Chiranjeevi in Suma Show: సుమ షోలో మెగాస్టార్ సందడి.. పూనకాలు సాంగ్‌తో ఊగిపోయిన యాంకర్
Chiranjeevi in Suma Show: బుల్లితెర యాంకర్ సుమ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న సుమ అడ్డా షోలో మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. చిరు రాకతో సుమ పూనకాలు లోడింగ్ సాంగ్‌కు డ్యాన్స్ చేస్తూ ఊగిపోయింది.
Chiranjeevi in Suma Show: బుల్లితెర మహారాణిగా యాంకర్ సుమ చాలా ఏళ్లుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. తనదైన శైలి చతురత, యాక్టివ్‌నెస్‌తో ఆమె ఏ షో చేసిన సందడి వాతావరణం తీసుకొస్తుంది. తప్పకుండా ఆ షో సక్సెస్ అవుతోంది. అందుకే రెండు దశాబ్దాలుగా బుల్లితెరపై చెరగని ముద్ర వేస్తూ దూసుకెళ్తోంది. ఇప్పటికే ఆడియో ఫంక్షన్లు సహా ఇతర చాలా కార్యక్రమాల్లోనూ సుమ సందడి కనిపిస్తోంది. ఇటీవలే ఈ సుమ కనకాల సుమ అడ్డా పేరుతో ఓ షోకు వ్యాఖ్యతగా వ్యవహరిస్తోంది. తాజాగా ఈ షోలో మన మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను సుమ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
ట్రెండింగ్ వార్తలు
సుమ కనకాల మెగాస్టార్‌తో కలిసి ఉన్న వీడియోను సామాజిక మాధ్యమాల వేదికగా షేర్ చేశారు. "నా కెరీర్‌లో ఇదే మెగా మూమెంట్. మెగాస్టార్ వస్తుంటే పూనకాలే" అంటూ ఈ వీడియో కింద పోస్టును జత చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు.
ఈ వీడియోను గమనిస్తే.. మెగాస్టార్ నటించిన వాల్తేరు వీరయ్య చిత్రంలో పూనకాలు లోడింగ్ అనే సాంగ్‌కు సుమ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఇంతలో ఫ్రేమ్‌లోకి అకస్మాత్తుగా మన మెగాస్టార్ ఎంట్రీ ఇస్తారు. చిరంజీవి చూసి ఆశ్చర్యపోయిన సుమ.. ఆయననే చూస్తూ ఉండిపోగా.. మెగాస్టార్ తనదైన శైలిలో "డోంట్ స్టాప్ డ్యాన్సింగ్.. పూనకాలు లోడింగ్" అంటూ తనదైన శైలిలో పాటకు గాత్రం కలపడంతో సుమ తిరిగి డ్యాన్స్ చేయడం ప్రారంభించింది.
ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవిన నటించిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బాబీ(కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మన మెగాస్టార్ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా చేసింది. రవితేజ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
సంబంధిత కథనం