Dhoni Tamil Movie : ధోని ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి తొలి సినిమా టైటిల్ వచ్చేసిందోచ్-dhoni entertainment first movie name lets get married
Telugu News  /  Entertainment  /  Dhoni Entertainment First Movie Name Lets Get Married
ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌
ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ (twitter)

Dhoni Tamil Movie : ధోని ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి తొలి సినిమా టైటిల్ వచ్చేసిందోచ్

28 January 2023, 7:48 ISTAnand Sai
28 January 2023, 7:48 IST

Dhoni Entertainment First Movie : ఎం.ఎస్ ధోని కొత్త కెరీర్‌ మొదలుపెట్టాడు. ధోనితోపాటు అతని భార్య సాక్షి సింగ్‌ ప్రమోట్‌ చేస్తున్న ధోని ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (డీఈపీఎల్‌) ఓ తమిళ సినిమా తీయబోతున్నట్లు గతంలోనే చెప్పారు. తాజాగా సినిమా టైటిల్ ప్రకటించారు.

క్రికెటర్ ఎం.ఎస్. ధోని సినిమా నిర్మాణంలోకి వెళ్లడం ఖాయమని అప్పట్లో వార్తలు వచ్చాయి. 2019లోనే ధోని ఎంటర్‌టైన్‌మెంట్‌(Dhoni Entertainment) ప్రారంభమైంది. అయితే, ఈ సినిమా ఏంటి? ఎవరు దర్శకత్వం వహిస్తారనే దానిపై అధికారిక సమాచారం అప్పుడు లేదు. ఇప్పుడు ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఓ ప్రకటన చేసింది. మొదటి సినిమా టైటిల్ 'లెట్స్ గెట్ మ్యారిడ్'గా(Lets Get Married) ఫిక్స్ చేశారు. . అడవి మధ్యలో రోడ్డుపై వ్యాన్‌ నడుపుతున్నట్లుగా గ్రాఫిక్స్‌ చిత్రీకరించారు.

ధోనికి, తమిళనాడుకు మధ్య మంచి అనుబంధం ఉంది. దీనికి కారణం ఐపీఎల్(IPL). చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ధోని నాయకత్వం వహిస్తున్నాడు. అలా తమిళనాడులో విపరీతమైన అభిమానులను సృష్టించుకున్నాడు. ఈ కారణంగానే తొలి చిత్రాన్ని తమిళంలో నిర్మిస్తున్నారు.

ధోని ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న తొలి చిత్రం టైటిల్‌ను విడుదల చేశారు. అడవి మధ్యలో రోడ్డుపై వ్యాన్‌ నడుపుతున్నట్లుగా గ్రాఫిక్స్‌ చిత్రీకరించారు. 'LGM' అనేది సినిమా టైటిల్. రమేష్ తమిళమణి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, సాక్షి సింగ్ ధోని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కేవలం తమిళ సినిమానే కాకుండా చాలా మంది దర్శకులతో ధోని సంప్రదింపులు జరుపుతున్నాడు. ధోనికి మొదటి నుంచి సినిమా అంటే ఆసక్తి. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత దీనిపై దృష్టి సారించాడు. ధోని వెబ్ సిరీస్‌ల నిర్మాణంపై కూడా దృష్టి పెట్టాడని టాక్.

ధోని భార్య సాక్షి కథకు సంబంధించిన కాన్సెప్ట్‌ను చెప్పింది. అది ధోనికి నచ్చింది. ఈ నేపథ్యంలోనే సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ తరహాలో ఈ సినిమా రూపొందుతుందని దర్శకుడు రమేష్‌ చెప్పినట్లు కొన్ని మీడియాల్లో వార్తలు వచ్చాయి.

ఎమ్మెస్‌ ధోనిని ఓ సూపర్‌హీరోగా చూపిస్తూ అథర్వ-ది ఆరిజిన్‌ అనే నవలను రాసిన రమేష్‌ తమిళమణి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటి వరకూ ఈ సినిమాకు సంబంధించి స్టోరీ, డైరెక్టర్‌, టైటిల్ గురించి మాత్రమే అధికారికంగా వెల్లడించారు. ఇదొక సరదా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందని రమేష్ చెబుతున్నాడు.