SBI hikes FD rates : ఎఫ్​డీలపై వడ్డీ రేట్లను పెంచిన ఎస్​బీఐ..-sbi hikes fixed deposit rates check latest fd rates details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Sbi Hikes Fixed Deposit Rates. Check Latest Fd Rates Details Here

SBI hikes FD rates : ఎఫ్​డీలపై వడ్డీ రేట్లను పెంచిన ఎస్​బీఐ..

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Dec 13, 2022 11:33 AM IST

SBI hikes FD rates : ఎఫ్​డీలపై వడ్డీ రేట్లను పెంచింది ఎస్​బీఐ. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

వడ్డీ రేట్లను పెంచిన ఎస్​బీఐ
వడ్డీ రేట్లను పెంచిన ఎస్​బీఐ (Reuters)

SBI hikes FD rates : ఫిక్స్​డ్​ డిపాజిట్ల(ఎఫ్​డీ)లపై వడ్డీ రేట్లను పెంచింది స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా(ఎస్​బీఐ). అయితే ఇవి కొన్ని ఎంపిక చేసిన పథకాలకు మాత్రమే వర్తిస్తాయి. రూ.2కోట్ల కన్నా తక్కువ విలువ ఉండే ఎఫ్​డీలపై పెంచిన వడ్డీ రేట్లు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. మెచ్యూర్​ అవుతున్న డిపాజిట్లను రెన్యూ చేసుకున్నా, కొత్తగా ఎఫ్​డీలు తీసుకున్నా.. తాజా వడ్డీ రేట్లు వరిస్తాయి.

ట్రెండింగ్ వార్తలు

"సవరించిన రీటైల్​ డొమెస్టిక్​ టర్మ్​ డిపాజిట్ల వడ్డీ రేట్లు 2022 డిసెంబర్​ 13 నుంచి అమల్లోకి వస్తాయి," అని ఓ అధికారిక ప్రకటన చేసింది ఎస్​బీఐ.

SBI FD interest rates : వడ్డీ రేట్ల పెంపుతో.. 7-45 రోజుల మధ్య మెచ్యూర్​ అయ్యే ఎఫ్​డీపై 3శాతం వడ్డీ లభిస్తోంది. 46-179 రోజుల మధ్య ఎఫ్​డీపై 3.9శాతం, 180-210రోజుల మధ్య 5.25శాతం వడ్డీ లభిస్తోంది. 211 రోజుల నుంచి 1 ఏడాది వరకు ఉండే ఎఫ్​డీలపై 5.75శాతం వడ్డీ రేటు వస్తోంది. 1-2ఏళ్ల మధ్యలో మెచ్యూర్​ అయ్యే ఎఫ్​డీపై 6.75శాతం, 2-3మూడేళ్ల వరకు అయితే 6.75శాతం, 3ఏళ్ల నుంచి 5ఏళ్ల వరకు- 5ఏళ్ల నుంచి 10ఏళ్ల వరకు అయితే 6.25శాతం వడ్డీ రేటు లభిస్తోంది. ఇవన్నీ సాధారణ ప్రజలకు వర్తించే నిబంధనలు.

కాగా.. సీనియర్​ సిటీజెన్​కు ఎఫ్​డీలపై వడ్డీ రేట్లు వేరుగా ఉన్నాయి. 7-45 రోజుల మధ్య ఉండే ఎఫ్​డీకి 3.50శాతం వడ్డీ లభిస్తోంది. ఇక 46రోజులు- 179రోజుల వరకు ఉండే ఫిక్స్​డ్​ డిపాజిట్​పై 3.50శతం, 46-197రోజుల వరకు ఉండే ఎఫ్​డీపై 5శాతం వరకు వడ్డీ ఇస్తోంది ఎస్​బీఐ. 180- 210 రోజుల మధ్య అయితే వడ్డీ రేటు 5.75శాతంగాను, 211 రోజుల నుంచి ఏడాది లోపు ముగిసే ఎఫ్​డీపై 6.25శాతం, ఏడాది- 2ఏళ్ల వరకు అయితే 7.25శాతం, 3ఏళ్ల నుంచి 5ఏళ్ల వరకు అయితే 6.75శాతం, 5ఏళ్ల నుంచి 10ఏళ్ల వరకు అయితే 7.25శాతం వడ్డీ లభిస్తోంది.

SBI FD interest rates December 2022 : బల్క్​ టర్మ్​ డిపాజిట్​ రేట్లను కూడా పెంచింది ఎస్​బీఐ. అన్నింటి మీదా 50-100 బేసిస్​ పాయింట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ఆర్​బీఐ.. వరుసగా ఐదోసారి..!

RBI rate hike : వరుసగా ఐదోసారి వడ్డీ రేట్లను పెంచుతూ గత బుధవారం నిర్ణయం తీసుకుంది ఆర్​బీఐ. ఈసారి 35 బేసిస్​ పాయింట్లు పెంచింది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు 2022 మే నెల నుంచి వడ్డీ రేట్లను పెంచూతూ వస్తోంది ఆర్​బీఐ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

WhatsApp channel

సంబంధిత కథనం