Squid game New Season: స్క్విడ్ గేమ్ ఫ్యాన్స్‌కు శుభవార్త..! కొత్త సీజన్ వచ్చేస్తుంది.. ఈ సారి మరింత వైవిధ్యంగా
Squid game New Season: ప్రపంచ వ్యాప్తంగా విశేష ప్రజాదరణ పొందిన నెట్ ఫ్లిక్స్ సిరీస్ స్క్విడ్ గేమ్ సరికొత్త సీజన్ రాబోతుంది. అయితే ఈ సారి రియాల్టీ షో ఫార్మాట్‌లో రాబోతున్నట్లు తెలుస్తోంది. నవంబరులో రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
Squid game New Seasonఛ స్క్విడ్ గేమ్(Squid game).. హాలీవుడ్, కొరియన్ వెబ్ సిరీస్‌లను ఇష్టపడేవాళ్లో దీని గురించి తెలియనివారుండరంటే అతిశయోక్తి కాదు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా రెండేళ్ల క్రితం వచ్చిన ఈ కొరియన్ సిరీస్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంత కాదు. చిన్న పిల్లలు ఆడుకునే ఆటలతో అడగు అడుగు ప్రాణం కోసం పోరాడుతూ ఉత్కంఠనకు కలిగించే ఈ సిరీస్ సూపర్ సక్సెస్ అయింది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో భాషల్లో విడుదలైన ఈ సిరీస్‌కు మన దేశంలోనూ ఫుల్ ఫాలోయింగ్ ఏర్పడింది. చావు-బతుకులతో ఆట ఆడుతూ నడిపించే ఈ సిరీస్ నుంచి సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా స్క్విడ్ గేమ్ ప్రేక్షకులకు నెట్‌ఫ్లిక్స్ గుడ్ న్యూస్ చెప్పింది. స్క్విడ్ గేమ్‌ను సరికొత్త రూపంలో తీసుకురానున్నట్లు ప్రకటించింది.
ట్రెండింగ్ వార్తలు
ఈ సిరీస్‌ను రియాల్టీ షో రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నెట్‌ప్లిక్స్ తెలిపింది. స్క్విడ్ గేమ్: ది ఛాలెంజ్ అనే టైటిల్‌తో ఈ రియాల్టీ షోనూ రూపొందించనున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో స్క్విడ్ గేమ్ సిరీస్‌పై వివాదం తలెత్తితింది. ఇందులో మితిమీరిన హింస ప్రజలపై ప్రభావం చూపుతుందనే కామెంట్లు వచ్చాయి. దీంతో ఈ సిరీస్‌ను రియాల్టీ ఫార్మాట్‌ను పరిచయం చేయాలనే నిర్ణయానికి వచ్చింది. బతకడం కోసం చేసే పోరాటం ఈ షోలో అధికంగా ఉందని, ఫలితంగా ఇది ప్రజలపై ప్రభావం చూపుతుందని ఫిర్యాదులు విపరీతంగా వచ్చాయి.
ఈ ఫిర్యాదులు, వివాదాలపై స్పందించిన నెట్‌ఫ్లిక్స్.. తక్కువ ప్రమాదకర వాతావరణంలో వారి నైపుణ్యాలను ప్రదర్శిస్తూ ఈ సరికొత్త రియాల్టీ షో సీజన్‌ను తీసుకురానున్నట్లు నిర్ణయించింది. ఇందులో కూడా ఊహించని మలుపులు, సవాళ్లు వీక్షకులను కట్టిపడేస్తాయని స్క్విడ్ గేమ్ క్రియేటర్లు అంటున్నారు. ఈ షో ఎప్పుడొస్తుందనేదానిపై కచ్చితమైన విడుదల తేదీని ప్రకటించనప్పటికీ నవంబరులో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
2021లో నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదలైన స్క్విడ్ గేమ్ సిరీస్ ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంది. 456 మందిని ఓ ప్రదేశంలో ఉంచి.. చిన్న చిన్న ఆటలతో ద్వారా వారి మధ్య పోటీ పెడతారు. ఇందులో ఓడిపోవటాలు ఉండవు. తప్పక గెలవాల్సిందే. గెలవకపోతే ప్రాణాలను వదిలేయాల్సిందే. లైఫ్ అండ్ డెత్ మధ్య జరిగే పోరాటాన్ని ఇందులో భాగా చూపించారు. అలాగే హ్యూమన్ ఎమోషన్లను, బంధాలను, డ్రామాను అద్భుతంగా తెరకెక్కించారు. త్వరలో రానున్న స్క్విడ్ గేమ్ రియాల్టీ షో ద్వారా కూడా అంతే ఉత్కంఠ ఉంటుందని అంచనా వేస్తున్నారు అభిమానులు.