Chiranjeevi Waltair Veerayya: సంక్రాంతికి వాల్తేర్ వీర‌య్య‌, వీర‌సింహారెడ్డి రెండు సినిమాలు ఆడాలి - చిరంజీవి-chiranjeevi says waltair veerayya and veera simha reddy both films to perform well at boxoffice ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Chiranjeevi Says Waltair Veerayya And Veera Simha Reddy Both Films To Perform Well At Boxoffice

Chiranjeevi Waltair Veerayya: సంక్రాంతికి వాల్తేర్ వీర‌య్య‌, వీర‌సింహారెడ్డి రెండు సినిమాలు ఆడాలి - చిరంజీవి

Nelki Naresh Kumar HT Telugu
Jan 09, 2023 07:25 AM IST

Chiranjeevi Waltair Veerayya: వాల్తేర్ వీర‌య్య సినిమా కోసం ద‌ర్శ‌కుడు బాబీ ప‌డిన క‌ష్టాన్ని చూసి అత‌డికి అభిమానిగా మారిపోయాన‌ని అన్నాడు చిరంజీవి. సినిమాలో త‌న‌తో పాటు ర‌వితేజ క్యారెక్ట‌ర్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయ‌ని వెల్ల‌డించాడు.

ర‌వితేజ , చిరంజీవి
ర‌వితేజ , చిరంజీవి

Chiranjeevi Waltair Veerayya: సంక్రాంతి పండుగ‌కు విడుద‌ల‌కానున్న వాల్తేర్ వీర‌య్య‌, వీర‌సింహారెడ్డి సినిమాలు పెద్ద విజ‌యాల్ని సాధించాల‌ని చిరంజీవి ఆకాంక్షించారు. వాల్తేర్ వీర‌య్య ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌లా అభిమానుల‌ను అల‌రిస్తుంద‌ని అన్నాడు.

చిరంజీవి హీరోగా న‌టించిన వాల్తేర్ వీర‌య్య సినిమా జ‌న‌వ‌రి 13న రిలీజ్ కానుంది. ర‌వితేజ మ‌రో హీరోగా న‌టించాడు. మెగా మాస్ పార్టీ పేరుతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం విశాఖ‌ప‌ట్నంలో నిర్వ‌హించారు.

ఈ వేడుక‌లో చిరంజీవి మాట్లాడుతూ ఈ సినిమా కోసం శ‌నివారం నైట్ వ‌ర‌కు బాబీ క‌ష్ట‌ప‌డుతూనే ఉన్నాడ‌ని అన్నాడు. ఎడిటింగ్ రూమ్‌లో కూర్చొని కొన్ని త‌ప్పుల్ని స‌రిదిద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బాబీ వ‌చ్చాడ‌ని చిరంజీవి పేర్కొన్నారు. బాబీ నాకు అభిమాని అనే ఆలోచ‌న‌తో అత‌డికి వాల్తేర్ వీర‌య్య సినిమా ఇవ్వ‌లేదు. వ‌ర్క్‌ను ప్రేమిస్తూ క‌ష్టాన్ని న‌మ్ముకునే వ్య‌క్తి అనే ఆలోచ‌న‌తో అత‌డికి అవ‌కాశం ఇచ్చాను. రెండేళ్లు ఈ సినిమా కోసం చాలా శ్ర‌మించాడు. బాబీ ఈ సినిమాకు ప‌డిన క‌ష్టాన్ని చూసి నేను అత‌డికి అభిమానిగా మారిపోయా.

తొలిసారి బాబీ చెప్పిన క‌థ విన‌గానే సినిమా సూప‌ర్ హిట్ అనే న‌మ్మ‌కం క‌లిగింది. ఇండ‌స్ట్రీ ముందుకు సాగాలంటే మైత్రీ మూవీ మేక‌ర్స్ లాంటి నిర్మాత‌లు కావాలి. అలాంటి నిర్మాత‌లు తెలుగు ఇండ‌స్ట్రీకి చాలా అవ‌స‌రం. తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఒకే నిర్మాత‌లు తీసిన రెండు భారీబ‌డ్జెట్ సినిమాలు ఒకే స‌మ‌యంలో రిలీజ్ కావ‌డం అన్న‌ది ఫ‌స్ట్ టైమ్ జ‌రుగుతోంది. స‌బ్జెక్ట్‌ల‌పై ఉన్న కాన్ఫిడెన్స్‌తోనే ధైర్యంగా మైత్రీ మూవీస్ నిర్మాత‌లు రెండు సినిమాల్ని విడుద‌ల‌చేస్తున్నారు.

సంక్రాంతికి రిలీజ్ కానున్న వీర‌సింహారెడ్డితో పాటు వాల్తేర్ వీర‌య్యవిజ‌య‌వంతం కావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను నటించిన హిందీ సినిమా ఆజ్‌గా గుండా రాజ్ లో స్నేహితుడిగా చిన్న క్యారెక్ట‌ర్ చేశాడు ర‌వితేజ‌.

ఆ స‌మ‌యంలో హిందీలోనే ఎక్కువ‌గా మాట్లాడేవాడు. అత‌డిని చూస్తుంటే బాలీవుడ్ హీరో లా అనిపించేది. ఆ త‌ర్వాత ఇద్ద‌రం క‌లిసి అన్న‌య్య సినిమా చేశాం. ర‌వితేజ సినిమాల్లో వెట‌కారం బాగుంటుంది.ఆ వెట‌కారం కోస‌మే అత‌డి సినిమాలు చూస్తుంటా. వాల్తేర్ వీర‌య్య‌లో మా ఇద్ద‌రి క్యారెక్ట‌ర్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి.

ర‌వితేజ క్యారెక్ట‌ర్ సెకండాఫ్‌లో ఎంట్రీ ఇస్తుంది. ర‌వితేజ ఎంట్రీతో వాల్తేర్ వీర‌య్య మ‌రో లెవ‌ల్‌లోకి వెళుతుంది. బిజీ టైమ్‌లో మా సినిమాకు ర‌వితేజ డేట్స్ కేటాయించ‌డం ఆనందంగా ఉంది అని చిరంజీవి అన్నాడు.

వాల్తేర్ వీరయ్య బ్లాక్ బస్టర్ - రవితేజ

ర‌వితేజ మాట్లాడుతూ వాల్తేర్ వీర‌య్య సూప‌ర్ హిట్ అవుతుంద‌నేది చాలా చిన్న ప‌ద‌మ‌ని పేర్కొన్నాడు. సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ గా నిలుస్తుందని రవితేజ పేర్కొన్నాడు. విజేత హండ్రెడ్ డేస్ ఫంక్ష‌న్‌కు హాజ‌రైన స‌మ‌యంలో ఏదో ఒక రోజు చిరంజీవిగారి ప‌క్క‌న కూర్చుంటాన‌ని అనుకున్నా. అది నిజ‌మైంది.

ఫ్రెండ్ క్యారెక్ట‌ర్‌, త‌మ్ముడి క్యారెక్ట‌ర్స్ చేస్తూ ఈ రోజు ఆయ‌న‌తో క‌లిసి వాల్తేర్ వీర‌య్య సినిమా చేసే స్థాయికి ఎద‌గ‌డం ఆనందంగా ఉంది. సెట్స్‌లో చిరంజీవితో గ‌డిపిన ప్ర‌తి క్ష‌ణం ఎప్ప‌టికీ గుర్తుండిపోతుంది అని ర‌వితేజ పేర్కొన్నాడు.

చిరంజీవితో సినిమా చేస్తాన‌ని మా నాన్న‌కు ఇచ్చిన మాట‌ను వాల్తేర్ వీర‌య్య‌తో నిల‌బెట్టుకున్నాన‌ని, చిరంజీవికి గొప్ప బ‌హుమ‌తిలా ఈ సినిమా ఉంటుంద‌ని ద‌ర్శ‌కుడు బాబీ అన్నాడు.

IPL_Entry_Point