Kamal Kisses Suriya: సూర్యను ముద్దుపెట్టుకున్న కమల్.. రోలెక్స్ పాత్రపై ప్రశంసల వర్షం-kamal haasan kisses suriya in an award event in chennai ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Kamal Haasan Kisses Suriya In An Award Event In Chennai

Kamal Kisses Suriya: సూర్యను ముద్దుపెట్టుకున్న కమల్.. రోలెక్స్ పాత్రపై ప్రశంసల వర్షం

Maragani Govardhan HT Telugu
Apr 01, 2023 02:25 PM IST

Kamal Kisses Suriya: కోలీవుడ్ హీరో సూర్యను.. కమల్ హాసన్ ఆప్యాయంగా నుదుటిపై ముద్దుపెట్టుకున్నారు. ఓ అవార్డుల కార్యక్రమంలో కమల్.. సూర్యను కలిసి అతడిపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా లోకేష్ కనగరాజ్ కూడా సూర్యతో సినిమా చేయడంపై స్పష్టత ఇచ్చారు.

సూర్యపై కమల్ ప్రశంసల వర్షం
సూర్యపై కమల్ ప్రశంసల వర్షం

Kamal Kisses Suriya: లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన విక్రమ్ చిత్రం గతేడాది సూపర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇందులో ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ సూర్య చేసిన రోలెక్స్ పాత్రకు అభిమానులు ఎంతగానో ఫిదా అయ్యారు. విక్రమ్ క్లైమాక్స్‌లో వచ్చే ఈ పాత్ర సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లింది. ఇదే విషయంపై తాజాగా కమల్ హాసన్ స్పందించారు. చెన్నైలో జరిగిన ఓ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న కమల్.. సూర్యకు అవార్డు అందిస్తూ ఆయనపై ప్రశంసల వర్షాన్ని కురిపించారు.

“రోలెక్స్ పాత్ర వల్ల మా సినిమా ఎక్కువ మందికి చేరువైంది. ఈ పాత్ర చేయడానికి అంగీకరించినందుకు సూర్యకు మరోసారి ధన్యవాదాలు. ఇది మేము చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయం. ఒక్క ఫోన్ కాల్ చేసిన వెంటనే సూర్య ఈ రోల్ చేసేందుకు ఒప్పుకున్నారు.” అంటూ సూర్యను హత్తుకుని నుదుటిపై ముద్దుపెట్టుకున్నారు కమల్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సూర్యతో సినిమాకు లోకేష్ సై..

సూర్యతో సినిమా చేయడంపై దర్శకుడు లోకేష్ కనగరాజ్ క్లారిటీ ఇచ్చారు. “సూర్యతో సినిమా చేయాలని నాకు కూడా ఆసక్తి ఉంది. తప్పకుండా ఆయనతో మూవీ చేస్తా. ఆ చిత్రాన్ని 150 రోజుల్లోనే పూర్తి చేస్తాను.” అని లోకేష్ వెల్లడించారు. లోకేష్ ఈ మాటలు అనడంతో సూర్య అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు లోకేష్.. ప్రస్తుతం విజయ్‌తో లియో అనే సినిమా చేస్తున్నారు.

ప్రస్తుతం సూర్య తన 42వ చిత్రంతో బిజీగా ఉన్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సిరుత్తై శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత సుధా కొంగరతో ఓ సినిమా, వెట్రిమారన్‌తో మరో ప్రాజెక్టు చేయనున్నారు. విక్రమ్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో పరిచయమైన సూర్య.. త్వరలో సోలో హీరోగా పాన్ ఇండియా స్థాయిలో అలరించనున్నారు.

అవార్డు అందుకుంటున్న సూర్య.. చిత్రంలో లోకేష్ కనగరాజ్, కమల్ హాసన్
అవార్డు అందుకుంటున్న సూర్య.. చిత్రంలో లోకేష్ కనగరాజ్, కమల్ హాసన్
IPL_Entry_Point

టాపిక్