IPL cheerleaders salary : ఐపీఎల్లో ఛీర్లీడర్ల జీతం ఎంతో తెలుసా?
IPL 2023 cheerleaders salary : ఐపీఎల్లో జట్లతో పాటు అభిమానులను అలరించే ఛీర్లీడర్లకు ఎంత జీతం వస్తుందో తెలుసా? ఒక్క మ్యాచ్‌కు.. ఛీర్లీడర్లు ఎంత అందుకుంటారంటే…
IPL 2023 cheerleaders salary : ఒకప్పుడు కొన్ని క్రీడలకే పరితమైన ఛీర్లీడర్స్కు టీ20 క్రికెట్ కలిసొచ్చింది! ముఖ్యంగా.. ఐపీఎల్ వంటి లీగ్స్‌లో వీరికి డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. ఇక 16వ ఎడిషన్ ఐపీఎల్ 2023లో ఛీర్లిడర్ల సందడి అంతా ఇంతా కాదు. ఆయా జట్లతో పాటు అభిమానులకు కూడా ఫుల్ జోష్ ఇస్తున్నారు ఛీర్లీడర్లు. అంతా బాగుంది కానీ.. ఈ ఛీర్లీడర్ల జీతం ఎంత? అని మీకు ఎప్పుడైనా సందేహం వచ్చిందా? అయితే.. మీకు ఇక్కడ సమాధానం దొరికినట్టు!
ట్రెండింగ్ వార్తలు
ఐపీఎల్ 2023లో ఛీర్లీడర్లు..
రెండేళ్ల కొవిడ్ బ్రేక్ తర్వాత.. ఐపీఎల్ 2023లో ఛీర్లీడర్లు అడుగుపెట్టారు. వీరిలో చాలా మంది విదేశీయులే ఉన్నాయి. దేశీయ ఛీర్లీడర్లు చాలా తక్కువగా కనిపిస్తున్నారు. అయితే.. ఐపీఎల్ ఛీర్లీడర్లు.. ఒక్కో మ్యాచ్‌కు సుమారు రూ. 14వేల నుంచి రూ. 17వేల వరకు జీతం తీసుకుంటారు. ఈ విషయాన్ని ప్రముఖ మీడియా సంస్థ డీఎన్ఏ.. తన నివేదికలో వెల్లడించింది.
cheerleaders salary in IPL : మీడియా సంస్థ నివేదిక ప్రకారం.. సీఎస్కే, పంజాబ్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ వంటి జట్లు తమ ఛీర్లీడర్లకు.. ఒక్క మ్యాచ్ కోసం రూ. 12000 ఇస్తాయి. ఇక ముంబై, ఆర్సీబీ వంటి టీమ్‌లు రూ. 20వేల వరకు చెల్లిస్తున్నాయి. షారుఖ్ ఖాన్‌కు చెందిన కేకేఆర్.. ఛీర్లీడర్స్కు అత్యధిక జీతాలు ఇస్తోంది. ఈ జట్టు.. మ్యాచ్‌కు రూ. 24వేల వరకు డబ్బులు ఇస్తోంది.
అంత ఈజీ కాదు..!
అవన్నీ ఛీర్లీడర్ల 'ఫిక్స్డ్ పే'. వీటితో పాటు వారి ప్రదర్శన ఆధారంగా బోనస్‌లు ఉంటాయి. అంతేకాకుండా.. సంబంధిత జట్టు విజయం సాధించినా బోనస్‌లు లభిస్తుంటాయి. వీటికి అధనంగా.. లగ్జరీ అకామడేషన్, ఫుడ్ వంటి బెనిఫిట్లు కూడా ఛీర్లీడర్లకు దక్కుతుంది.
cheerleaders payment per match in IPL : అయితే.. ఐపీఎల్లో ఛీర్‌లీడర్ అవ్వడం అంత ఈజీ కాదు! ఇందుకోసం ఓ పెద్ద సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఇంటర్వ్యూలు, ఈవాల్యుయేషన్లు ఉంటాయి. ఐపీఎల్లో పాల్గొనాలంటే.. ఛీర్లీడర్లకు డ్యాన్సింగ్, మోడలింగ్, భారీ జనాభా ముందు ప్రదర్శన చేసిన అనుభవం వంటివి ఉండాలి. ఇవన్నీ దాటుకుని వెళితేనే.. ఐపీఎల్లో ఛీర్‌లీడర్‌గా అవ్వొచ్చు!
IPL 2023 points table : ఇక పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ గెలిచి.. నాలుగు పాయింట్లు వెనకేసుకుంది. పంజాబ్ కింగ్స్ కూడా.. ఆడిన రెండు మ్యాచ్‌లలో గెలిచింది. కానీ తక్కువ రన్‌రేట్ కారణంగా రెండో స్థానంలో నిలిచింది. సీఎస్కే 6వ స్థానంలో ఉండగా.. ఆర్సీబీ 7వ స్థానానికి పడిపోయింది. ముంబై ఇండియన్స్ 9వ స్థానంలో కొనసాగుతోంది.
సంబంధిత కథనం