Meet Cute Trailer Release: మీట్ క్యూట్ అంటే ఏంటి? అర్థం కాదు భావం తెలియాలంటే అప్పటి వరకు ఆగాల్సిందే-nani produced web series meet cute trailer out ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Nani Produced Web Series Meet Cute Trailer Out

Meet Cute Trailer Release: మీట్ క్యూట్ అంటే ఏంటి? అర్థం కాదు భావం తెలియాలంటే అప్పటి వరకు ఆగాల్సిందే

Maragani Govardhan HT Telugu
Nov 18, 2022 02:48 PM IST

Meet Cute Trailer Release: నాని నిర్మాణ సారధ్యంలో తెరకెక్కిన వెబ్‌సిరీస్ మీట్ క్యూట్. తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. నాని సోదరి దీప్తి గంటా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు.

మీట్ క్యూట్ ట్రైలర్ రిలీజ్
మీట్ క్యూట్ ట్రైలర్ రిలీజ్

Meet Cute Trailer Release: నేచురల్ స్టార్ నాని సొంత నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమాస్ పతాకంపై ఇప్పటికే పలు చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. త్వరలో హిట్-2 కూడా ఈ బ్యానర్‌లో రాబోతుంది. ఇప్పుడు ఆయన తన సోదరి దీప్తి గంటా దర్శకత్వంలో ఓ సరికొత్త వెబ్‌సిరీస్‌ను నిర్మించారు. అదే మీట్ క్యూట్. ఇటీవలే ఈ సిరీస్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టీజర్‌ కూడా విడుదలైంది. తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు.

మీట్ క్యూట్ అంటే ఏంటి? అని నాని మాటలతో ఈ సిరీస్ ట్రైలర్ ప్రారంభమవుతుంది. అనుకోకుండా ఇద్దరు అపరిచితులు కలిపినప్పుడు.. ఆ క్యూట్ మూమెంట్స్‌నే మీట్ క్యూట్ అంటారు అంటూ నాని చెప్పే డైలాగులు ఆకట్టుకుంటాయి. ఆంథాలజీగా తెరకెక్కిన ఈ సిరీస్ వరుసగా పాత్రలు పరిచయమవుతాయి. ఆద్యంతం సింపుల్‌గా మధురమైన సంభాషణలతో ట్రైలర్ సాగింది. ఐదు కథల సమాహారంగా ఈ సిరీస్ తెరకెక్కింది.

ఐదు ఎపిసోడ్స్‌తో సాగే ఈ సిరీస్‌కు నాని సోదరి దీప్తి గంటా దర్శకత్వం వహించారు. సోని లివ్ వేదికగా నవంబరు 25 నుంచి ఈ ఆంథాలజీ సిరీస్ ప్రసారం కానుంది. ఇందులో సత్యరాజ్, రోహిణి, అదా శర్మ, వర్షా బొల్లమ్మ, ఆకాంక్ష సింగ్, రూహానీ శర్మ, సునైనా, సంచిత, అశ్విన్ కుమార్, శివ కందుకూరి, దీక్షిత్ శెట్టి, గోవింద్ పద్మ సూర్య, రాజా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

ఈ వెబ్‌సిరీస్‌కు వసంత్ కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తుండగా.. విజయ్ బులగానిన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండగా.. గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ పనులు చూస్తున్నారు. మీట్ క్యూట్ సిరీస్‌ను అర్ధవంతమైన సంభాషణలు, హృదయపూర్వక క్షణాలతో అందమైన యాదృచ్ఛిక సంఘటనలతో తెరకెక్కించారు దీప్తి గంటా.

IPL_Entry_Point

సంబంధిత కథనం