Anushka Shetty: ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్ మార్చిన అనుష్క - క్లాసిక్ హిట్ ను గుర్తుతెచ్చుకొంది-anushka shetty changes her instagram profile pic
Telugu News  /  Entertainment  /  Anushka Shetty Changes Her Instagram Profile Pic
అనుష్క
అనుష్క (instagram)

Anushka Shetty: ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్ మార్చిన అనుష్క - క్లాసిక్ హిట్ ను గుర్తుతెచ్చుకొంది

19 September 2022, 14:29 ISTNelki Naresh Kumar
19 September 2022, 14:29 IST

Anushka Shetty: తెలుగులో అనుష్క సినిమా రిలీజై మూడేళ్లు దాటిపోయింది. ప్ర‌స్తుతం న‌వీన్ పొలిశెట్టితో ఓ సినిమా చేస్తోంది అనుష్క‌. తాజాగా ఆదివారం ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్ మార్చేసింది.

Anushka Shetty: త‌మ సినిమాల ప్ర‌మోష‌న్స్‌,వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించిన విష‌యాల్ని అభిమానుల‌తో పంచుకోవ‌డానికి సోష‌ల్ మీడియాను చ‌క్క‌టి వేదిక‌గా సినిమా స్టార్స్ ఉప‌యోగించుకుంటున్నారు. అందుకే నిత్యం సోష‌ల్‌మీడియా ద్వారా అభిమానుల‌తో ట‌చ్‌లో ఉంటుంటారు. కానీ కొంద‌రు హీరోహీరోయిన్లు మాత్రం సోష‌ల్ మీడియా ప్ర‌పంచం ప‌ట్ల అంత‌గా ఆస‌క్తిని చూపించ‌రు. వారిలో అనుష్క ఒక‌రు. సోష‌ల్ మీడియాలో అనుష్క యాక్టివ్‌గా క‌నిపించ‌దు.

అప్పుడ‌ప్పుడు త‌న ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేయ‌డం,కొన్ని సినిమాల‌ను ప్ర‌మోట్ చేయ‌డం కోస‌మే సోష‌ల్ మీడియాను వాడుతుంటుంది. అనుష్క‌కు ఇన్‌స్టాగ్రామ్ లో దాదాపు5.6 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్ ఉన్నారు. తాజాగా అనుష్క త‌న ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్‌ను మార్చింది.

అరుంధ‌తిలోని ఇంటెన్స్ పోస్ట‌ర్‌ను ప్రొఫైల్ పిక్‌గా సెలెక్ట్ చేసుకున్న‌ది. ఈ ఫొటోకు ఎలాంటి క్యాప్ష‌న్ ఇవ్వ‌లేదు. టీవీలో ఇటీవల అరుంధతి టెలికాస్ట్ అయ్యింది. ఆ సినిమాను గుర్తుచేసుకుంటూ అనుష్క ప్రొఫైల్ పిక్ మార్చిందంటూ అభిమానులు పేర్కొంటున్నారు.

కాగా అనుష్క తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చి మూడేళ్లు దాటిపోయింది. ఆమె గ‌త చిత్రం నిశ్శ‌బ్దం ఓటీటీలో రిలీజైంది. చిరంజీవి సైరా న‌ర‌సింహారెడ్డిలో అతిథి పాత్ర‌లో అనుష్క మెరిసింది. ప్ర‌స్తుతం న‌వీన్ పొలిశెట్టితో ఓ సినిమా చేస్తోంది అనుష్క‌. ఈ సినిమాకు మ‌హేష్ బాబు పి. ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతోంది.