Pawan Kalyan Harihara Veeramallu: హరిహరవీరమల్లు షూటింగ్ - పవన్ ఫొటో లీక్
Pawan Kalyan Harihara Veeramallu:ప్రస్తుతం హరిహరవీరమల్లు షూటింగ్‌తో పవన్‌కళ్యాణ్ బిజీగా ఉన్నాడు. హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఆన్ లొకేషన్‌లో పవన్ కళ్యాణ్ కొత్త ఫొటో లీక్ అయ్యింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
Pawan Kalyan Harihara Veeramallu: పాలిటిక్స్‌తో బిజీగా ఉంటూనే హరిహరవీరమల్లు సినిమా చేస్తున్నారు పవన్‌కళ్యాణ్. క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ఔరంగజేబు కాలం నాటి బందిపోటు దొంగ పాత్రలో పవన్‌కళ్యాణ్ కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ట్రెండింగ్ వార్తలు
ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. పవన్ కళ్యాణ్‌పై హై ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్‌ను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్‌కు సంబంధించిన కొత్త ఫొటో లీక్ అయ్యింది. ఇందులో రాచరికపు వస్త్రధారణలో పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నాడు. ఈ కొత్త లుక్ పవన్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ లీక్‌డ్ ఫొటోను సోషల్ మీడియాలో అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.
ఇందులో ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ హీరో బాబీ డియోల్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. హరిహరవీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. పంచమి అనే నర్తకిగా నిధి ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు సమాచారం. గత కొన్ని నెలలుగా రాజకీయాలపై ఎక్కువగా దృష్టిసారిస్తున్నారు పవన్‌కళ్యాణ్.
అందువల్లే హరిహరవీరమల్లు సినిమా షూటింగ్ ఆలస్యమవుతోంది. ఈసినిమా షూటింగ్‌ను డిసెంబర్‌లోగా పూర్తిచేయలనే ఆలోచనలో పవన్ ఉన్నట్లు సమాచారం. ఆ తర్వాత కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది వేసవిలో హరిహరవీరమల్లు రిలీజ్ కానుంది.