OTT Releases This Week: ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు వెబ్‌సిరీస్‌లు ఇవే-farzi hunt love shaadi drama and other movies web series releasing this week on ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Farzi Hunt Love Shaadi Drama And Other Movies Web Series Releasing This Week On Ott

OTT Releases This Week: ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు వెబ్‌సిరీస్‌లు ఇవే

Nelki Naresh Kumar HT Telugu
Feb 09, 2023 06:29 AM IST

OTT Releases This Week: ఈ వారం అజిత్‌, విజ‌య్ సేతుప‌తి, షాహిద్‌క‌పూర్‌తో పాటు ప‌లువురు స్టార్స్ త‌మ సినిమాలు, వెబ్‌సిరీస్‌ల ద్వారా ఓటీటీ ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఆ సినిమాలు, సిరీస్‌లు ఏవంటే...

ఫ‌ర్జీ వెబ్ సిరీస్
ఫ‌ర్జీ వెబ్ సిరీస్

ఫ‌ర్జీ వెబ్ సిరీస్ ఫిబ్ర‌వ‌రి 10 అమెజాన్ ప్రైమ్‌ (Amazon Prime)

షాహిద్ క‌పూర్‌, విజ‌య్ సేతుప‌తి(Vijay Sethupathi), రాశీఖ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న హిందీ వెబ్ సిరీస్ ఫ‌ర్జీ ఫిబ్ర‌వ‌రి 10 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందుతోన్న ఈ సిరీస్‌కు ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ రాజ్ డీకే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నారు. విజ‌య్ సేతుప‌తి, షాహిద్ క‌పూర్ కెరీర్‌లో తొలి వెబ్‌సిరీస్ ఇదే. ఈ సిరీస్‌తోనే వీరిద్ద‌రు డిజిట‌ల్ వ‌ర‌ల్డ్ లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. ఫ్యామిలీ మ్యాన్ స‌క్సెస్ త‌ర్వాత రాజ్ డీకే తెర‌కెక్కించిన ఈ సిరీస్‌పై భారీగా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎపిసోడ్ 2

బాల‌కృష్ణ (Balakrishna) హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) రెండో ఏపిసోడ్ గురువారం (నేడు)రిలీజ్ కానుంది. గ‌త వారం రిలీజైన ఫ‌స్ట్ ఎపిసోడ్ అభిమానుల‌ను ఆక‌ట్టుకొంది. రెండో ఎపిసోడ్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను బాల‌కృష్ణ ఎక్కువ‌గా రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌పై ప్ర‌శ్న‌లు అడిగిన‌ట్లు ప్రోమోలో చూపించారు.

సుధీర్ బాబు హంట్ (Hunt) - ఫిబ్ర‌వ‌రి 10 - అమెజాన్ ప్రైమ్‌

సుధీర్‌బాబు హీరోగా న‌టించిన హంట్ మూవీ రిప‌బ్లిక్ డే కానుక‌గా జ‌న‌వ‌రి 26న థియేట‌ర్ల ద్వారా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ప్ర‌యోగాత్మ‌క క‌థాంశంతో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా ప‌దిహేను రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతున్న‌ది. ఫిబ్ర‌వ‌రి 10న ఆమెజాన్ ప్రైమ్‌లో హంట్ మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ప్రేమిస్తే భ‌ర‌త్‌, శ్రీకాంత్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. మ‌హేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. గ‌తం మ‌ర్చిపోయిన ఓ పోలీస్ ఆఫీస‌ర్ క‌థ‌తో ఈ సినిమా తెర‌కెక్కింది.

అజిత్ తునివు(Thunivu) నెట్‌ఫ్లిక్స్‌

అజిత్ హీరోగా న‌టించిన తునివు నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్ర‌వ‌రి 8 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. సంక్రాంతి కానుక‌గా థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ సినిమా 150 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. బ్యాంకు స్కాముల‌కు యాక్ష‌న్ అంశాల‌ను మేళ‌వించి ద‌ర్శ‌కుడు హెచ్ వినోద్ ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఇందులో డార్క్ డెవిల్ అనే ఇంట‌ర్‌నేష‌న‌ల్ క్రిమిన‌ల్‌గా అజిత్ న‌టించాడు.

ల‌వ్ షాదీ డ్రామా - ఫిబ్ర‌వ‌రి 10 - డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌

క‌థానాయిక హ‌న్సిక (Hansika) పెళ్లి డాక్యుమెంట‌రీ ల‌వ్ షాదీ డ్రామా పేరుతో ఫిబ్ర‌వ‌రి 10 నుంచి డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. సోహైల్ క‌తురియా అనే వ్యాపార‌వేత్త‌ను డిసెంబ‌ర్ 4న పెళ్లాడింది హ‌న్సిక‌. వీరి పెళ్లి వీడియో స్ట్రీమింగ్ రైట్స్‌ను భారీ రేట్‌కు డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ ద‌క్కించుకున్న‌ది.

శివ‌రాజ్‌కుమార్ వేద - ఫిబ్ర‌వ‌రి 10 జీ5

క‌న్న‌డ అగ్ర హీరో శివ‌రాజ్‌కుమార్ న‌టించిన 125వ సినిమా వేద ఫిబ్ర‌వ‌రి 10న జీ5 ఓటీటీ ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది. రివేంజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సినిమాకు హ‌రి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. తెలుగులో అదే పేరుతో గురువారం (నేడు) థియేట‌ర్ల‌లో ఈ సినిమా రిలీజైంది. థియేట‌ర్ల‌లో రిలీజైన ఒక్క రోజు గ్యాప్‌లోనే ఈసినిమా ఓటీటీలో రిలీజ్ కాబోతున్న‌ది.

రాజ‌యోగం (తెలుగు) - ఫిబ్ర‌వ‌రి 9 - డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌

యువ‌ర్ ప్లేస్ ఈజ్ మైన్ - నెట్‌ఫ్లిక్స్‌

ల‌వ్ ఈజ్ బ్లైండ్ - నెట్‌ఫ్లిక్స్‌

మ‌హావీర్‌యార్ స‌న్‌నెక్ట్స్‌

స‌లామ్ వెంకీ - జీ5

10 డేస్ ఆఫ్ ఏ గుడ్ మ్యాన్ - నెట్‌ఫ్లిక్స్‌

మార్వెల్ స్టూడియోస్ లెజెండ్స్ సీజ‌న్ 2 - డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌

ల‌వ్ టూ హేట్ యూ - నెట్‌ఫ్లిక్స్‌

నిజం విత్ స్మిత టాక్ షో - సోని లివ్‌

డియ‌ర్ డేవిడ్ - నెట్‌ఫ్లిక్స్‌

IPL_Entry_Point