New OTT Releases This Week: ఈ వారం ఓటీటీలో విడుదల కానున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే
New OTT Releases This Week:: ఈ వారం డైరెక్ట్‌గా ఓటీటీ ప్రేక్షకుల్ని కొన్ని సినిమాలు పలకరించబోతున్నాయి. వినూత్నమైన కథలతో కూడిన సినిమాలు, సిరీస్‌లు రిలీజ్ కాబోతున్నాయి.
New OTT Releases This Week:
ట్రెండింగ్ వార్తలు
గోవింద్ నామ్ మేరా(Govind Naam Mera) - డిసెంబర్ 16 - డిస్నీ ప్లస్ హాట్ స్టార్
విక్కీ కౌశల్, కియారా అద్వాణీ, భూమి ఫడ్నేకర్ హీరోహీరోయిన్లుగా నటించిన గోవింద్ నామ్ మేరా సినిమా థియేటర్లను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కానుంది. డిసెంబర్ 16 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. కామెడీ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ సినిమాకు శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించాడు. రణ్‌బీర్‌సింగ్ అతిథి పాత్రలో నటించాడు.
ఇంటింటి రామాయణం - డిసెంబర్ 16 - ఆహా (Aha OTT)
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన చిన్న సినిమా ఇంటింటి రామాయణం ఆహా ఓటీటీలో డిసెంబర్ 16న రిలీజ్ కానుంది. సీనియర్ నరేష్, రాహుల్ రామకృష్ణ, నవ్యస్వామి, ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమాకు సురేష్ నరెడ్ల దర్శకత్వం వహించాడు. దర్శకుడు మారుతి షో రన్నర్‌గా వ్యవహరించాడు. కరీంనగర్ బ్యాక్‌డ్రాప్‌లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కథాంశంతో ఫన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందింది.
వాళ్లిద్దరి మధ్య - డిసెంబర్ 16 -ఆహా
మనసంత నువ్వే ఫేమ్ వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన వాళ్లిద్ధరి మధ్య సినిమా డిసెంబర్ 16న ఆహా ఓటీటీలో విడుదలకానుంది. విరాజ్ అశ్విన్, నేహాకృష్ణ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. డైరెక్ట్‌గా ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతోంది.
కోడ్ నేమ్ తిరంగా - డిసెంబర్ 16 - నెట్‌ఫ్లిక్స్
పరిణీతి చోప్రా ప్రధాన పాత్రలో నటించిన కోడ్ నేమ్ తిరంగా సినిమా డిసెంబర్ 16 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు రిబు దాస్ గుప్తా దర్శకత్వం వహించాడు.
అరియుప్పు - డిసెంబర్ 16 - నెట్‌ఫ్లిక్స్
ప్రైవేట్ లెసన్ - డిసెంబర్ 16 - నెట్‌ఫ్లిక్స్
ది బిగ్ ఫోర్ - డిసెంబర్ 16 - నెట్‌ఫ్లిక్స్
ఐ బిలీవ్ ఇన్ సాంట - డిసెంబర్ 16 - నెట్‌ఫ్లిక్స్
నాని -డిసెంబర్ 16 - అమెజాన్ ప్రైమ్
ది రిక్రూట్ - డిసెంబర్ 16 -నెట్‌ఫ్లిక్స్
అనంత ది ఎటర్నల్ - డిసెంబర్ 16 - జీ5
ఏ స్ట్రోమ్ ఫర్ క్రిస్మస్ - డిసెంబర్ 16 - నెట్‌ఫ్లిక్స్