Simhadri Pre Release Event: రీ రిలీజ్ సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ - సింహాద్రి క్రేజ్ మామూలుగా లేదుగా
Simhadri Pre Release Event: ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న సింహాద్రి సినిమా రీ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. కాగా రీ రిలీజ్ సినిమా కోసం భారీగా ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నట్లు సమాచారం.
Simhadri Pre Release Event: ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా మే 20న సింహాద్రి సినిమా థియేటర్లలో రీ రిలీజ్ కానున్న సంగతి తెలిసింది. ఇప్పటికే ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ చేశారు. బుక్‌మై షోతో పాటు ఇతర టికెట్ బుకింగ్స్ యాప్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతోన్నాయి. తాజాగా ఈ రీ రిలీజ్ మూవీకి ప్రమోషన్స్‌ను భారీగా ప్లాన్ చేస్తోన్నట్లు తెలిసింది. మే 17న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నట్లు చెబుతోన్నారు.
ట్రెండింగ్ వార్తలు
హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో పెద్ద ఎత్తున ఈవెంట్‌ను నిర్వహించబోతున్న ఈ ఈవెంట్‌కు రాజమౌళి, కీరవాణితో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు హాజరుకాబోతున్నట్లు సమాచారం. ఎన్టీఆర్‌కు కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ కొరటాల శివ సినిమా షూటింగ్‌తో ఎన్టీఆర్ బిజీగా ఉండటంతో అతడు ఈ వేడుకకు వచ్చేది అనుమానంగా మారింది.
యాక్షన్ అంశాలకు ఫ్యామిలీ ఎమోషన్స్ జోడించి దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి సింహాద్రి సినిమాను తెరకెక్కించారు. దాదాపు ఏడు కోట్ల బడ్జెట్‌తో 2003లో రిలీజైన ఈ మూవీ 30 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది.
ఇందులో సింగమలై, సింహాద్రిగా డ్యూయల్ షేడ్ క్యారెక్టర్‌లో ఎన్టీఆర్ కనిపించాడు. మాస్, క్లాస్ రోల్‌లో తన న టనతో అభిమానులను మెప్పించాడు. భూమిక, అంకిత హీరోయిన్లుగా నటించారు. రమ్యకృష్ణ స్పెషల్ సాంగ్‌లో నటించింది. కీరవాణి సంగీతాన్ని అందించాడు. కాగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్‌సీస్‌లో
సింహాద్రిని రీ రిలీజ్ చేయబోతున్నారు. వరల్డ్‌లోనే అతి పెద్ద స్క్రీన్ అయిన మెల్‌బోర్న్ ఐమాక్స్ థియేటర్‌లోనూ ఈ సినిమా రిలీజ్ కానుంది.