Direct OTT Release Movies In 2022: కరోనా మహమ్మారి కారణంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు డిమాండ్ పెరిగింది. స్టార్స్ కూడా డైరెక్ట్‌గా తమ సినిమాల్ని ఓటీటీలో విడుదల చేయడానికి అంగీకరించడం, ప్రేక్షకులు ఓటీటీలకు అలవాటుపడటంతో డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ థియేటర్లకు ప్రత్యామ్నయంగా మారిపోవడం ఖాయమంటూ ప్రచారం జరిగింది. ,కరోనా భయాలు తొలగిపోయి థియేటర్లలో సాధారణ పరిస్థితులు నెలకొనడంతో ఓటీటీల జోరు తగ్గుముఖం పట్టింది. ఈ ఏడాది ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజైన సినిమాలు పెద్దగా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాయి. అంతిమంగా ఓటీటీపై థియేటర్లు గెలిచాయి. ఈ ఏడాది ఓటీటీలో విడుదలైన తెలుగు, తమిళ స్టార్స్ సినిమాలు ఇవే...,కీర్తి సురేష్ సానికాయిధమ్ (తెలుగులో చిన్ని)కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ సినిమా సాయికాయిధమ్ మే నెలలో స్ట్రెయిట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. కుల వివక్ష నేపథ్యంలో తనకు జరిగిన అన్యాయంపై పోరాటం చేసే ఓ మహిళ కథతో దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ సానికాయిధమ్ సినిమాను తెరకెక్కించారు. ఇందులో డీగ్లామర్ రోల్‌లో కీర్తి సురేష్ యాక్టింగ్‌కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. సానికాయిధమ్ సినిమాలో దర్శకుడు సెల్వరాఘవన్ కీలక పాత్ర పోషించాడు.,విక్రమ్, ధృవ్ విక్రమ్ -మహాన్తమిళ అగ్ర హీరో విక్రమ్, అతడి తనయుడు ధృవ్ విక్రమ్ తొలిసారి కలిసి నటించిన మహాన్ సినిమా థియేటర్లలో కాకుండా డైరెక్ట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. తండ్రీ కొడుకుల పోరాటం నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహించాడు. విక్రమ్ నటన బాగుందనే టాక్ వినిపించిన కథ, కథనాలు మాత్రం అంతంగా ఆకట్టుకోలేకపోయాయి. ఈ సినిమాలో విక్రమ్, ధృవ్ విక్రమ్ తండ్రీ కొడుకులుగా నటించారు.,నయనతార -ఓ2నయనతార కథనాయికగా సర్వైవల్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఓ2 సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల్ని పలకరించింది. మట్టిదిబ్బలో కూరుకుపోయిన ఓ బస్సు నుంచి కొడుకును కాపాడుకోవడానికి ప్రాణాలతో పోరాడిన తల్లి పాత్రలో నయనతార నటించింది. కాన్సెప్ట్ బాగున్నా కథను అర్థవంతంగా దర్శకుడు స్క్రీన్‌పై ప్రజెంట్ చేయలేకపోవడంతో ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. ఓ2 సినిమాకు జీఎస్ విఘ్నేష్ దర్శకత్వం వహించాడు.,నవీన్ చంద్ర రిపీట్ - అమ్ముఈ ఏడాది నవీన్‌చంద్ర నటించిన రెండు సినిమాలు స్ట్రెయిట్‌గా ఓటీటీలో రిలీజయ్యాయి. రిపీట్ సినిమా డిస్నీ ప్లస్‌హాట్‌స్టార్‌లో విడుదలైంది. ఫేక్ ఎన్‌కౌంటర్ కథతో రూపొందిన ఈ సినిమా ఓటీటీలో మంచి రిజల్ట్‌ను దక్కించుకున్నది. అరవింద్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మధుబాల, అచ్యుత్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు. ,నవీన్‌చంద్ర, ఐశ్వర్యలక్ష్మి జంటగా నటించిన అమ్ము సినిమా ఆమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. గృహహింస నేపథ్యంలో లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఇందులో ఐశ్వర్యలక్ష్మి నటనకు మంచి పేరు దక్కింది.,ఆనంద్ దేవరకొండ హైవే...ఆనంద్ దేవరకొండ కూడా థియేటర్లను స్కిప్ చేస్తూ హైవే సినిమాతో నేరుగా ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సైకో కిల్లర్ కథాంశంతో సినిమాటోగ్రాఫర్ కె.వి.గుహన్ దర్శకత్వం వహించిన ఈసినిమా పూర్ రివ్యూస్‌ను దక్కించుకున్నది.,అనుపమ పరమేశ్వరన్ బటర్ ఫ్లైఈ ఏడాది థియేటర్లలో పెద్ద విజయాల్ని దక్కించుకున్న అనుపమకు ఓటీటీలో మాత్రం నిరాశే మిగిలింది. ఆమె హీరోయిన్‌గా నటించిన బటర్‌ఫ్లై సినిమా ఇటీవల డిస్నీ ప్లస్‌హాట్‌స్టార్‌లో రిలీజైంది. కిడ్నాప్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా కథలో కొత్తదనం లేకపోవడంతో ఓటీటీలో మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్నది.,సుమంత్ మళ్లీ మొదలైందిమళ్లీ మొదలైంది సినిమా జీ5 ద్వారా నేరుగా ఓటీటీ ప్రేక్షకుల్ని పలకరించారు సుమంత్. విడాకుల తర్వా త కూడా జీవితం ఉంటుందనే పాయింట్‌తో ఫన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందింది. కాన్సెప్ట్ పర్వాలేదనిపించినా కామెడీ మాత్రం పెద్దగా వర్కవుట్ కాలేదు. ఈ సినిమాకు కీర్తికుమార్ దర్శకత్వం వహించాడు.,లేడీ ఓరియెంటెడ్ సినిమాలు...ప్రియమణి భామకలాపం, నివేథా పేతురాజ్ బ్లడీ మేరీ సినిమాలు ఆహా ఓటీటీలో రిలీజయ్యాయి. లేడీ ఓరియెంటెడ్ కథాంశాలతో మిర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలు కూడా మోస్తారు ఆదరణను దక్కించుకున్నాయి.,అలాగే అలీ హీరోగా నటించిన అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సినిమా ఆహా ఓటీటీలోనే డైరెక్ట్‌గా విడుదలైంది. అలాగే మమ్ముట్టి పురుతో పాటు మరికొందరు స్టార్స్ డైరెక్ట్‌గా తమ సినిమాలతో ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చారు.