Balagam Trp Rating: బలగం టీఆర్‌పీ రేటింగ్ - ఆస్కార్ విన్నింగ్ మూవీని దాటేసిందిగా
Balagam Trp Rating: బలగం సినిమా బుల్లితెరపై కూడా రికార్డ్ క్రియేట్ చేసింది. పలు టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ కంటే టీఆర్‌పీ రేటింగ్‌ను దక్కించుకొంది.
Balagam Trp Rating: బలగం మూవీ రికార్డ్ టీఆర్‌పీ రేటింగ్‌ను సొంతం చేసుకొని బుల్లితెరపై సంచలనం సృష్టించింది. గత ఆదివారం స్టార్ మా ఛానెల్‌లో ఈ సినిమా టెలికాస్ట్ అయ్యింది. ఫస్ట్ టీవీ ప్రీమియర్ కు 14.30 టీఆర్‌పీ రేటింగ్ వచ్చింది టీఆర్‌పీ రేటింగ్స్‌లో ఈ ఏడాది రిలీజైన భారీ బడ్జెట్ సినిమాల్ని బలగం దాటేయడం గమనార్హం.
అంతే కాకుండా ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల ఆస్కార్ విన్నింగ్ మూవీ ఆర్ఆర్ఆర్ (8.17), వీరసింహారెడ్డి (8.83) , అరవింద సమేత వీరరాఘవ (13.7) పాటు పలు టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ కంటే బలగం సినిమాకు ఎక్కువగా టీఆర్‌పీ రేటింగ్ రావడం గమనార్హం. మార్చి 3న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ అంచనాలకు మించి విజయాన్ని అందుకున్నది.
కేవలం కోటి రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన బలగం 30 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఓటీటీలో రిలీజైన కూడా థియేటర్లలో అద్భుతమైన ఆదరణను దక్కించుకొని నిర్మాతలకు పదిహేను కోట్లకుపైగా లాభాల్ని మిగిల్చింది. పలు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్‌లో అవార్డులను అందుకున్నది.
ఈ సినిమాతో కమెడియన్ వేణు టిల్లు దర్శకుడిగా టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేశాడు. చావు నేపథ్యంలో కుటుంబ అనుబంధాలు, ఆప్యాయతలకు పెద్దపీట వేస్తూ ఈ సినిమాను తెరకెక్కించాడు. బలగం సినిమాలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ హీరోహీరోయిన్లుగా నటించారు. దిల్ రాజు సమర్పణలో ఆయన కూతురు హన్షిత, హర్షిత్‌రెడ్డి బలగం సినిమాను నిర్మించారు.