Best automatic cars : రూ. 10లక్షల బడ్జెట్​లో.. ఆటోమెటిక్​ కారు కావాలా? ఇవి బెస్ట్​!-list of best automatic cars under 10 lakhs in india check out full details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  List Of Best Automatic Cars Under 10 Lakhs In India, Check Out Full Details Here

Best automatic cars : రూ. 10లక్షల బడ్జెట్​లో.. ఆటోమెటిక్​ కారు కావాలా? ఇవి బెస్ట్​!

Sharath Chitturi HT Telugu
Feb 24, 2023 08:15 PM IST

Top 10 automatic cars under 10 lakhs : కొత్తగా కారు తీసుకోవాలని చూస్తున్నారా? ఆటోమెటిక్​ మోడల్​ కోసం ప్లాన్​ చేస్తున్నారా? అయితే.. రూ. 10లక్షల బడ్జెట్​లో ది బెస్ట్​ మోడల్స్​ లిస్ట్​ను మీకోసం మేము తీసుకొచ్చాము. ఓ లుక్కేయండి..

రూ. 10లక్షలలోపు బడ్జెట్​లో.. ఆటోమెటిక్​ కార్లు కావాలా? ఇవి బెస్ట్​!
రూ. 10లక్షలలోపు బడ్జెట్​లో.. ఆటోమెటిక్​ కార్లు కావాలా? ఇవి బెస్ట్​!

Best automatic cars under 10 lakhs : ఇండియాలో ప్యాసింజర్​ సెగ్మెంట్​ వాహనాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటోమొబైల్​ మార్కెట్​గా అవతరించింది ఇండియా. అయితే.. ఇటీవలి కాలంలో ఆటోమెటిక్​ మోడల్స్​కు మంచి డిమాండ్​ పెరుగుతోంది. సిటీలో ట్రాఫిక్​ చూసి భయపడిపోతున్న కస్టమర్లు.. ఆటోమెటిక్​ కార్లే బెటర్​ అని ఫీల్​ అవుతున్నారు. ఈ నేపథ్యంలో.. రూ. 10లక్షల బడ్జెట్​లోపు మార్కెట్​లో అందుబాటులో ఉన్న కొన్ని మోడల్స్​ లిస్ట్​ను తెలుసుకుందాము..

రూ. 10లక్షల బడ్జెట్​లో ది బెస్ట్​ ఆటోమెటిక్​ కార్స్​..

మారుతీ సుజుకీ ఆల్టో కే10 :- చిన్న కార్ల సెగ్మెంట్​లో మంచి డిమాండ్​ ఉన్న మోడల్​ మారుతీ సుజుకీ ఆల్టో కే10. దీని ఆటోమెటిక్​ కార్ల ఎక్స్​షోరూం ధరలు రూ. 5.60లక్షలు- రూ. 5.89లక్షల మధ్యలో ఉన్నాయి.

Best automatic cars in India : మారుతీ ఎస్​-ప్రెస్సో :- మారుతీ ఎస్​-ప్రెస్సోకి కూడా ఇటీవలి కాలంలో డిమాండ్​ పెరిగింది. దీనీ ఆటోమెటిక్​ వేరియంట్​ ఎక్స్​షోరూ ధరలు రూ. 5.75లక్షల నుంచి ప్రారంభమవుతాయి.

రెనాల్ట్​ క్విడ్ ​:- రెనాల్ట్​కు బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​గా ఉంది క్విడ్​. దీని ఆటోమెటిక్​ గేర్​బాక్స్​ వేరియంట్​ ప్రారంభ ధర రూ. 6.13లక్షలు.

మారుతీ వాగన్​ఆర్ ​:- మారుతీ వాగన్​ఆర్​లో ఏజీఎస్​ ట్రాన్స్​మిషన్​ ఉంది. దీని ప్రారంభ ధర రూ. 6.53లక్షలు.

హ్యుందాయ్​ ఏఎంటీ :- హ్యుందాయ్​లో చిన్న హ్యాచ్​బ్యాక్​ మోడల్​ ఆటోమెటిక్​ వేరియంట్​ ధర రూ. 7.22లక్షల వద్ద ప్రారంభమవుతోంది.

Tata Punch on road price Hyderabad : టాటా పంచ్​ :- టాటా మోటార్స్​కు ఉన్న బెస్ట్​ సెల్లింగ్​ మోడల్స్​లో టాటా పంచ్​ ఒకటి. ఇందులో ఆటోమెటిక్​ వేరియంట్ల ధర రూ. 7.45లక్షల వద్ద ప్రారంభమవుతోంది.

మారుతీ డిజైర్​ :- రూ. 10లక్షల బడ్జెట్​లో లభిస్తున్న మరో మారుతీ సుజుకీ ఆటోమెటిక్​ మోడల్​ డిజైర్​. దీని ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 7.92లక్షలు

మారుతీ బలెనో :- మారుతీ బలెనోకు అప్డేటెడ్​ వర్షెన్​ గతేడాది మార్కెట్​లోకి వచ్చింది. ఇక ఇందులో ఆటోమెటిక్​ మోడల్స్​ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 7.96లక్షలు.

రెనాల్ట్​ ట్రైబర్​ :- ఆటోమెటిక్​ గేర్​బాక్స్​తో పాటు 7 సీటర్​ మోడల్​ను కొనాలనుకుంటున్న వారికి రెనాల్ట్​ ట్రైబర్​ మంచి ఆప్షన్​! దీని ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 8.12లక్షలుగా ఉంది.

Maruti Swift on road price Hyderabad : మారుతీ స్విఫ్ట్​ :- మారుతీ స్విఫ్ట్​లోని ఆటోమెటిక్​ మోడల్స్​కి సైతం మంచి డిమాండ్​ కనిపిస్తోంది. దీని ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 8.11లక్షలు

WhatsApp channel

సంబంధిత కథనం