Kantara in Oscars Race: ఆస్కార్స్‌ రేసులో కాంతారా.. రెండు కేటగిరీల్లో పోటీ-kantara in oscars race as the makers announced the movie qualified in two categories ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Kantara In Oscars Race As The Makers Announced The Movie Qualified In Two Categories

Kantara in Oscars Race: ఆస్కార్స్‌ రేసులో కాంతారా.. రెండు కేటగిరీల్లో పోటీ

Hari Prasad S HT Telugu
Jan 10, 2023 12:55 PM IST

Kantara in Oscars Race: ఆస్కార్స్‌ రేసులో కాంతారా ఉందంటూ ఈ మూవీ మేకర్స్‌ మంగళవారం (జనవరి 10) సర్‌ప్రైజింగ్‌ న్యూస్‌ చెప్పారు. ఈ సినిమా రెండు కేటగిరీల్లో పోటీ పడనున్నట్లు వెల్లడించారు.

కాంతారా మూవీ
కాంతారా మూవీ (MINT_PRINT)

Kantara in Oscars Race: ఆస్కార్స్‌లాంటి ప్రతిష్టాత్మక అవార్డులకు కనీసం నామినేట్‌ అయినా గొప్ప విషయమే అని అందరూ భావిస్తారు. ఈ అవార్డుల రేసులో ఉండటాన్ని గొప్ప గౌరవంగా భావిస్తారు. అకాడెమీ అవార్డులకు ఇండియన్‌ సినిమాలు పోటీ పడటం అత్యంత అరుదు. ఈసారి మన దేశం నుంచి ఛెల్లో షో అనే గుజరాతీ మూవీ అధికారికంగా ఆస్కార్స్‌కు నామినేట్‌ అయింది.

అయితే గతేడాది సంచలన విజయాలు సాధించిన ఆర్ఆర్ఆర్, కాంతారా సినిమాలు కూడా ఇప్పుడు ఆస్కార్స్‌ రేసులో నిలిచాయి. ఆర్‌ఆర్ఆర్ రెండు కేటగిరీల్లో షార్ట్‌ లిస్ట్‌ అయిన విషయం అందరికీ తెలుసు. ఆ మూవీ మేకర్స్‌ చాన్నాళ్లుగా ఆస్కార్స్‌కు నామినేట్‌ కావడానికే ఎద్ద ఎత్తున ప్రయత్నాలు చేసి సక్సెస్‌ అయ్యారు. అయితే కాంతారా మూవీ మాత్రం సైలెంట్‌గా ఈ ప్రతిష్టాత్మక అవార్డుల రేసులో నిలిచింది.

ఈ సినిమా ఎంత సైలెంట్‌గా అయితే బాక్సాఫీస్‌ దగ్గర కాసుల వర్షం కురిపించి సక్సెస్‌ అయిందో అంతే సైలెంట్‌గా ఇప్పుడు ఆస్కార్స్‌కు నామినేట్‌ అయింది. ఈ విషయాన్ని మూవీ మేకర్సే అధికారికంగా ట్విటర్‌ ద్వారా అనౌన్స్‌ చేశారు. బెస్ట్‌ పిక్చర్‌, బెస్ట్‌ యాక్టర్‌ కేటగిరీల్లో కాంతారా మూవీ షార్ట్‌ లిస్ట్‌ అయినట్లు హోంబలే ఫిల్మ్స్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది.

అయితే వీటిలో ఫైనల్‌ నామినేషన్స్‌ మాత్రం జనవరి 24న ఖరారు కానున్నాయి. అంటే కాంతారా చివరిగా ఆస్కార్స్‌ నామినేషన్ల లిస్ట్‌లో ఉంటుందా లేదా అన్నది ఆ రోజే తెలుస్తుందని కూడా మేకర్స్‌ చెప్పారు. రిషబ్‌ శెట్టి నటించిన ఈ సినిమా 2022లో సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.

కేవలం రూ.15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర రూ.500 కోట్లకుపైగా వసూలు చేసింది. ఇందులో రిషబ్‌ శెట్టి నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. కన్నడనాట ఆల్‌టైమ్‌ హయ్యెస్ట్‌ గ్రాసింగ్‌ సినిమాగా నిలవగా.. తెలుగు, హిందీల్లోనూ అంచనాలకు మించి వసూళ్ల రాబట్టింది. నిజానికి ఈ సినిమాను అధికారికంగా ఆస్కార్స్‌కు పంపాలని కూడా పలువురు డిమాండ్‌ చేశారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్