Keerthy Suresh First Look in Dasara: పెళ్లి కూతురు గెట‌ప్‌లో కీర్తిసురేష్ -ద‌స‌రా ఫ‌స్ట్‌లుక్ రిలీజ్‌-keerthy suresh first look of dasara movie unveiled ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Keerthy Suresh First Look Of Dasara Movie Unveiled

Keerthy Suresh First Look in Dasara: పెళ్లి కూతురు గెట‌ప్‌లో కీర్తిసురేష్ -ద‌స‌రా ఫ‌స్ట్‌లుక్ రిలీజ్‌

Nelki Naresh Kumar HT Telugu
Oct 17, 2022 12:47 PM IST

Keerthy Suresh First Look in Dasara: కీర్తిసురేష్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ద‌స‌రా టీమ్ అభిమానుల‌కు స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. ఆమె ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసింది.

కీర్తిసురేష్
కీర్తిసురేష్

Keerthy Suresh First Look in Dasara: పెళ్లి కూతురు గెట‌ప్‌లో అభిమానుల‌ను స‌ర్‌ప్రైజ్‌చేసింది కీర్తిసురేష్‌. సోమ‌వారం కీర్తిసురేష్‌ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ద‌స‌రా సినిమాలో ఆమె ఫ‌స్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. నాని హీరోగా న‌టిస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సోమ‌వారం ద‌స‌రా సినిమాలో కీర్తిసురేష్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.

ఇందులో ప‌సుపు ప‌చ్చ చీర‌లో పెళ్లి కూతురు గెట‌ప్‌లో డ్యాన్స్ చేస్తూ కీర్తిసురేష్ క‌నిపిస్తోంది. ఈ సినిమాలో ఆమె వెన్నెల అనే పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు చిత్ర యూనిట్ తెలిపింది. కీర్తి ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను నాని సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకున్నాడు. వెన్నెల అంటే పేరు మాత్ర‌మే కాదు ఒక ఎమోష‌న్ అని పేర్కొన్నాడు. కీర్తి సురేష్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ద‌స‌రా సినిమా రూపొందుతోంది.

గోదావ‌రిఖ‌ని బొగ్గు గ‌నుల నేప‌థ్యంలో ఓ యువ‌కుడి జీవ‌న‌ ప్ర‌యాణాన్ని ఆవిష్క‌రిస్తూ శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. స్నేహం, ప్రేమ అంశాల చుట్టూ ఈ సినిమా సాగ‌నున్న‌ట్లు స‌మాచారం. ద‌స‌రా సినిమా కోసం నాని తెలంగాణ యాస‌ను నేర్చుకొని న‌టిస్తున్నాడు.

గ‌త చిత్రాల‌కు భిన్నంగా పూర్తిగా మాస్ క్యారెక్ట‌ర్‌లో నాని క‌నిపించ‌బోతున్నాడు. ద‌స‌రా సినిమాను తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ, క‌న్న‌డ భాష‌ల్లో ఈ సినిమాను రిలీజ్ చేయ‌బోతున్నారు. ఎమ్‌సీఏ త‌ర్వాత నాని, కీర్తి సురేష్ క‌లిసి న‌టిస్తున్న సినిమా ఇది. సంతోష్ నారాయ‌ణ‌న్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

IPL_Entry_Point