PM KISAN: రైతుల ఖాాతాల్లో పీఎం కిసాన్ 17వ విడత డబ్బులు పడే తేదీ ఇదే..
PM KISAN installment: దేశవ్యాప్తంగా రైతులకు సాగు సాయం అందించడానికి ఉద్దేశించిన పీఎం కిసాన్ పథకం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ పథకం కింద రైతులకు ఏటా రూ. 6 వేలను ఆర్థిక సాయంగా అందిస్తారు. ఇప్పుడు పీఎం కిసాన్ పథకం 17వ విడత ఆర్థిక సాయం డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి.
పీఎం కిసాన్ పథకం 16వ విడతను 2024 ఫిబ్రవరి 28న అర్హులైన రైతులందరికీ ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) విడుదల చేశారు. మొత్తం వాయిదా మొత్తం రూ.21,000 కోట్లకు పైగా విలువ చేసే ఈ మొత్తాన్ని 9 కోట్ల మంది లబ్ధిదారులైన రైతులకు అందించారు. ఈ పథకం (PM KISAN) దేశంలోని అన్ని రైతు కుటుంబాలకు సాగు కోసం మద్దతును అందిస్తుంది. ఈ పథకం ప్రకారం, అర్హులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ .2,000 వారి బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి. అంటే, మొత్తంగా సంవత్సరానికి రూ .6,000 వారికి లభిస్తాయి.
ఈ కేవైసీ తప్పనిసరి
పీఎం కిసాన్ వెబ్సైట్ ప్రకారం పీఎం కిసాన్ (PM KISAN) రిజిస్టర్డ్ రైతులకు ఈకేవైసీ తప్పనిసరి. పీఎం కిసాన్ పోర్టల్ లో ఓటీపీ ద్వారా ఈకేవైసీ అందుబాటులో ఉంది. లేదా బయోమెట్రిక్ బీఆర్ డీ ఈకేవైసీ కోసం సమీపంలోని సీఎస్ సీ సెంటర్లను సంప్రదించవచ్చు.
పీఎం కిసాన్ స్కీమ్: 17వ విడత ఎప్పుడు?
పీఎం కిసాన్ (PM KISAN installment) పథకానికి సంబంధించిన వాయిదాను ప్రతి ఏడాది ఏప్రిల్-జూలై, ఆగస్టు-నవంబర్, డిసెంబర్-మార్చిలో మూడు వాయిదాల చొప్పున ప్రతి నాలుగు నెలలకు ఒకసారి విడుదల చేస్తారు. పీఎం కిసాన్ 16వ విడత డబ్బులను ఫిబ్రవరిలో విడుదల అయ్యాయి. 17వ విడత నగదు మొత్తం మే నెలలో ఎప్పుడైనా విడుదలయ్యే అవకాశం ఉంది.
పీఎం కిసాన్ స్కీమ్ జాబితాలో మీ పేరును ఎలా చెక్ చేసుకోవాలి?
పీఎం కిసాన్ పథకం జాబితాలో మీ పేరును చెక్ చేసుకోవడం కోసం ఈ కింది స్టెప్స్ ను ఫాలో కావాలి. ముందుగా..
- పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ https://pmkisan.gov.in/ ను సందర్శించండి -
- లబ్ధిదారుల జాబితా ('Beneficiary list')' ట్యాబ్ పై క్లిక్ చేయండి.
- డ్రాప్ డౌన్ మెన్యూ నుంచి రాష్ట్రం, జిల్లా, బ్లాక్, మండలం, గ్రామం వంటి వివరాలను ఎంచుకోండి.
- లబ్ధిదారుల జాబితా వివరాలను చూడటానికి 'గెట్ రిపోర్ట్' ట్యాబ్ పై క్లిక్ చేయండి.
ఆన్లైన్లో పీఎం కిసాన్ స్కీమ్ ఈకేవైసీ అప్డేట్ చేయడం ఎలా?
- పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ https://pmkisan.gov.in/ కు వెళ్లి ఈకేవైసీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- ఆధార్ కార్డ్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత ఆధార్ కార్డుతో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
- 'గెట్ ఓటీపీ' పై క్లిక్ చేసి నిర్దేశిత ఫీల్డ్ లో ఓటీపీ ఎంటర్ చేయాలి.