OTT Movies This Week: ఓటీటీ వచ్చిన తర్వాత సినీ అభిమానులకు వినోదానికి కొదవ లేకుండాపోయింది. ప్రతివారం వివిధ భాషల్లో కలిపి పదుల సంఖ్యలో సినిమాలు, సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఈ శుక్రవారం ఒక్కరోజే ఓటీటీలో 20కిపైగా సినిమాలు, సిరీస్‌లు రిలీజ్ అయ్యాయి. ,తెలుగులో చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని సాధించిన రైటర్ పద్మభూషణ్ జీ5 ఓటీటీ లో శుక్రవారం రిలీజైంది. సుహాస్ హీరోగా నటించిన ఈ సినిమాకు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించాడు. ,అలాగే ధనుష్ లేటెస్ట్ హిట్ మూవీ సార్ కూడా నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఫ్రైడే ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. పునీత్‌రాజ్‌కుమార్ నటించిన చివరి సినిమా గంధదగుడి అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. వీటితో పాటు రిలీజైన సినిమాలు ఏవంటే...,నెట్‌ఫ్లిక్స్...కుత్తే,నాయిస్,కాట్ఔట్,ఇన్‌హీజ్ షాడో,మోమో ఇన్ దుబాయ్,ది స్కై హై,ది మెజిషియన్స్ ఎలిఫెంట్,మ్యాస్ట్రో,షాడో అండ్ బోన్ సీజన్ 2,సోని లివ్ది వేల్,రాకెట్ బాయ్స్ సీజన్ 2,అమెజాన్ ప్రైమ్గంధదగుడి,బ్లాక్ ఆడమ్,డిస్నీ ప్లస్ హాట్స్టార్పాప్ కౌన్,సన్ నెక్ట్స్వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ జమాలీగడ్డ