Malayalam Movies in OTT: ఓటీటీల్లోకి రాబోతున్న అదిరిపోయే మలయాళం సినిమాలు ఇవే-malayalam movies in ott to be released soon ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Malayalam Movies In Ott To Be Released Soon

Malayalam Movies in OTT: ఓటీటీల్లోకి రాబోతున్న అదిరిపోయే మలయాళం సినిమాలు ఇవే

Hari Prasad S HT Telugu
Apr 10, 2023 04:08 PM IST

Malayalam Movies in OTT: ఓటీటీల్లోకి రాబోతున్న అదిరిపోయే మలయాళం సినిమాలు ఇవే. ఈ మధ్య కాలంలో మాలీవుడ్ సినిమాలు తెలుగు ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

మలయాళ మూవీ కరోనా పేపర్స్
మలయాళ మూవీ కరోనా పేపర్స్

Malayalam Movies in OTT: మలయాళం ఇండస్ట్రీ నుంచి వస్తున్న సినిమాలకు ఈ మధ్య కాలంలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా కరోనా సమయంలో ఓటీటీలకు అలవాటు పడిన తెలుగు ప్రేక్షకులు కూడా మాలీవుడ్ సినిమాలను బాగా ఆదరిస్తున్నారు. అక్కడి స్టార్లు ఫహద్ ఫాజిల్, పృథ్విరాజ్ సుకుమారన్, దుల్కర్ సల్మాన్ లాంటి వాళ్ల నటనకు మనవాళ్లు ఫిదా అయిపోయారు.

అక్కడి సినిమాల రీమేక్స్ కూడా తెలుగులో చాలానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓటీటీల్లో మలయాళం సినిమాల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇప్పటికే రొమాంచం, ప్రణయ విలాసం, ఖాళీ పర్స్ బిలియనీర్స్, పురుష ప్రేతమ్ లాంటి సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ ఓటీటీలలో త్వరలో రాబోతున్న మాలీవుడ్ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఓటీటీల్లోకి వస్తున్న మలయాళ సినిమాలు

కరోనా పేపర్స్ - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు)

పూక్కాలం - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు)

ఎంతడ సాజి - అమెజాన్ ప్రైమ్ వీడియో (రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు)

వేదికెట్టు - జీ5 (ఏప్రిల్ 28)

డియర్ వప్పి - మనోరమా మ్యాక్స్ (ఏప్రిల్ 13)

పాకలమ్ పాతిరావుమ్ - జీ5 (ఏప్రిల్ 21)

శేషం మైక్-ఇల్ ఫాతిమా - నెట్‌ఫ్లిక్స్ (రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు)

IPL_Entry_Point

సంబంధిత కథనం