Balakrishna in Bigg Boss Telugu 7: బిగ్ బాస్ ఏడో సీజన్‌కు హోస్ట్‌గా బాలయ్య.. నాగార్జున ఔట్!
Balakrishna in Bigg Boss Telugu 7: బిగ్ బాస్ ఏడో సీజన్‌కు హోస్ట్‌గా బాలయ్య రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. నాలుగు సీజన్ల పాటు హోస్ట్‌గా ఉన్న నాగార్జున ఇక ఈ షోకు గుడ్‌బై చెప్పనున్నాడు.
Balakrishna in Bigg Boss Telugu 7: బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ గత ఆదివారమే (డిసెంబర్ 18) ముగిసింది. ఈసారి ఎన్నో వారాల పాటు పెద్దగా ఆసక్తి లేకుండా సాగిన ఈ రియాల్టీ షోలో మొత్తానికి సింగర్ రేవంత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఆరో సీజన్ ముగియగానే ఏడో సీజన్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఫ్యాన్స్‌లో తెగ ఆసక్తి రేపుతోంది.
ట్రెండింగ్ వార్తలు
వచ్చే సీజన్‌కు నాగార్జున స్థానంలో నందమూరి బాలకృష్ణ ఈ షోకు హోస్ట్‌గా రానున్నట్లు పింక్‌విల్లా వెల్లడించింది. ఈ షో తొలి సీజన్‌కు జూనియర్ ఎన్టీఆర్, రెండో సీజన్‌కు నాని హోస్ట్‌గా ఉన్న విషయం తెలిసిందే. మూడో సీజన్‌లో వచ్చిన నాగార్జున తర్వాత నాలుగు సీజన్ల పాటు బిగ్ బాస్‌ను ఆసక్తికరంగా నడిపించడంలో సక్సెస అయ్యాడు.
అయితే ఇప్పుడు ఆరో సీజన్ ముగిసిన తర్వాత నాగ్ ఈ షోకు గుడ్‌బై చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అతని స్థానంలో బాలయ్య బాబు హోస్ట్‌గా రానున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. కానీ ఏడాదిలో నాలుగైదు నెలల పాటు బిగ్ బాస్ షోకు సమయం కేటాయించే కంటే సినిమాలపై ఫోకస్ చేయడం బెటరని నాగార్జున భావిస్తున్నట్లు సమాచారం.
దీంతో ఏడో సీజన్‌లో బాలకృష్ణ ఈ బాధ్యతలు తీసుకోనున్నాడు. ఇప్పటికే షో నిర్వాహకులు బాలయ్య బాబుతో దీనిపై చర్చలు జరిపారు. ఆహా ఓటీటీలో వస్తున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకేలో తనదైన మార్క్ యాంకరింగ్‌తో షోను బాలకృష్ణ రక్తి కట్టిస్తున్నాడు. రియాల్టీ షోను ఎలా నడపాలన్నది అతనికి ఇప్పటికే తెలిసిపోయింది. దీంతో బిగ్ బాస్‌లాంటి హిట్ షోను బాలయ్య చేతుల్లో పెడితే అది మరింత హిట్ టాక్ సొంతం చేసుకోవడం ఖాయమని నిర్వాహకులు భావిస్తున్నారు.
గాడ్ ఆఫ్ మాసెస్‌గా పేరున్న బాలకృష్ణ హోస్ట్ చేస్తే బిగ్ బాస్ క్రేజ్ మరింత పెరగడం ఖాయం. ఇప్పటికే అన్‌స్టాపబుల్ షో ఏ రేంజ్‌లో బజ్ క్రియేట్ చేస్తుందో చూస్తూనే ఉన్నాం. తన షోకు వచ్చే సెలబ్రిటీ గెస్ట్‌లను బాలయ్య ఆటాడేసుకుంటున్నాడు. ఇక ఇప్పుడు న్యూఇయర్ స్పెషల్ షోలో ఏకంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తోపాటు మాచో స్టార్ గోపీచంద్ కూడా రానున్నారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ కూడా వస్తున్నట్లు ఈ మధ్యే వార్తలు వచ్చాయి.