TTD Temple : తిరుమల నవంబ‌రు నెల వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా విడుదల-ttd special darshan november quota release for physically disabled and senior citizens on october 26 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ttd Special Darshan November Quota Release For Physically Disabled And Senior Citizens On October 26

TTD Temple : తిరుమల నవంబ‌రు నెల వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా విడుదల

HT Telugu Desk HT Telugu
Oct 25, 2022 05:11 PM IST

Tirumala Tirupati Devasthanam : తిరుమలలో వృద్ధులు, వికలాంగులకు సంబంధించిన ప్రత్యేక దర్శన కోటాను అక్టోబర్ 26న విడుదల చేయనున్నారు. నవంబర్ నెలకు సంబంధించి కోటా విడుదల కానుంది.

తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుమల తిరుపతి దేవస్థానం

తిరుమల(Tirumala) శ్రీవారిని దర్శించుకోడానికి వచ్చే వృద్ధులు, వికలాంగుల ప్రత్యేక దర్శన కోటా విడుదల కానుంది. అక్టోబ‌రు 26వ తేదీన మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ(TTD) ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది. నవంబర్ నెలకు సంబంధించిన ఉచిత‌ ప్రత్యేక ద‌ర్శనం టోకెన్ల కోటా విడుదల చేయనున్నారు. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి ఆన్‌లైన్‌లో ఉచిత దర్శన టోకెన్లు బుక్ చేసుకోవాల‌ని టీటీడీ కోరింది.

సూర్యగ్రహణం కారణంగా మంగళవారం ఉదయం 8 గంట‌ల‌కు టీటీడీ అనుబంధ ఆలయాలైన తిరుచానూరు(Tiruchanur) శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, శ్రీనివాసమంగాపురం(Srinivasa Mangapuram) శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయాలను మూసివేశారు.

మంగళవారం సాయంత్రం 4 నుండి రాత్రి 7 గంట‌లకు సూర్యగ్రహణం పూర్తవుతుంది. గ్రహణ సమయానికి 6 గంటలు ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది. రాత్రి ఆలయశుద్ధి, కైంకర్యాలు నిర్వహిస్తారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం