Highest Grossing Dubbed Movies in Telugu: తెలుగులో ఈ ఏడాది హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ సాధించిన డ‌బ్బింగ్ సినిమాలు ఇవే-from kgf 2 to kantara here the full list of highest grossing dubbed movies in telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  From Kgf 2 To Kantara Here The Full List Of Highest Grossing Dubbed Movies In Telugu

Highest Grossing Dubbed Movies in Telugu: తెలుగులో ఈ ఏడాది హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ సాధించిన డ‌బ్బింగ్ సినిమాలు ఇవే

Nelki Naresh Kumar HT Telugu
Nov 21, 2022 09:01 AM IST

Highest Grossing Telugu Dubbed Movies: ప్ర‌స్తుతం డ‌బ్బింగ్ సినిమాల రగ‌డ టాలీవుడ్‌ను కుదిపేస్తోంది. డ‌బ్బింగ్ సినిమాల కార‌ణంగా తెలుగు స్ట్రెయిట్ సినిమాల క‌లెక్ష‌న్స్ త‌గ్గిపోతున్నాయ‌నే వాద‌న‌లు చాలా కాలంగా వినిపిస్తోన్నాయి. ఈ ఏడాది టాలీవుడ్‌లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ సాధించిన డ‌బ్బింగ్ సినిమాలు ఏవంటే...

విక్రమ్
విక్రమ్

Highest Grossing Telugu Dubbed Movies: డ‌బ్బింగ్ సినిమాల అంశం టాలీవుడ్‌, కోలీవుడ్ మ‌ధ్య విభేదాల‌కు దారితీసింది. కోలీవుడ్‌తో పాటు ఇత‌ర భాష‌ల‌కు చెందిన సినిమాలు తెలుగులో డ‌బ్బింగ్ రూపంలో విడుద‌ల కావ‌డం కామ‌న్‌. చాలా ఏళ్లుగా ఈ ట్రెండ్ కొన‌సాగుతోంది. గ‌తంతో పోలిస్తే డ‌బ్బింగ్ ట్రెండ్ ఇప్పుడు రెట్టింపు అయ్యింది. దాంతో పండుగ‌ల టైమ్‌లో ఈ డ‌బ్బింగ్‌ సినిమాల్ని రిలీజ్ చేయ‌వ‌ద్దంటూ తెలుగు ప్రొడ్యూస‌ర్స్ కొత్త డిమాండ్‌ను తెర‌పైకి తీసుకొచ్చారు.

డ‌బ్బింగ్ సినిమాల‌ను చూసి తెలుగు ప్రొడ్యూస‌ర్స్ భ‌య‌ప‌డ‌టానికి ఓ కార‌ణంగా ఉంది. ఈ ఏడాది తెలుగులో అత్య‌ధిక వ‌సూళ్ల‌ను సాధించిన సినిమాల్లో డ‌బ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయి. స్ట్రెయిట్ సినిమాల్ని డామినేట్ చేస్తూ బాక్సాఫీస్ వ‌ద్ద డ‌బ్బింగ్ సినిమాలు అద్భుత విజ‌యాల్ని అందుకున్నాయి. ఈ ఏడాది టాలీవుడ్‌లో అత్య‌ధిక వ‌సూళ్ల‌ను సాధించిన డ‌బ్బింగ్ సినిమాలు ఏవంటే

కేజీఎఫ్‌-2

య‌శ్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన క‌న్న‌డ డ‌బ్బింగ్ సినిమా కేజీఎఫ్‌-2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 85 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. తెలుగులో స్టార్ హీరోల రేంజ్‌లో క‌లెక్ష‌న్స్ సొంతం చేసుకున్న‌ది. . తొలిరోజే కేజీఎఫ్ -2 సినిమాకు 17 కోట్ల క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయంటే ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద‌ సృష్టించిన ప్ర‌భంజ‌నం ఏపాటిదో అర్థం చేసుకోవ‌చ్చు.

కేజీఎఫ్‌-2కు బ‌య‌ప‌డి అదే రోజున తెలుగు స్ట్రెయిట్ సినిమాల్ని రిలీజ్ చేయ‌డానికి చాలా మంది నిర్మాత‌లు వెన‌క‌డుగువేశారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్ బ్యాక్‌డ్రాప్‌లో రాఖీభాయ్ అనే యువ‌కుడి ప్ర‌స్థానాన్ని ఆవిష్క‌రిస్తూ ప‌వ‌ర్‌ఫుల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్‌నీల్ ఈ సినిమాను తెర‌కెక్కించాడు.

కాంతారా

రిష‌బ్‌శెట్టి హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన కాంతారా తెలుగులో విడుద‌లై 30 రోజులు దాటినా ఈ సినిమా క‌లెక్ష‌న్స్ జోరు మాత్రం త‌గ్గ‌లేదు. కాంతారా తెలుగు డ‌బ్బింగ్ వెర్ష‌న్‌ యాభై కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. కేవ‌లం రెండు కోట్ల ప్రీ రిలీజ్‌తో విడుద‌లైన ఈ సినిమా నిర్మాత‌ల‌కు ప‌దింత‌ల‌కుపైగా లాభాల్ని తెచ్చిపెట్టింది.

చిరంజీవి గాడ్‌ఫాద‌ర్ క‌లెక్ష‌న్స్ త‌గ్గ‌డానికి కాంతారా కార‌ణ‌మైంది. కాంతారా సినిమాను తెలుగులో అల్లు అర‌వింద్ రిలీజ్ చేశారు. భూత‌కోళ అనే క‌ళ‌ను చ‌ర్చిస్తూ విలేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రిష‌బ్‌శెట్టి ఈ సినిమాను తెర‌కెక్కించాడు.

క‌మ‌ల్‌హాస‌న్ విక్ర‌మ్‌

విక్ర‌మ్ సినిమాతో లాంగ్ గ్యాప్ త‌ర్వాత బిగ్గెస్ట్ క‌మ‌ర్షియ‌ల్ హిట్ అందుకున్నాడు క‌మ‌ల్‌హాస‌న్‌. యాక్ష‌న్ క‌థాంశానికి రివేంజ్ డ్రామాను జోడించి ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌క‌రాజ్ విక్ర‌మ్ సినిమాను తెర‌కెక్కించాడు. తెలుగులో ఈ సినిమా 33 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను ద‌క్కించుకున్న‌ది. తెలుగు వెర్ష‌న్‌ను హీరో నితిన్ ఫాద‌ర్ సుధాక‌ర్‌రెడ్డి విడుద‌ల‌చేశారు. సొంతంగా నిర్మించిన స్ట్రెయిట్ సినిమా మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం కంటే విక్ర‌మ్ సినిమానే ఆయ‌న‌కు భారీగా లాభాల‌ను తెచ్చిపెట్టింది.

విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం రూపొందించిన‌ పొన్నియ‌న్ సెల్వ‌న్ తెలుగు వెర్షన్‌ 19 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ది. చారిత్ర‌క క‌థాంశంతో విక్ర‌మ్‌, జ‌యంర‌వి, కార్తి , త్రిష‌, ఐశ్వ‌ర్య‌రాయ్ లాంటి భారీ తారాగ‌ణంతో తెర‌కెక్కిన ఈ సినిమాకు తెలుగులో 40 కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ వ‌స్తాయ‌ని భావించారు. కానీ ఆ అంచ‌నాల్ని అందుకోలేక ఎగ్జిబిట‌ర్ల‌కు మోస్తారు లాభాల్ని మిగిల్చింది.

స‌ర్దార్ సినిమాతో కోలీవుడ్‌తో పాటు తెలుగులో దీపావ‌ళికి హిట్ అందుకున్నాడు కార్తి. అక్టోబ‌ర్ 21న తెలుగులో రిలీజైన ఈ సినిమా థియేట్రిక‌ల్ ర‌న్‌లో దాదాపు 16 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి నిర్మాత‌ల‌కు లాభాల్ని మిగిల్చింది. ర‌ణ‌బీర్ క‌పూర్‌, అలియాభ‌ట్ జంట‌గా న‌టించిన బ్ర‌హ్మాస్త్ర కూడా తెలుగులో 15 కోట్ల క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ది. తెలుగులో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ సాధించిన బాలీవుడ్ డ‌బ్బింగ్ సినిమాగా నిలిచింది.విజ‌య్ బీస్ట్ సినిమా తెలుగు వెర్ష‌న్‌ 13 కోట్లు, అజిత్ వ‌లిమై ఐదు కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టాయి.

IPL_Entry_Point