Bigg Boss 6 Telugu Winner Revanth: బిగ్‌బాస్ సీజన్ 6 విజేతగా రేవంత్ -విన్నర్‌కు దక్కిన ప్రైజ్‌మనీ ఎంతంటే
Bigg Boss 6 Telugu Winner Revanth: బిగ్‌బాస్ సీజన్ 6 విజేతగా సింగర్ రేవంత్ నిలిచాడు. రన్నరప్‌గా శ్రీహాన్ నిలిచాడు. విజేతగా నిలిచిన రేవంత్‌కు పది లక్షల ప్రైజ్‌మనీ దక్కింది.
Bigg Boss 6 Telugu Winner Revanth: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 విజేతగా సింగర్ రేవంత్ నిలిచాడు. అతడికి పది లక్షల ప్రైజ్‌మనీ తో పాటు ఓ ఫ్లాట్‌తో పాటు కారు బహుమతిగా దక్కింది. రన్నరప్‌గా నిలిచిన శ్రీహాన్... రేవంత్ కంటే ఎక్కువ ప్రైజ్‌మనీ అందుకోవడం విశేషం. విన్నర్‌గా రేవంత్ పేరును నాగార్జున ప్రకటించగానే అతడు సంబరాలు చేసుకున్నాడు. ట్రోఫీని శ్రీహాన్‌తో కలిసి పంచుకున్నాడు. ఇద్దరం విన్నర్స్‌మే అంటూ పేర్కొన్నాడు.
ట్రెండింగ్ వార్తలు
శ్రీహాన్‌కు నలభై లక్షలు...
గ్రాండ్ ఫినాలేలో చివరగా ట్రోఫీ రేసులో రేవంత్, శ్రీహాన్ మాత్రమే మిగడంతో బిగ్‌బాస్ హౌజ్‌లోకి 25 లక్షలతో కూడిన గోల్డెన్ సూట్‌కేస్‌తో అడుగుపెట్టాడు నాగార్జున. ఆ సూట్‌కేస్‌ను తీసుకొని ఓ వ్యక్తి హౌజ్‌ను వీడవచ్చని అన్నాడు. నాగార్జున ఆఫర్‌ను రేవంత్, శ్రీహాన్ ఇద్దరు ఒప్పుకోలేదు. గోల్డెన్ సూట్‌కేస్ ప్రైజ్‌మనీని 30 లక్షలకు పెంచిన కూడా ఇద్దరు ట్రోఫీ గెలవడమే లక్ష్యమని చెప్పారు. ప్రైజ్‌మనీ నలభై లక్షలకు పెంచడంతో మాజీ కంటెస్టెంట్స్‌తో పాటు తల్లిదండ్రుల సలహా మేరకు నలభై లక్షలను తీసుకొని శ్రీహాన్ హౌజ్‌నువీడాడు. అతడు హౌజ్ నుంచి వెళ్లిపోవడంతో రేవంత్‌ను విజేతగా నిలిచాడు.
శ్రీహాన్‌కు ఎక్కువ ఓట్లు…
ఫైనల్ ఓటింగ్‌లో విన్నర్ రేవంత్ కంటే శ్రీహాన్‌కు ఎక్కువగా ఓట్లు వచ్చినట్లు నాగార్జున ప్రకటించారు. కానీ శ్రీహాన్ నలభై లక్షలు క్యాష్ తీసుకొని బయటకు రావడంతో అతడికి ట్రోఫీ దక్కలేదు. విన్నర్‌గా రేవం
గ్రాండ్ ఫినాలేలో హీరోలు రవితేజ, నిఖిల్ సందడి చేశారు. వారితో పాటు బిగ్‌బాస్ 6 కంటెస్టెంట్స్, ఫైనలిస్ట్‌ల ఫ్యామిలీ మెంబర్స్ షోకు హాజరయ్యారు. గ్రాండ్ ఫినాలేకు రేవంత్, శ్రీహాన్‌తో పాటు ఆదిరెడ్డి, రోహిత్, కీర్తి వచ్చిన సంగతి తెలిసిందే. రెడ్ క్యాప్ టాస్క్‌లో తొలుత రోహిత్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. అతడికి హౌజ్ నుంచి నిఖిల్ బయటకు తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత మానెక్విన్ టాస్క్‌లో ఆదిరెడ్డి ఎలిమినేట్ అయ్యాడు. చివరకు హౌజ్‌లో కీర్తి, శ్రీహాన్, రేవంత్ మాత్రమే మిగిలారు.
30 లక్షలు వద్దన్న కంటెస్టెంట్స్
బిగ్‌బాస్ హౌజ్‌లోకి సిల్వర్ సూట్‌కేస్‌తో రవితేజ ఎంటర్ అయ్యాడు. ముగ్గురిలో ఒకరు సూట్‌కేస్‌లోని ప్రైజ్‌మనీలోని 20 పర్సెంట్ తీసుకొని హౌజ్‌ను వీడవచ్చని అన్నాడు. ముగ్గురు కాదనడంతో సూట్‌కేస్‌లోని మనీని 30 శాతానికి అంటే 30 లక్షలకు పెంచాడు. అయినా ముగ్గురు డబ్బులు తీసుకోవడానికి ఒప్పుకోలేదు. దాంతో ఈ ముగ్గురిలో కీర్తి ఎలిమినేట్ అయ్యింది..