Tata Altroz sport : టాటా ఆల్ట్రోజ్​ నుంచి కొత్త వేరియంట్​.. 'స్పోర్ట్​' వస్తోంది!-tata altroz sport variant likely to be displayed in auto export 2023 see full detail here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Altroz Sport : టాటా ఆల్ట్రోజ్​ నుంచి కొత్త వేరియంట్​.. 'స్పోర్ట్​' వస్తోంది!

Tata Altroz sport : టాటా ఆల్ట్రోజ్​ నుంచి కొత్త వేరియంట్​.. 'స్పోర్ట్​' వస్తోంది!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 07, 2023 01:45 PM IST

Tata Altroz sport variant : టాటా ఆల్ట్రోజ్​ స్పోర్ట్​ వేరియంట్​ను ఆటో ఎక్స్​పోలో ప్రదర్శించనున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాలు..

టాటా ఆల్ట్రోజ్​
టాటా ఆల్ట్రోజ్​

Tata Altroz sport variant : త్వరలో ప్రారంభంకానున్న 2023 ఆటో ఎక్స్​పోపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఆటో సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టాటా మోటార్స్​కు సంబంధించిన ఓ వార్త బయటకొచ్చింది. టాటా ఆల్ట్రోజ్​ నుంచి కొత్త వేరియంట్​ రాబోతోందని.. దాన్ని ఈ ఏడాది ఆటో ఎక్స్​పోలో ప్రదర్శించనున్నారని సమాచారం.

టాటా ఆల్ట్రోజ్​ స్పోర్ట్​..

సంబంధిత వర్గాల ప్రకారం.. ఈ టాటా ఆల్ట్రోజ్​ స్పోర్ట్​ వేరియంట్​లో 1.2 లీటర్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​ ఉండొచ్చు. నెక్సాన్​లో కూడా ఇదే ఇంజిన్​ను వినియోగిస్తున్నారు. ఇందులో 6 స్పీడ్​ మేన్యువల్​ ట్రాన్స్​మిషన్​ సెటప్​ ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్​లో ఉన్న 1.2 లీటర్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​.. 110పీఎస్​ పవర్​ను ,140ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తోంది. 5స్పీడ్​ మేన్యువల్​ గేర్​బాక్స్​ ఇందులో ఉంటుంది. ఈ ప్రీమియం హ్యాచ్​బ్యాక్​ మోడల్​కు సంబంధించిన పర్ఫార్మెన్స్​లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు.

2023 Auto Expo Tata Motors : ఇక టాటా ఆల్ట్రోజ్​ సాధారణ వేరియంట్​తో పోల్చుకుంటే.. ఆల్ట్రోజ్​ స్పోర్ట్​లో ఫీచర్స్​ కొన్ని మారే అవకాశం ఉంది. బంపర్​, బ్యాడ్జీలు, ఆలోయ్​ వీల్స్​, బాడీ డీకెల్స్​లో మార్పులు కనిపించవచ్చు. ఇక క్యాబిన్​ కూడా అప్డేట్​ అవ్వొచ్చు. మరింత స్పోర్టీ, స్టైలిష్​ లుక్​ వచ్చే అవకాశం ఉంది.

ఇక ఈ పవర్​ఫుల్​ టర్బో ఇంజిన్​తో ఈ టాటా స్పోర్ట్​ వేరియంట్​.. హ్యుందాయ్​ ఐ20 ఎన్​ లైన్​కు గట్టి పోటీనిస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

2023 ఆటో ఎక్స్​పో​లో పదర్శనకు ఉంచితే.. రానున్న రోజుల్లో టాటా స్పోర్ట్​ వేరియంట్​పై మరింత సమాచారం అందుబాటులోకి రావొచ్చు.

కియా సొరెంటో ఎస్​యూవీ..

Kia Sorento SUV : కియా మోటార్స్​ నుంచి 7 సీటర్​ సొరెంటో కూడా ఈ ఆటో ఎక్స్​పోలో ప్రదర్శనకు రానున్నట్టు తెలుస్తోంది.

సొరెంటో ఎస్​యూవీ ఫోర్త్​ జనరేషన్​ను అంతర్జాతీయ మార్కెట్​లో 2020లోనే లాంచ్​ చేసింది కియా. కాగా.. ఇండియాలో ఇప్పటివరకు ఇది లాంచ్​ అవ్వలేదు. ఎప్పుడు లాంచ్​ అవుతుందనే విషయంపై స్పష్టత లేదు. అయితే.. త్వరలో జరగనున్న ఆటో ఎక్స్​పోలో దీనిని ప్రదర్శించి, కస్టమర్ల నుంచి వస్తున్న స్పందనను తెలుసుకోవాలని భావిస్తోంది. ఇక్కడ హిట్​ అయితే.. మరి కియా సొరెంటో ఎస్​యూవీని ఇండియా రోడ్లపై చూసే అవకాశం లేకపోలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

WhatsApp channel

సంబంధిత కథనం