Maruti Suzuki XL6 vs Kia Carens : మారుతీ ఎక్స్​ఎల్​6 వర్సెస్​ కియా క్యారెన్స్​.. ది బెస్ట్​ ఏది?-maruti suzuki xl6 vs kia carens check detailed comparison of these two 6 seater vehicles here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Maruti Suzuki Xl6 Vs Kia Carens Check Detailed Comparison Of These Two 6 Seater Vehicles Here

Maruti Suzuki XL6 vs Kia Carens : మారుతీ ఎక్స్​ఎల్​6 వర్సెస్​ కియా క్యారెన్స్​.. ది బెస్ట్​ ఏది?

Sharath Chitturi HT Telugu
Feb 06, 2023 01:23 PM IST

Maruti Suzuki XL6 vs Kia Carens : మారుతీ సుజుకీ ఎక్స్​ఎల్​6, కియా క్యారెన్స్​ ఎంపీవీలకు మార్కెట్​లో మంచి డిమాండ్​ ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ ఓసారి పోల్చి.. బెస్ట్​ ఏది? అన్నది తెలుసుకుందాము.

మారుతీ సుజుకీ ఎక్స్​ఎల్​6 వర్సెస్​ కియా క్యారెన్స్​.. ది బెస్ట్​ ఏది?
మారుతీ సుజుకీ ఎక్స్​ఎల్​6 వర్సెస్​ కియా క్యారెన్స్​.. ది బెస్ట్​ ఏది? (HT AUTO)

Maruti Suzuki XL6 vs Kia Carens : భారతీయులు.. ఎస్​యూవీలు, ఎంపీవీలపై మనసు పారేసుకుంటున్నారు! చిన్న కార్లతో పోల్చుకుంటే.. యుటిలిటీ వెహికిల్స్​కు డిమాండ్​ గతకొంత కాలంగా విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా ప్రిమియం సెగ్మెంట్​లోని మల్టీ పర్పస్​ వెహికిల్స్​కు ఇంకాస్త ఎక్కువే డిమాండ్​ కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఆటోమొబైల్​ సంస్థలు కస్టమర్లను ఆకర్షించేందుకు వివిధ మోడల్స్​తో ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సెగ్మెంట్​లోని మారుతీ సుజుకీ ఎక్స్​ఎల్​6, కియా క్యారెన్స్​ మధ్య విపరీతమైన పోటీ ఉంది. ఎంపీవీని కొనాలని భావిస్తున్న వారు.. ఈ రెండింటినీ తమ లిస్ట్​లో పెట్టుకోవాల్సిందే! మరి ఈ రెండింట్లో బెస్ట్​ ఏది? మారుతీ సుజుకీ ఎక్స్​ఎల్​6 ఆల్ఫా+ ఏటీ వర్సెస్​ కియా క్యారెన్స్​ లగ్జరీ+ మోడల్స్​ను పోల్చి చూసి తెలుసుకుందాము..

మారుతీ సుజుకీ ఎక్స్​ఎల్​6 వర్సెస్​ కియా క్యారెన్స్​- ఇంజిన్​​..ధర

Maruti Suzuki XL6 price : మారుతీ సుజుకీ ఎక్స్​ఎల్​6లో 1.5 లీటర్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 103హెచ్​పీ పవర్​ను జెనరేట్​ చేస్తుంది. ఇందులో 5 స్పీడ్​ మేన్యువల్​/ 6 స్పీడ్​ ఆటోమెటిక్​ గేర్​బాక్స్​ ఉంటుంది. ఈ ఎక్స్​ఎల్​6లో సీఎన్​జీ వేరియంట్​ కూడా ఉంది. ఇందులో మేన్యువల్​ గేర్​బాక్స్​ ఉంటుంది. మొత్తం మీద మారుతీ సుజుకీ ఎక్స్​ఎల్​6 ధర రూ. 11.29లక్షలు- రూ. 14.39లక్షల (ఎక్స్​షోరూం) మధ్యలో ఉంటుంది.

ఇక కియా క్యారెన్స్​లో 1.5లీటర్​ పెట్రోల్​ ఇంజిన్​, 1.4లీటర్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​, 1.5 లీటర్​ డీజిల్​ ఇంజిన్​ ఆప్షన్స్​ ఉన్నాయి. మొదటి ఇంజిన్​ 115హెచ్​పీ పవర్​ను జనరేట్​ చేస్తుంది. ఇందులో 6స్పీడ్​ మేన్యువల్​ గేర్​బాక్స్​ ఉంటుంది. ఇక రెండో ఇంజిన్​.. 140హెచ్​పీ పవర్​ను జనరేట్​ చేస్తుంది. ఇందులో 6 స్పీడ్​ మేన్యువల్​తో పాటు 7 స్పీడ్​ డీసీటీ గేర్​బాక్స్​ ఉంటుంది. 

Kia Carens on road price : ఇక డీజిల్​ ఇంజిన్​ 115హెచ్​పీ పవర్​ను జనరేట్​ చేస్తుంది. ఇందులో 6స్పీడ్​ మేన్యువల్​/ ఆటోమెటిక్​ ట్రాన్స్​మిషన్​ ఆప్షన్స్​ ఉన్నాయి. కియా క్యారెన్స్​ ఎక్స్​షోరూం ధర రూ. 9.99లక్షలు- రూ. 18లక్షల మధ్యలో ఉంటుంది.

మారుతీ సుజుకీ ఎక్స్​ఎల్​6 వర్సెస్​ కియా క్యారెన్స్​- ఫీచర్స్​

మారుతీ సుజుకీ ఎక్స్​ఎల్​6 ఆల్ఫా+ ఏటీ వేరియంట్​లో ఆటో ఎల్​ఈటీ హెడ్​ల్యాంప్స్​, ఆటోమెటిక్​ క్లైమేట్​ కంట్రోల్​, 360 డిగ్రీ రేర్​ వ్యూ కెమెరా, వెంటిలేటెడ్​ ఫ్రెంట్​ సీట్స్​, 7 ఇంచ్​ టచ్​స్క్రీన్​, 6 స్పీకర్స్​, 4 ఎయిర్​బ్యాగ్స్​, ఈఎస్​పీ వంటి ఫీచర్స్​ ఉన్నాయి.

Maruti Brezza vs Maruti Fronx : మారుతీ బ్రెజా వర్సెస్​ మారుతీ ఫ్రాంక్స్​.. ఏది కొంటే బెటర్​? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Kia Carens on road price in Hyderabad : ఇక కియా క్యారెన్స్​ లగ్జరీ+ వేరియంట్​లో ఆటో ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్స్​, ఆటోమెటిక్​ క్లైమేట్​ కంట్రోల్​, రేర్​ వ్యూ కెమెరా, వెంటిలేటెడ్​ ఫ్రెంట్​ సీట్స్​, వయర్​లెస్​ ఛార్జింగ్​, 10.25 ఇంచ్​ టచ్​స్క్రీన్​ , 8 స్పీకర్స్​, డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, సన్​రూఫ్​, ఎయిర్​ ప్యూరిఫయర్​, 6 ఎయిర్​బ్యాగ్స్​, ఈఎస్​పీ వంటి ఫీచర్స్​ వస్తున్నాయి.

మారుతీ సుజుకీ ఎక్స్​ఎల్​6 వర్సెస్​ కియా క్యారెన్స్​- మైలేజ్​..

Maruti Suzuki XL6 on road price : మారుతీ సుజుకీ ఎక్స్​ఎల్​6 ఆల్ఫా+ వేరియంట్​.. సిటీలో 9.20కేపీఎల్​ మైలేజ్​ని ఇస్తుంటే, హైవేలో 17.01కేపీఎల్​ మైలేజ్​ని ఇస్తోంది.

ఇక కియా క్యారెన్స్​ లగ్జరీ+ వేరియంట్​.. సిటీలో 8.90కేపీఎల్​, హైవేలో 15.76కేపీఎల్​ మైలేజ్​ని ఇస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం