Gold Purchase : బంగారం ఎక్కువగా కొనేది ఏ జిల్లాలో తెలుసా?-this district from andhra pradesh purchase highest gold here s full details ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  This District From Andhra Pradesh Purchase Highest Gold Here's Full Details

Gold Purchase : బంగారం ఎక్కువగా కొనేది ఏ జిల్లాలో తెలుసా?

HT Telugu Desk HT Telugu
Nov 23, 2022 02:31 PM IST

Gold Purchase : బంగారమటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఈ కాలంలో పండగలకే కాదు.. చేతిలో కాస్త డబ్బు ఉంటే.. ముందుగా వచ్చే ఆలోచన బంగారం కొనేయడం. ఇప్పుడు అదో పొదుపు మంత్రం కూడా. మరి ఇండియాలో చూస్తే.. కొన్ని జిల్లాలు అధిక బంగారం కొనుగోలు చేసేవి ఉన్నాయి. అందులో ఏపీలోని ఓ జిల్లా కూడా ఉంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

పసిడి(Gold) అంటే.. ఈ కాలంలో ఓ పొదుపు. ఎక్కడో ఇన్వెస్ట్ మెంట్(Investment) చేసి.. పొగొట్టుకునే బదులు బంగారం కొనేస్తే అయిపోద్ది కదా అనుకునేవారే చాలామంది. భారతీయ మహిళలకు బంగారమంటే పిచ్చి. ఇప్పుడు మగవారికి కూడా బంగారం కొనుగోలు చేయాలనే ఆలోచన ఎక్కువైపోయింది. అత్యవసర సమయాల్లో అదే ఆదుకుంటుంది. ఓ వైపు పొదుపు, మరోవైపు అత్యవసర సమయాల్లో ఉపయోగపడుతుందని.. పసిడి కొనేందుకు ఇంట్రస్ట్ చూపిస్తుంటారు చాలామంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ప్రపంచంలో బంగారం(Gold) వినియోగంలో భారత్(India) రెండో స్థానంలో ఉంది. ఓ వైపు ఆభరణాలు, పెట్టుబడికి బలమైన డిమాండ్ తో ఎక్కువగా జనాలు ఆసక్తి చూపిస్తుంటారు. కోట్ల విలువు చేసే బంగారం ఇండియాకు దిగుమతి అవుతూ ఉంటుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో(Telugu States)నూ బంగారానికి చాలా క్రేజ్. ఒకప్పుడు పండగల సందర్భంగా పసిడి కొనేవారు.. కానీ ఇప్పుడు ఏ సమయంలో గోల్డ్ షాప్(gold shop) వెళ్లినా.. ఆంధ్రప్రదేశ్(andhra prades), తెలంగాణ(telangana)లో జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. మరి ఎక్కడి ప్రజలు బంగారాన్ని ఎక్కువగా కొంటుంటారు. ఇండియాలో చూసుకుంటే.. ఏపీలోని కృష్ణా(krishna district) జిల్లాలోనూ బంగారం ఎక్కువగా కొంటున్నారని మనీ9 సర్వేలో తేలింది.

ఈ సర్వే ప్రకారం చూసుకుంటే.. కర్ణాటక(karnataka)లోనే ఎక్కువ కుటుంబాలు బంగారం కొనుగోలు చేస్తున్నాయి. ఆ తర్వాత గుజరాత్(gujarat)లోని సూరత్, మహారాష్ట్రలోని థానే, ఏపీలోని కృష్ణా జిల్లాలు ఉన్నాయి. కర్ణాటకలోని బల్లారితోపాటుగా ఉత్తర కన్నడ(kannada) జిల్లాలు దేశంలో ఎక్కువగా బంగారం నిల్వలు ఉన్నాయి. ఇండియాలో గోల్డ్(gold)ను పొదుపు ప్రయోజనం కోసం కొంటున్నారు. ఇందులో ఎక్కువ మధ్యతరగతి వారే ఉంటున్నారు.

నెలకు ఆదాయం 50 వేల రూపాయల కంటే ఎక్కువగా ఉన్నవారు.. పొదుపు కోసం బంగారం(Gold) కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. ఇండియాలో ఏడాదికి 800 టన్నుల బంగారం ఖర్చవుతుంటే.. అందులో 600 టన్నులు ఆభరణాలుగా భద్రంగా ఉంటున్నాయని తెలుస్తోంది. ఇన్వెస్ట్ మెంట్ లో భాగంగా.. 180 టన్నులకు పైగా గోల్డ్ కడ్డీలు, నాణేలుగా ఉంటున్నాయి. బంగారాన్ని వినియోగించేది మాత్రం ఎక్కువగా అధిక ఆధాయ(Income) వ్యక్తులే. 15 శాతం కుటుంబాలు పొదుపు కోసం బంగారాన్ని కొంటున్నాయి. ఇందులో 29 శాతం వాటా చూస్తే.. నెల ఆదాయం 50 వేల కంటే ఎక్కువగా ఉన్నవారివే. తక్కువ ఆదాయం కలిగిన వారిలో 8 శాతం పొదుపు కోసం బంగారాన్ని కొంటున్నారు.

IPL_Entry_Point