Chiranjeevi Gift to Daughter Sreeja: కూతురికి రూ.30 కోట్ల బంగ్లా గిఫ్ట్‌గా ఇచ్చిన చిరంజీవి-chiranjeevi gifts luxury bungalow to daughter sreeja
Telugu News  /  Entertainment  /  Chiranjeevi Gifts Luxury Bungalow To Daughter Sreeja
తండ్రి చిరంజీవితో శ్రీజ
తండ్రి చిరంజీవితో శ్రీజ

Chiranjeevi Gift to Daughter Sreeja: కూతురికి రూ.30 కోట్ల బంగ్లా గిఫ్ట్‌గా ఇచ్చిన చిరంజీవి

04 January 2023, 17:03 ISTHari Prasad S
04 January 2023, 17:03 IST

Chiranjeevi Gift to Daughter Sreeja: కూతురికి రూ.30 కోట్ల బంగ్లా గిఫ్ట్‌గా ఇచ్చాడు మెగాస్టార్‌ చిరంజీవి. ఇప్పుడీ వార్త వైరల్‌గా మారింది. చిరు త్వరలోనే వాల్తేర్‌ వీరయ్యతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.

Chiranjeevi Gift to Daughter Sreeja: మెగాస్టార్‌ చిరంజీవి నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్‌ను ఏలుతున్న మెగా హీరో. ఇండస్ట్రీలో ఎవరి అండా లేకుండానే హీరో అయి, ఆ తర్వాత దశాబ్దాల పాటు నంబర్‌ వన్‌గా నిలవడం అంటే మాటలు కాదు. తన స్థానానికి తగినట్లే అతడు సంపాదనలోనూ చాలా మంది హీరోలకు అందనంత ఎత్తులో ఉన్నాడు.

హైదరాబాద్‌లో లగ్జరీ బంగ్లా, లగ్జరీ కార్లతో రాజభోగం అనుభవిస్తున్నాడు. ఇప్పుడు తన చిన్న కూతురు శ్రీజకు కూడా ఓ లగ్జరీ బంగ్లాను చిరు గిఫ్ట్‌గా ఇవ్వడం విశేషం. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న ఈ ఇంటిని తనకు వచ్చిన రెమ్యునరేషన్‌తో కొనివ్వడం ఇక్కడ మరో ఆసక్తికర విషయం. ఈ బిల్డింగ్‌ ఖరీదు రూ.30 కోట్ల వరకూ ఉంటుందని వార్తలు వస్తున్నాయి.

నగరంలోని ప్రముఖ ఆర్కిటెక్ట్‌లు ఈ బిల్డింగ్‌ను డిజైన్‌ చేయడంతోపాటు అత్యాధునిక టెక్నాలజీ కూడా వాడారు. శ్రీజకు ఇప్పటికే పెళ్లయి విడాకులు కూడా తీసుకుంది. ఆమెకు ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. త్వరలోనే ఆమె సొంత బిజినెస్‌ ప్రారంభించబోతున్నట్లు సమాచారం.

అటు ఆమె మరో పెళ్లికి రెడీ అవుతోందని ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్టు వైరల్‌గా మారింది. ప్రియమైన 2022.. నా జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు అంటూ పోస్టు పెట్టింది. ప్రియతమా ఎట్టకేలకు నిన్ను కలవడం చాలా అద్భుతంగా ఉంది. ఈ ప్రయాణం మొదలైంది అంటూ తన పోస్టును కొనసాగించింది శ్రీజ.

మరోవైపు మెగాస్టార్‌ చిరంజీవి ఈ సంక్రాంతికి వాల్తేర్‌ వీరయ్య మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. గాడ్‌ఫాదర్‌ సినిమా హిట్‌ అవడంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన చిరు.. వాల్తేర్‌ వీరయ్యతో మరో హిట్‌ అందుకోవాలని తహతహలాడుతున్నాడు. సెన్సార్‌ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా.. జనవరి 13న రిలీజ్‌ కాబోతోంది. అయితే ఈ సినిమాకు విజయ్‌ వారసుడు, బాలకృష్ణ వీరసింహా రెడ్డిల నుంచి గట్టి పోటీ ఎదురు కానుంది.

సంబంధిత కథనం