Bank strike : సమ్మె బాటలో బ్యాంకు ఉద్యోగులు.. కస్టమర్లకు తీవ్ర ఇబ్బందులు!-bank strike next week know main reason dates and other details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Bank Strike Next Week Know Main Reason, Dates And Other Details Here

Bank strike : సమ్మె బాటలో బ్యాంకు ఉద్యోగులు.. కస్టమర్లకు తీవ్ర ఇబ్బందులు!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 27, 2023 07:29 AM IST

Bank strike in January 2023 : దేశంలోని బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 30-31 తేదీల్లో రెండు రోజుల పాటు సమ్మె ఉండనుంది.

సమ్మెకు బ్యాంక్​ ఉద్యోగులు సిద్ధం..
సమ్మెకు బ్యాంక్​ ఉద్యోగులు సిద్ధం.. (PTI)

Bank strike in January 2023 : వివిధ డిమాండ్​లను లేవనెత్తుతూ.. దేశవ్యాప్తంగా బ్యాంకు​ ఉద్యోగులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు.. జనవరి 30 నుంచి రెండు రోజుల పాటు బ్యాంక్​ స్ట్రైక్​ చేస్తున్నట్టు యూఎఫ్​బీయూ (యూనైటెడ్​ ఫోరం ఆఫ్​ బ్యాంక్​ యూనియన్స్​) ప్రకటించింది.

బ్యాంకు​ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో.. ఈ నెల 30-31 తేదీల్లో తమ బ్యాంకింగ్​ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని దేశీయ దిగ్గజం ఎస్​బీఐ ఇప్పటికే ఓ ప్రకటన విడుదల చేసింది.

Bank strike news : "యూఎఫ్​బీయూలు సమ్మె చేస్తున్నట్టు మాకు తెలిసింది. యూఎఫ్​బీయూతో పాటు ఏఐబీఈఏ, ఏఐబీఓసీ, ఎన్​సీబీఈ, ఏఐబీఓఏ, బీఈఎఫ్​ఐ, ఐఎన్​బీఈఎఫ్​, ఐఎన్​బీఓసీ యూనియన్​లు.. జనవరి 30- 31న ఈ సమ్మెకు వెళ్లనున్నాయి. కస్టమర్లు ఈ విషయాన్ని గుర్తించాలి," అని ఎస్​బీఐ పేర్కొంది.

బ్యాంకింగ్​ సేవలకు తీవ్ర అంతరాయం తప్పదా..!

బ్యాంక్​ సమ్మె నేపథ్యంలో బ్యాంకింగ్​ సేవలకు అంతరాయం కలగకుండా ఇప్పటికే చర్యలు తీసుకున్నట్టు ఎస్​బీఐ పేర్కొంది. అయితే.. అప్పటి పరిస్థితుల బట్టి.. బ్యాంక్​లో కార్యకలాపాలు దెబ్బ తినే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

Bank strike on Jan 30 : ఈ  నెల 30న జరగనున్న సమ్మె ప్రభావం.. బ్యాంక్​పై ఎంత ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేమని ఎస్​బీఐ వివరించింది.

రెండు రోజుల సమ్మె..

"ఇండియన్​ బ్యాంక్స్​ అసోసియేషన్​ (ఐబీఏ)తో ముంబైలో ఓ సమావేశంలో జరిగింది. అందులో మా డిమాండ్​ల పరిష్కారానికి ఎలాంటి సూచనలు కనిపించలేదు. ఎప్పటినుంచో ఈ డిమాండ్​లను పరిష్కరించడం లేదు. మేము మా సహనాన్ని కోల్పోతున్నాము. అందుకే జనవరి 30- 31న దేశవ్యాప్తంగా బ్యాంక్​ సమ్మె చేపట్టనున్నాము," అని యూఎఫ్​బీయూ వెల్లడించింది.

సమ్మె ఎందుకు చేస్తున్నారు?

Bank Strike in India : పీటీఐ నివేదిక ప్రకారం.. 5 రోజుల బ్యాంకింగ్​ కార్యకలాపాలు, పెన్షన్​- రిక్రూట్​మెంట్​లో అప్డేట్​తో పాటు మరిన్ని కీలక విషయాలపై గత కొన్నేళ్లుగా యూనియన్లు డిమాండ్​ చేస్తున్నాయి. కానీ వాటిపై అధికారులు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అందుకే బ్యాంకు​ సెమ్మె చేపట్టనున్నాయి.

దేశంలోని ఏఏ బ్యాంకులపై ఈ ప్రభావం పడనుంది? ఎంత మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొననున్నారు? కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వనున్నాయి? వంటి ప్రశ్నలకు రానున్న రోజుల్లో సమాధానం లభించే అవకాశం ఉంది. ఏది ఏమైనా.. కస్టమర్లు.. బ్యాంక్​ సమ్మె తేదీలను దృష్టిలో పెట్టుకుని.. ముందే తమ పనులను పూర్తి చేసుకోవడం ఉత్తమం. లేకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.

WhatsApp channel

సంబంధిత కథనం