Suhas Interview: రైటర్ పద్మభూషణ్ నవ్విస్తూ ఏడిపిస్తాడు.. సినిమా గురించి సుహాస్ ఆసక్తికర వ్యాఖ్యలు-actor suhas says writer padmabhushan movie is full length entertainer ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Actor Suhas Says Writer Padmabhushan Movie Is Full Length Entertainer

Suhas Interview: రైటర్ పద్మభూషణ్ నవ్విస్తూ ఏడిపిస్తాడు.. సినిమా గురించి సుహాస్ ఆసక్తికర వ్యాఖ్యలు

Maragani Govardhan HT Telugu
Jan 26, 2023 08:42 PM IST

Suhas Interview: కలర్ ఫోటో తర్వాత సుహాస్ హీరోగా నటించిన చిత్రం రైటర్ పద్మభూషణ్. ఈ సినిమా ఫిబ్రవరి 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా మాట్లాడిన అతడు మూవీ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

సుహాస్
సుహాస్

Suhas Interview: కలర్ ఫోటో చిత్రంతో ఓవర్ నైట్ హీరోగా ఎదిగిపోయాడు యాక్టర్ సుహాస్. తనదైన శైలి యాక్టింగ్‌తో సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమా నేషనల్ అవార్డు కూడా రావడంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా ఇచ్చిన విజయంతో ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు సుహాస్. వోల్‌సమ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఓ సినిమాలో నటించాడు. అదే రైటర్ పద్మభూషణ్. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదలై సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న సుహాస్ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

రైటర్ పద్మభూషణ్ సినిమా చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంటుందని సుహాస్ చెప్పాడు. "సినిమా అంతా చాలా ఉత్కంఠగా ఉంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌కు అందరూ కనెక్ట్ అవుతారు. రైటర్ పద్మభూషణ్ కచ్చితంగా ఎంటర్టైన్ చేస్తాడు. ఇందులో మూడు, నాలుగు ట్విస్టులు ఉంటాయి. క్లైమాక్స్‌లో ఇంకా మంచి ట్విస్టు ఉంటుంది. ప్రతి మలుపును ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు" అని సుహాస్ స్పష్టం చేశాడు.

రైటర్ పద్మభూషమ్ సినిమా సుహాస్ హీరోగా నటించిన తొలి థియేటర్ రిలీజ్ సినిమా. ఈ సందర్భంగా ఒత్తిడిగా ఉందా అనే ప్రశ్నకు సుహాస్ బదులిస్తూ.. "సినిమా థియేటర్లలో విడుదల కావడం ఆనందంగా ఉంది. ఇదే సమయంలో ఒత్తిడిగానూ ఉంది. మౌత్ టాక్ ద్వారా జనాలు తప్పకుండా థియేటర్‌కు వస్తారనే నమ్మకముంది. 2 గంటల నిడివి కలిగిన ఈ సినిమాలో గంటా 40 నిమిషాల పాటు ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారు. చివరి 20 నిమిషాలు బాగా ఎమోషనల్ అవుతారు. మొత్తంగా ఇది నవ్విస్తూ ఏడిపించే సినిమా. ప్రేక్షకులకు మంచి అనుభూతిని మిగులుస్తుంది." అని సుహాస్ తెలిపాడు.

ఈ చిత్రంలో సుహాస్ సరసన టీనా శిల్పరాజ్ హీరోయిన్‌గా చేసింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ చిత్రానికి షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించాడు. విజయవాడ నేపథ్యంలో ఈ సినిమా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఆశిశ్ విద్యార్థి, రోహిణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్‌లో ఈ సినిమా రుపొందింది. ఫిబ్రవరి 3న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్