Allu Arjun Pushpa 2: పుష్ప -2 అస్స‌లు త‌గ్గేదేలే - సీక్వెల్‌పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ చెప్పిన బ‌న్నీ-allu arjun reveals on pushpa 2 update at urvasivo rakshasivo success meet ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Allu Arjun Reveals On Pushpa 2 Update At Urvasivo Rakshasivo Success Meet

Allu Arjun Pushpa 2: పుష్ప -2 అస్స‌లు త‌గ్గేదేలే - సీక్వెల్‌పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ చెప్పిన బ‌న్నీ

Nelki Naresh Kumar HT Telugu
Nov 07, 2022 12:55 PM IST

Allu Arjun Pushpa 2: పుష్ప -2కు సంబంధించిన అప్‌డేట్‌ను ఊర్వ‌శివో రాక్ష‌సివో స‌క్సెస్‌మీట్‌లో అల్లు అర్జున్ రివీల్ చేశాడు. ఆ అప్‌డేట్ ఏదంటే...

అల్లు అర్జున్
అల్లు అర్జున్

Allu Arjun Pushpa 2: పుష్ప సినిమాలో త‌గ్గేదేలే అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్స్‌, అత‌డి మేన‌రిజ‌మ్స్ పాపుల‌ర్ అయ్యాయి. పుష్ప -2లో డైలాగ్స్ విష‌యంలో సుకుమార్ ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోనున్నాడో అని అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఊర్వ‌శివో రాక్ష‌సివో స‌క్సెస్‌మీట్‌లో పుష్ప -2లో ఓ డైలాగ్‌ను బ‌న్నీ లీక్ చేశాడు.

పుష్ప -2 అస్స‌లు త‌గ్గేదేలే అంటూ డైలాగ్ చెప్పి అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాడు. ఊర్వ‌శివో రాక్ష‌సివో స‌క్సెస్ మీట్‌లో అల్లు అర్జున్ మాట్లాడుతూ అంద‌రూ పుష్ప 2 అప్‌డేట్స్ కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు అని నాకు తెలుసు. నేనో చిన్న అప్‌డేట్ ఇస్తా. పుష్ప -1 త‌గ్గేదేలే అంటే పుష్ప -2 మాత్రం అస్స‌లు త‌గ్గేదేలే అంటూ అల్లు అర్జున్ డైలాగ్ చెప్పాడు.

త‌ప్ప‌కుండా సినిమా పాజిటివ్‌గా ఉంటుంద‌ని అనుకుంటున్న‌ట్లు బ‌న్నీ పేర్కొన్నాడు. ఈ సీక్వెల్ కోసం తాను ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాట్లు చెప్పాడు. అదే ఎగ్జైట్‌మెంట్ అభిమానుల్లో ఈసినిమా క‌లిగిస్తుంద‌ని తెలిపాడు. అందుకోసం ఏ విష‌యంలోనైనా త‌గ్గేదేలా అంటూ బ‌న్నీ చెప్పాడు. పుష్ప సీక్వెల్‌లో బ‌న్నీని ఉద్దేశించి సుకుమార్ అస్స‌లు త‌గ్గేదేలే అనే డైలాగ్ రాసిన‌ట్లు, అదే డైలాగ్‌ను ఊర్వ‌శివో రాక్ష‌సివో స‌క్సెస్ మీట్‌లో అల్లు అర్జున్ లీక్ చేసిన‌ట్లు ఫ్యాన్స్ పేర్కొంటున్నారు.

కాగా పుష్ప సీక్వెల్ ఈ వారంలోనే సెట్స్‌పైకిరానుంది. బ్యాంకాక్‌లో షూటింగ్ మొద‌లుపెట్ట‌బోతున్న‌ట్లు చెబుతున్నారు. పోలీస్ ఆఫీస‌ర్ భ‌న్వ‌ర్‌సింగ్ షెక‌వాత్‌తో పుష్ప‌రాజ్ పోరాటంతో పాటు సిండికేట్ నాయ‌కుడిగా, ఫ్యామిలీ ప‌రంగా త‌న‌కు ఎదురైన అడ్డంకుల‌ను అత‌డు ఎలా అధిగ‌మించాడో సీక్వెల్‌లో సుకుమార్ ఆవిష్క‌రించ‌బోతున్నాడు.

ఈ సీక్వెల్‌లో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఫ‌హాద్ ఫాజిల్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు. వ‌చ్చే ఏడాది పుష్ప -2 ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. పుష్ప పాన్ ఇండియ‌న్ స్థాయిలో పెద్ద విజ‌యాన్ని సాధించ‌డంతో పుష్ప -2పై బ‌న్నీ, సుకుమార్ స్పెష‌ల్ కేర్ తీసుకుంటున్నారు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ కోస‌మే దాదాపు ఏడెనిమిది నెల‌లు స‌మ‌యాన్ని కేటాయించారు.

IPL_Entry_Point