Discounts on Tata cars in January : ఈ టాటా వాహనాలపై భారీ డిస్కౌంట్లు..!-huge discounts on these tata motors vehicles in janury 2023 check full details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Huge Discounts On These Tata Motors Vehicles In Janury 2023 Check Full Details Here

Discounts on Tata cars in January : ఈ టాటా వాహనాలపై భారీ డిస్కౌంట్లు..!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 10, 2023 10:30 AM IST

Discounts on Tata cars in January : పలు మోడల్స్​పై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది దిగ్గజ ఆటో సంస్థ టాటా మోటార్స్​. ఈ నెలలో మాత్రమే ఈ డిస్కౌంట్లు ఉంటాయి. పూర్తి వివరాలు మీకోసం..

 ఈ టాటా వాహనాలపై భారీ డిస్కౌంట్లు..
ఈ టాటా వాహనాలపై భారీ డిస్కౌంట్లు.. (PTI)

Offers on Tata cars in January : ఈ జనవరిలో ఆటో పరిశ్రమ నుంచి అప్డేట్స్​ వెల్లువెత్తుతున్నాయి. కొని ఆటో సంస్థలు.. వాహనాల ధరలను భారీగా పెంచుతుంటే.. ఇంకొన్ని మాత్రం డిస్కౌంట్ల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా.. దేశీయ దిగ్గజ ఆటో సంస్థ టాటా మోటార్స్​.. పలు మోడల్స్​పై డిస్కౌంట్లను ప్రకటించింది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ట్రెండింగ్ వార్తలు

టాటా టియాగో..

Tata Tiago on road price in Hyderabad : టాటా టియాగో ఎంవై23 (మేన్యుఫ్యాక్చరింగ్​ ఇయర్​ 2023) మోడల్స్​పై క్యాష్​ బోనస్​ కింద్​ రూ. 10వేల వరకు డిస్కౌంట్​ లభిస్తోంది. ఇక ఎక్స్​ఛేంజ్​ బోనస్​ కింద రూ. 10వేలు ఇస్తోంది టాటా మోటార్స్​. అదే సమయంలో కార్పొరేట్​ డిస్కౌంట్​ కింద రూ. 5వేలు ఇవ్వడంతో.. మొత్తం మీద టాటా టియాగోపై రూ. 25వేల వరకు ఆఫర్లు ఉన్నాయి.

ఇక ఎంవై22 మోడల్స్​పై రూ. 30వేల వరకు క్యాష్​ డిస్కౌంట్​ ఇస్తోంది టాటా మోటార్స్​. ఎక్స్​ఛేంజ్​ బోనస్​ కింద రూ. 10వేలు, కార్పొరేట్​ డిస్కౌంట్​ కింద రూ. 5వేలు కలుపుకుని మొత్తం మీద.. టాటా టియాగో ఎంవై22 మోడల్​పై రూ. 45వేల వరకు ఆఫర్లు లభిస్తున్నాయి.

ఎంవై23 టాటా టియాగో సీఎన్​జీ వేరియంట్​పై రూ. 5వేల కార్పొరేట్​ డిస్కౌంట్​ లభిస్తోంది. మార్కెట్​లో టాటా టియాగో ధర రూ. 5.45లక్షలు- రూ. 7.90లక్షల మధ్యలో ఉంది.

టాటా టిగోర్​..

Offers on Tata Tigor : టాటా టిగోర్​ ఎంవై23 మోడల్స్​పై క్యాష్​ డిస్కౌంట్​ కింద రూ. 10వేలు, ఎక్స్​ఛేంజ్​ బోనస్​ కింద రూ. 10వేలు, కార్పొరేట్​ డిస్కౌంట్​ కింద రూ. 5వేల తగ్గింపు ఇస్తోంది ఈ ఆటో సంస్థ. ఫలితంగా.. టిగోర్​పై రూ. 25వేల వరకు ఆఫర్లు ఉన్నాయి.

ఇక ఎంవై22 టాటా టిగోర్​ మోడల్స్​పై రూ. 25వేల క్యాష్​ డిస్కౌంట్​, రూ. 20వేల ఎక్స్​ఛేంజ్​ బోనస్​, రూ. 5వేల కార్పొరేట్​ డిస్కౌంట్ లభిస్తోంది. మొత్తం మీద ఈ మోడల్​పై రూ. 50వేల వరకు డిస్కౌంట్లు ఉన్నాయి.

మార్కెట్​లో టాటా టిగోర్​ ధర రూ. 6.10లక్షలు- రూ. 8.84లక్షల మధ్యలో ఉంది.

టాటా ఆల్ట్రోజ్​..

Tata Altroz price in Hyderabad : టాటా మోటార్స్​ నుంచి మోస్ట్​ సెల్లింగ్​ వెహికిల్​గా గుర్తింపు లభించిన ఆల్ట్రోజ్​ ఎంవై23 మోడల్​పై రూ. 10వేల క్యాష్​ డిస్కౌంట్​ లభిస్తోంది. ఎక్స్​ఛేంజ్​ బోనస్​ కింద రూ. 10వేలు, కార్పొరేట్​ బోనస్​ కింద రూ. 3వేలు తగ్గుతోంది. ఫలితంగా ఈ మోడల్​పై రూ. 23వేల వరకు డిస్కౌంట్లు వస్తున్నాయి.

ఇక టాటా ఆల్ట్రోజ్​ ఎంవై22 మోడల్​పై రూ. 25వేల క్యాష్​ డిస్కౌంట్​, రూ. 10వేల ఎక్స్​ఛేంజ్​ బోనస్​, రూ. 3వేల కార్పొరేట్​ డిస్కౌంట్​ లభిస్తోంది. అంటే.. మొత్తం మీద రూ. 38వేల వరకు ఆఫర్లు ఉన్నట్టు.

మార్కెట్​లో టాటా ఆల్ట్రోజ్​ ధర రూ. 6.35లక్షలు- రూ. 10.25లక్షల మధ్యలో ఉంది.

టాటా హ్యారియర్​..

Tata Harrier offers in January : టాటా హారియర్​ ఎంవై23 మోడల్​పై రూ. 10వేల క్యాష్​ డిస్కౌంట్​, రూ .25వేల ఎక్స్​ఛేంజ్​ బోనస్​, రూ. 10వేల కార్పొరేట్​ బోనస్​ లభిస్తోంది. అంటే.. మొత్తం మీద రూ. 45వేల వరకు డిస్కౌంట్లు లభిస్తున్నట్టు.

ఇక టాటా హారియర్​ ఎంవై22 మోడల్​పై రూ. 25వేల క్యాష్​ డిస్కౌంట్​, రూ. 40వేల ఎక్స్​ఛేంజ్​ బోనస్​, రూ. 10వేల కార్పొరేట్​ డిస్కౌంట్​ వస్తోంది. అంటే.. ఈ మోడల్​పై ఏకంగా రూ. 75వేల వరకు ఆఫర్లు లభిస్తున్నట్టు అర్థం.

మార్కెట్​లో.. టాటా హారియర్​ ఎస్​యూవీ ధర రూ. 14.80లక్షలు- రూ. 22.35లక్షల మధ్యలో ఉంది.

సఫారీ..

Tata Safari on road price in Hyderabad : స్టైలిష్​ టాటా సఫారీ ఎంవై23 మోడల్​పై క్యాష్​ బోనస్​ కింద రూ. 10వేలు, ఎక్స్​ఛేంజ్​ బోనస్​ కింద రూ. 25వేలు, కార్పొరేట్​ బోనస్​ కింద రూ. 10వేల వరకు ఆఫర్లు ఉన్నాయి. మొత్తం మీద ఈ మోడల్​పై రూ. 45వేల వరకు డిస్కౌంట్లు లభిస్తున్నాయి.

ఇక టాటా సఫారీ ఎంవై22 మోడల్​పై రూ. 25వేల క్యాష్​ డిస్కౌంట్​, రూ. 40వేల ఎక్స్​ఛేంజ్​ బోనస్​, రూ. 10వేల కార్పొరేట్​ డిస్కౌంట్​ వస్తోంది. అంటే.. రూ. 75వేల వరకు ఆఫర్లు ఉన్నాయి.

టాటా నెక్సాన్​..

Offers on Tata Nexon in January 2023 : టాటా మోటార్స్​ నుంచి అత్యంత డిమాండ్​ ఉన్న నెక్సాన్​ మోడల్​పై క్యాష్​ డిస్కౌంట్​, ఎక్స్​ఛేంజ్​ బోనస్​లు లేవు. ఎంవై2023 మోడల్స్​పై రూ. 3వేల కార్పొరేట్​ డిస్కౌంట్​ను ఇస్తోంది టాటా మోటార్స్​. మార్కెట్​లో టాటా నెక్సాన్​ ధర రూ. 7.70లక్షలు- రూ. 14.18లక్షల మధ్యలో ఉంది.

* పైన చెప్పిన వాహనాల ధరలు.. ఎక్స్​షోరూం ప్రైజ్​లు.

* ఈ ఆఫర్లు, డిస్కౌంట్లు.. లొకేషన్​, వేరియంట్​ బట్టి మారుతూ ఉంటాయి. పూర్తి వివరాల కోసం సమీపంలోని టాటా మోటార్స్​ డీలర్​షిప్​ షోరూంను సంప్రదించాల్సి ఉంటుంది.

* ఎంవై2022 మోడల్స్​ను 2023లో కొన్నప్పటికీ.. వాటి రీసేల్​ వాల్యూ ఎంవై23 యూనిట్ల కన్నా తక్కువగా ఉంటుంది.

WhatsApp channel