Australia Phone banking scam : స్కామర్లు, హ్యాకర్లు.. ఆన్లైన్ మోసాలతో రెచ్చిపోతున్నారు. ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా.. ఆస్ట్రేలియాకు చెందిన ఓ యువతి.. జీవితం మొత్తం కూడబెట్టుకున్న డబ్బులను.. ఫోన్ బ్యాంకింగ్ స్కామ్‌తో పోగొట్టుకుంది! అసలేం జరిగిందంటే..
18ఏళ్ల ఆరోరా కాసిల్లి.. వెస్టర్న్ ఆస్ట్రేలియాలోని ఆల్బానీలో జీవిస్తోంది. ఆమెకు నేషనల్ ఆస్ట్రేలియా బ్యాంక్‌లో అకౌంట్ ఉంది. కాగా గతేడాది డిసెంబర్ 3న ఆమె ఫోన్‌కు ఓ మెసేజ్ వచ్చింది. 'మీ అకౌంట్ నుంచి ఎవరో డబ్బులను ట్రాన్స్ఫర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు,' అని రాసి ఉంది. నేషనల్ ఆస్ట్రేలియా బ్యాంక్ నుంచి ఆ మెసేజ్ వచ్చినట్టు ఉంది. ఆరోరా టెన్షన్ పడింది. గతంలో తాను చేసిన లావాదేవీలకు ఏ నెంబర్ నుంచి మెసేజ్ వచ్చిందో.. ఇప్పుడు కూడా అదే నెంబర్ నుంచి మెసేజ్ రావడంతో.. ఇది నిజమేనని పూర్తిగా నమ్మేసింది. 'పూర్తి వివరాల కోసం మా నంబర్‌కు కాల్ చేయండి,' అని ఆ మెసేజ్‌లో రాసి ఉంది. అది చూసిన ఆరోరా.. ఆ నెంబర్‌కు వెంటనే కాల్ చేసింది.
Online scams in Australia : అవతలి వ్యక్తి నుంచి అరోరాకు స్పందన లభించింది. తనకు వచ్చిన మెసేజ్ గురించి ఆ వ్యక్తితో అరోరా మాట్లాడింది. సంబంధిత సేవలకు లింక్ చేస్తానని ఆ వ్యక్తి చెప్పారు. చాలా సేపటి వరకు లైన్లోనే ఉండిపోయింది ఆరోరా. సాధారణంగా.. కస్టమర్ కేర్‌కు కాల్ చేస్తే.. వాళ్లు కూడా వెయిట్ చేయిస్తారు కాబట్టి.. ఆరోరాకు ఎలాంటి డౌట్ రాలేదు.
చివరికి.. స్కామర్లు ఆరోరాతో మాట్లాడారు. నేషనల్ ఆస్ట్రేలియా బ్యాంక్ అకౌంట్లోని డబ్బులను వేరే ఖాతాకు మార్చకోపోతే.. మొత్తం పోతాయని ఆరోరాను హెచ్చరించారు. వేరే అకౌంట్లోకి డబ్బులు మార్చాలని సూచించారు. ఈ క్రమంలో.. ఆ ఆకౌంట్లో ఉన్న దాదాపు 3700 ఆస్ట్రేలియన్ డాలర్లను (సుమారు రూ. 21లక్షలు) వేరే అకౌంట్‌కు మార్చేందుకు ప్రయత్నించింది అరోరా. ఇక్కడే యాక్టివ్ అయిన స్కామర్లు.. ఆరోరా డబ్బులను దోచుకున్నారు.
Bank phone scams Australia : తాను మోసపోయానన్న విషయం కొంతసేపటికే ఆరోరాకు తెలిసింది. తాను పంపించిన ఖాతాలోకి డబ్బులు పడకపోవడంతో స్కామ్‌కు గురైనట్టు అర్థం చేసుకుంది. జరిగినది.. బ్యాంక్ అధికారులతో పంచుకుంది. ట్రాన్సాక్షన్ చేసింది ఆమె కావడంతో.. ఈ విషయంలో తాము ఏం చేయలేమని చేతులెత్తేశారు బ్యాంక్ అధికారులు.
14వ ఏట నుంచి ఉద్యోగం చేయడం మొదలుపెట్టిన ఆరోరా.. ఒక్కో రూపాయిని కూడబెడుతూ వచ్చింది. ఆ డబ్బుతో తన కలల ఇంటిని నిర్మించుకోవాలని ఎంతో ఆశలు పెట్టుకుంది. కానీ చివరికి ఫోన్ బ్యాంకింగ్ స్కామ్‌కు బలైంది. 'ఇప్పుడు నా దగ్గర ఏం లేదు,' అని బాధపడుతూ.. మీడియాతో మాట్లాడింది ఆరోరా.
సంబంధిత కథనం