుంచి మొదలుపెట్టినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. పవన్‌కళ్యాణ్, ప్రియాంక అరుళ్ మోహన్‌లతో పాటు ప్రధాన తారాగణంపై నేటి నుంచి కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు సమాచారం.
దాదాపు పదిహేను రోజుల పాటు సాగనున్న ఈ షెడ్యూల్‌తో కీలకమైన టాకీపార్ట్ మొత్తం పూర్తవుతోందని అంటోన్నారు. జనవరిలో ఓపెనింగ్‌ను జరుపుకోన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్‌లో ముంబాయిలో మొదలైంది.
ముంబాయి షెడ్యూల్‌లో కొన్ని యాక్షన్ సీన్స్‌తో పాటు మహాబలేశ్వరంలో పాటను షూట్ చేశారు. కొద్ది రోజులు మాత్రమే షూటింగ్‌కు గ్యాప్ ఇచ్చిన యూనిట్ హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ను మొదలుపెట్టడం హాట్‌టాపిక్‌గా మారింది.
మరో రెండు నెలల్లో షూటింగ్ పార్ట్ మొత్తాన్ని పూర్తిచేసే ఆలోచనలో సుజీత్ ఉన్నట్లు చెబుతోన్నారు. ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్‌లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోన్నట్లు సమాచారం.
జపాన్ బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా డైరెక్టర్ సుజీత్ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఇందులో జపాన్‌కు చెందిన మార్షల్ ఆర్ట్స్ సమురాయ్ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నట్లు చెబుతోన్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది.
నాని (Nani) గ్యాంగ్‌లీడర్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ప్రియాంక అరుళ్ మోహన్. శర్వానంద్‌తో శ్రీకారం సినిమా చేసింది. అనూహ్యంగా పవన్‌తో జోడీ కట్టే అవకాశాన్ని దక్కించుకొంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తోన్నాడు.