Ntr 30 Update: నెల రోజులు ఆల‌స్యంగా ఎన్టీఆర్ - కొర‌టాల శివ సినిమా షురూ-ntr koratala siva movie to go on floors in april month ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ntr Koratala Siva Movie To Go On Floors In April Month

Ntr 30 Update: నెల రోజులు ఆల‌స్యంగా ఎన్టీఆర్ - కొర‌టాల శివ సినిమా షురూ

Nelki Naresh Kumar HT Telugu
Feb 27, 2023 09:39 AM IST

Ntr 30 Update: ఎన్టీఆర్ ద‌ర్శ‌కుడు కొర‌టాల‌ శివ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ సినిమా మార్చిలో మొద‌లుకావాల్సింది. కానీ తార‌క‌ర‌త్న మ‌ర‌ణంతో వాయిదాప‌డింది. ఈ సినిమా ఎప్పుడు ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉందంటే..

ఎన్టీఆర్
ఎన్టీఆర్

Ntr 30 Update: జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత ఎన్టీఆర్ - కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. రెండేళ్ల క్రితం క్రేజీ ప్రాజెక్ట్‌ను అనౌన్స్‌చేశారు. కానీ ఈ సినిమా సెట్స్‌పైకి రావ‌డానికి అవాంత‌రాలు ఎదుర‌వుతూనే ఉన్నాయి.

మార్చి 20 నుంచి షూటింగ్‌ను ప్రారంభించ‌బోతున్న‌ట్లు అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ అనౌన్స్‌చేశారు. కానీ తార‌క‌ర‌త్న మ‌ర‌ణంతో మ‌రోసారి ఈ సినిమా వాయిదాప‌డింది. ఫిబ్ర‌వ‌రి 24న నిర్వ‌హించాల్సిన పూజా కార్య‌క్ర‌మాల‌ను నిలిపివేస్తున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.

ఈ ఓపెనింగ్ ఈవెంట్‌ను మార్చి 18న నిర్వ‌హించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఆస్కార్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతున్నారు. అందువ‌ల్లే మార్చి 15 త‌ర్వాతే ఓపెనింగ్ ఈవెంట్‌ను జ‌రుప‌నున్న‌ట్లు స‌మాచారం. ఏప్రిల్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్‌ను మొద‌లుపెట్టే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలిసింది.

ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీక‌పూర్ హీరోయిన్‌గా న‌టించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. హీరోయిన్ రోల్‌కు సంబంధించి ఇటీవ‌లే జాన్వీక‌పూర్‌పై ఫొటోషూట్‌నుచేసిన‌ట్లు తెలిసింది.

ఈ సినిమాలో బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీఖాన్ విల‌న్‌గా న‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం. క‌ళ్యాణ్‌రామ్‌తో క‌లిసి సుధాక‌ర్ మిక్కిలినేని ఈ భారీ బ‌డ్జెట్ సినిమాను నిర్మిస్తోన్నారు. ఎన్టీఆర్ హీరోగా న‌టిస్తోన్న 30వ సినిమా ఇది. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందించ‌బోతున్నారు.

IPL_Entry_Point

టాపిక్