Stock market news today : ఫ్లాట్​గా దేశీయ సూచీలు.. నిఫ్టీకి 25 పాయింట్ల లాస్​-stock market news today 10th january 2023 sensex and nifty opens on a flat note ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Stock Market News Today 10th January 2023 Sensex And Nifty Opens On A Flat Note

Stock market news today : ఫ్లాట్​గా దేశీయ సూచీలు.. నిఫ్టీకి 25 పాయింట్ల లాస్​

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 10, 2023 09:17 AM IST

Stock market news today : ఇండియా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ట్రేడ్​ అవుతున్నాయి. అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగిశాయి. ఆసియా మార్కెట్​లు మిశ్రమంగా ఉన్నాయి.

ఇండియా స్టాక్​ మార్కెట్​
ఇండియా స్టాక్​ మార్కెట్​ (MINT_PRINT)

Stock market news today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ను ఫ్లాట్​గా ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 12 పాయింట్ల లాభంతో 60, 759 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 27 పాయింట్ల నష్టంతో 18,075 వద్ద ట్రేడ్​ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు

దేశీయ స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​ను భారీ లాభాలతో ముగించాయి. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిణామాలు ఇందుకు కారణం. బీఎస్​ఈ సెన్సెక్స్​ 847 పాయింట్లు పెరిగి 60,747 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 242 పాయింట్ల లాభంతో 18,101 వద్ద ముగిసింది. బీఎస్​ఈ మిడ్​క్యాప్​ సూచీ 0.93శాతం, స్మాల్​ క్యాప్​ సూచీ 0.56శాతం పెరిగాయి. ఇక మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ను సెన్సెక్స్​, నిఫ్టీలు వరుసగా 60805- 18121 వద్ద మొదలుపెట్టాయి.

పివోట్​ ఛార్ట్​ ప్రకారం నిఫ్టీ సపోర్ట్​ 17,981- 17,933- 17,854 వద్ద ఉంది. నిఫ్టీ రెసిస్టెన్స్​ 18,138- 18,186- 18,265 వద్ద ఉంది.

స్టాక్స్​ టు బై..

Stocks to buy today : మ్యాక్స్​ ఫినాన్షియల్​ సర్వీసెస్​ లిమిటెడ్​ (ఎంఎఫ్​ఎస్​ఎల్​):- బై రూ. 740, స్టాప్​ లాస్​ రూ. 720, టార్గెట్​ రూ. 775

పాలీక్యాబ్​:- బై రూ. 2653, స్టాప్​ లాస్​ రూ. 2620, టార్గెట్​ రూ. 2720

హెచ్​సీఎల్​ టెక్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 1040, టార్గెట్​ రూ. 1080- రూ. 1090

మహీంద్రా అండ్​ మహీంద్రా (ఎం అండ్​ ఎం):- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 1270, టార్గెట్​ రూ. 1350- రూ. 1370

పూర్తి లిస్ట్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

లాభాలు.. నష్టాలు..

టాటా మోటార్స్​, బజాజ్​ ఫిన్​సర్వ్​, ఎయిర్​టెల్​, యాక్సిస్​ బ్యాంక్​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

టీసీఎస్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ, సన్​ఫార్మా, హెచ్​యూఎల్​ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్​లు..

US Stock markets today : అమెరికా స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​ను ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.34శాతం నష్టపోగా.. ఎస్​ అండ్​ పీ 500 0.08శాతం పతనమైంది. నాస్​డాక్​ మాత్రం 0.63శాతం లాభపడింది.

ఆసియా మార్కెట్​లు మిశ్రమంగా ఉన్నాయి. జపాన్​ నిక్కీ 0.8శాతం లాభాల్లో ఉండగా.. ఎస్​ అండ్​ పీ 200 0.2శాతం నష్టాల్లో ఉంది.

త్రైమాసిక ఫలితాలు..

Q3 results today : అథర్వ్​ ఎంటర్​ప్రైజెస్​, ఎక్సెల్​ రియాల్టీ ఎన్​ ఇన్​ఫ్రా, గాలా గ్లోబల్​ ప్రాడక్ట్స్​, జీఐ ఇంజినీరింగ్​ సొల్యూషన్స్​, మార్సన్స్​, క్వెస్ట్​ క్యాపిటల్​ మార్కెట్స్​తో పాటు ఇతర సంస్థల క్యూ3 త్రైమాసిక ఫలితాలు ఈ రోజు వెలువడనున్నాయి.

TCS Q3 త్రైమాసిక ఫలితాల వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 203.13కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1723.79కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

WhatsApp channel

సంబంధిత కథనం