Tata Safari XMS launched: రెండు కొత్త వేరియంట్లతో టాటా సఫారీ.. ధర ఎంతంటే!-tata safari xms xmas launched see all details ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Tata Safari Xms, Xmas Launched: See All Details

Tata Safari XMS launched: రెండు కొత్త వేరియంట్లతో టాటా సఫారీ.. ధర ఎంతంటే!

Sharath Chitturi HT Telugu
Sep 26, 2022 08:10 PM IST

Tata Safari new variants : రెండు కొత్త వేరియంట్లను భారత విపణిలోకి లాంచ్​ చేసింది టాటా సఫారీ. వాటికి టాటా సఫారీ ఎక్స్​ఎంఎస్​, టాటా సఫారీ ఎక్స్​ఎంఏఎస్​ అని పేర్లు పెట్టింది. వాటి ధరతో పాటు మరిన్ని వివరాల కోసం ఇక్కడ చూడండి.

కొత్త వేరియంట్లతో మార్కెట్​లోకి టాటా సఫారీ
కొత్త వేరియంట్లతో మార్కెట్​లోకి టాటా సఫారీ (Tata Motors)

Tata Safari new variants : టాటా సఫారీ నుంచి రెండు కొత్త వేరియంట్లు మార్కెట్​లోకి లాంచ్​ అయ్యాయి. అవే.. టాటా సఫారీ ఎక్స్​ఎంఎస్​, టాటా సఫారీ ఎక్స్​ఎంఏఎస్​. ఈ వేరియంట్ల ఎక్స్​షోరూం ధరలు రూ. 17.96లక్షలు, రూ. 19.26లక్షలుగా ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Tata Safari XMS launched : టాటా సఫారీలో ఇప్పటికే ఎక్స్​ఎం, ఎక్స్​టీ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక ఎక్స్​ఎంతో పోల్చుకుంటే.. టాటా సఫారీ ఎక్స్​ఎంఎస్​, ఎక్స్​ఎంఏఎస్​లలో పానారోమిక్​ సన్​రూఫ్​, డ్రైవ్​ మోడ్స్​(ఎకో, సిటీ, స్పోర్ట్​), 7ఇంచ్​ టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టమ్​, 4 స్పీకర్లు, 4 ట్వీటర్లు, స్టీరింగ్​ మౌంటెడ్​ కంట్రోలస్​, రివర్స్​ పార్కింగ్​ కెమెరా, రెయిన్​ సెన్సింగ్​ వైపర్స్​, హైట్​ ఎడ్జస్టబుల్​ డ్రైవర్​ సీట్​, ఆటో హెడ్​ల్యాంప్స్​, ఎలక్ట్రికల్లీ ఫొల్డెబుల్​ ఓఆర్​వీఎంఎస్​లు.. అదనపు ఫీచర్లుగా లభించడం విశేషం.

టాటా సఫారీ కొత్త వేరియంట్లకు 2.0లీటర్​ క్రయోటెక్​ డీజిల్​ ఇంజిన్​ ఇచ్చారు. ఇది 168ఎన్​హెచ్​పీ, 350ఎన్​ఎం టార్క్​ను జెనరేట్​ చేస్తుంది. ఇందులో 6స్పీడ్​ మ్యాన్యువల్​, ఆటోమెటిక్​ ట్రాన్స్​మిషన్లు ఉన్నాయి.

"కొత్త సఫారీ.. ప్రెస్టేజ్​, ఔట్​స్టాండింగ్​ పర్ఫార్మెన్స్​తో కూడుకున్నది. టాటా మోటార్స్​ ఇంపాక్ట్​ 2.0 డిజైన్​, ఓఎంఈజీఏఏఆర్​సీ కలయికతో దీనిని రూపొందించాము," అని టాటా మోటార్స్​ అధికారిక వెబ్​సైట్​లో ఉంది.

Tata Sfari XMAS launched : ఇక ఈ నెల మొదట్లో.. టాటా హ్యారియర్​ ఎక్స్​ఎంఎస్​ వేరియంట్​ను తీసుకొచ్చారు. దీని ఎక్స్​షోరూం ధర రూ. 17.20లక్షలుగా ఉంది. ఇందులో 2.0లీటర్​ టర్బోఛార్జ్​డ్​ డీజిల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 170హెచ్​పీ, 350ఎన్​ఎం టార్క్​ను జెనరేట్​ చేస్తుంది. ఇందులో పానారోమిక్​ సన్​రూఫ్​ ఉంటుంది. గతంలో ఎక్స్​టీ+, ఎక్స్​టీఏ+, ఎక్స్​జెడ్​, ఎక్స్​జెడ్​ఏ+, ఎక్స్​జెడ్​ఏఎస్​ వేరియంట్లకు మాత్రమే సన్​రూఫ్​ అందుబాటులో ఉండేది.

టాటా టియాగో ఈవీ..

Tata Tiago EV version : ఈవీ సెగ్మెంట్​లో దేశంలోనే అత్యధిక వాటా కలిగిన టాటా మోటార్స్​.. తన స్థానాన్ని మరింత బలపరుచుకునే విధంగా పక్కా ప్రణాళికలు రచించింది! ఇందులో భాగంగానే ఈ సెప్టెంబరు 28న అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కార్ టాటా టియాగో ఈవీని ఆవిష్కరించనుంది. టాటా మోటార్స్ నుంచి ప్రాచుర్యం పొందిన టియాగో కారుకు ఇది ఎలక్ట్రిక్ వెర్షన్. టాటా మోటార్స్ నుంచి రానున్న మూడో ఎలక్ట్రిక్ కారు ఇది. ఎస్‌యూవీ, సెడాన్లలో ఇప్పటికే ఈవీ వచ్చినప్పటికీ హాచ్‌బ్యాక్ కార్లలో ఎలక్ట్రిక్ కారు రావడం ఇదే తొలిసారి.

టాటా టియాగో ఈవీ వెహికిల్​కి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

IPL_Entry_Point

సంబంధిత కథనం